...
...
Next Story

రాజానగరంలో త్వరలో జూపార్కు ఏర్పాటు కానుంది : ఎంపీ పురంధేశ్వరి

రాజానగరంలో త్వరలో జూపార్కు ఏర్పాటు కానుందని ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. ఇక్కడ ప్రకృతి పర్యాటకానికి అనుకూలమని వెల్లడించారు.

Published on: Jan 8, 2026, 11:38:22 IST
Advertisement

తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలోని దివాన్‌చెరువు అటవీ ప్రాంతంలో జూ పార్క్‌ను ఏర్పాటు చేయనున్నట్లు రాజమండ్రి ఎంపీ దగ్గబాటి పురందేశ్వరి తెలిపారు. ఈ పార్కుకు సంబంధించిన తన ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని ఆమె అన్నారు. ప్రకృతి ప్రేమికులు, పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునేలా రాజానగరంలో జూపార్కు ఏర్పాటు చేయనున్నట్లు ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి వెల్లడించారు.

అధికారులతో ఎంపీ పురంధేశ్వరి
అధికారులతో ఎంపీ పురంధేశ్వరి

రాజానగరం మండల పరిధిలోని దివాన్‌చెరువులో ఉన్న అటవీ భూమిని ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి నేతృత్వంలో ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర బృందం సభ్యులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఈ ప్రతిపాదనకు సానుకూల స్పందన లభించిందని, సాధ్యాసాధ్యాల పరిశీలన అనంతరం త్వరలో కార్యాచరణ రూపకల్పన చేయనున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రాంత భౌగోళిక పరిస్థితులు, అటవీ విస్తీర్ణం, పర్యావరణ అనుకూలతలపై కేంద్ర పరిశీలన కోసం వచ్చిన సభ్యులతో కలిసి క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేశామన్నారు.

ప్రకృతి పర్యాటక అభివృద్ధికి ఈ ప్రాంతం అన్ని విధాలా అనుకూలమని ఎంపీ తెలిపారు. ప్రస్తుతం రాజానగరంలో సుమారు 311 హెక్టార్ల రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా ఉందని, అందులో 250 హెక్టార్ల భూమిని జూపార్కు కోసం వినియోగించుకునే అవకాశం ఉందన్నారు. ఈ ప్రతిపాదనను కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన సానుకూలంగా స్పందించి సాధ్యాసాధ్యాల పరిశీలన కోసం ఆఫీసర్ బెన్ నేతృత్వంలోని బృందాన్ని రాజానగరానికి పంపినట్లు ఎంపీ పురంధేశ్వరి వివరించారు.

రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, సెంట్రల్ జూ అథారిటీ సభ్య కార్యదర్శి డా. వి. క్లెమెంట్ బెన్, వన్యప్రాణి, ప్రాజెక్ట్ ఎలిఫెంట్, ఫారెస్ట్ ప్రొటెక్షన్, రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ సీజేఎకు చెందిన అజయ్, డీఎఫ్‌ఓ రాజమహేంద్రవరం బి.ప్రభాకర రావు తదితర అధికారులు క్షేత్రస్థాయి పరిశీలనలో ఉన్నారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe