2025లో సెలబ్రిటీ కాంట్రవర్సీలు-దీపికా పదుకొణె నుంచి శివాజీ వరకు-మధ్యలో స్మృతి పెళ్లి రద్దు-ఓ లుక్కేయండి
2025 ఏడాదిలో సెలబ్రిటీ కాంట్రవర్సీలు బాగానే వార్తల్లో నిలిచాయి. దీపికా పదుకోణే 8 గంటల వర్క్ డిమాండ్ నుంచి శివాజీ తాజా ‘సామాన్లు’ కామెంట్ల వరకూ వివాదాలు కొనసాగాయి. మధ్యలో స్మృతి, పలాష్ పెళ్లి రద్దు హాట్ టాపిక్ గా మారింది.
2025 సంవత్సరం మరోసారి నిరూపించింది. భారతదేశంలో సెలబ్రిటీ సంస్కృతి కేవలం సినిమా తెరలు లేదా క్రికెట్ మైదానాలకు మాత్రమే పరిమితం కాదని చాటింది. ఈ ఏడాది సెలబ్రిటీల కాంట్రవర్సీలు పదే పదే వార్తల్లో నిలిచాయి. ఇందులో దీపికా పదుకొణే 8 గంటల వర్క్ డిమాండ్ నుంచి తాజాగా శివాజీ అసభ్యకర కామెంట్ల వరకూ ఉన్నాయి. మధ్యలో స్మృతి మంధాన పెళ్లి రద్దు సంచలనంగా మారింది.

దీపికా పదుకొణే 8 గంటల వర్క్
సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న 'స్పిరిట్' సినిమా నుంచి హీరోయిన్ గా దీపికా పదుకొణేను తప్పించడం వైరల్ గా మారింది. ఆమె 8 గంటల వర్క్ డిమాండ్ ప్రధాన కారణమనే వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ప్రభాస్ హీరోగా రావాల్సి ఉన్న 'కల్కి 2898 AD' సీక్వెల్ నుంచి కూడా దీపికాను తప్పించడం కలకలం రేపింది. దీనిపై కౌంటర్లు, ప్రతి కౌంటర్లు కనిపించాయి.
ఇండియాస్ గాట్ లేటెంట్
రణవీర్ అలాహాబాదియా ఒక ఎపిసోడ్‌లో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు వైరల్ కావడంతో, 'ఇండియాస్ గాట్ లేటెంట్' అనే సమయ్ రైనా షో తీవ్రమైన ట్రోల్ కు గురైంది. సోషల్ మీడియాలో విస్తృత విమర్శలకు దారితీసింది. పాడ్‌కాస్టర్ తర్వాత తన వ్యాఖ్యలు అనుచితంగా ఉండటమే కాకుండా హాస్యం లోపించిందని అంగీకరిస్తూ రణవీర్ బహిరంగంగా క్షమాపణలు చెప్పాడు. దివ్యాంగుల పట్ల అనుచితమైన వ్యాఖ్యలు చేసినందుకు సుప్రీంకోర్టు రైనాను మందలించింది,
రణవీర్ సింగ్ కాంతారా యాక్ట్
IFFI 2025 ఈవెంట్ లో 'కాంతార: చాప్టర్ 1' లోని నటుడు రిషబ్ శెట్టిని అనుకరిస్తూ రణవీర్ సింగ్ వెటకారంగా చేసి యాక్ట్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. నటుడు రణవీర్ సింగ్‌పై ఫిర్యాదు నమోదైంది. న్యాయవాది ప్రశాంత్ బెతాల్, కర్ణాటక ప్రజల "మతపరమైన భావాలను" బాధించినట్లు ఆరోపిస్తూ, భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 302, 299, 354 కింద హై గ్రౌండ్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు దాఖలు చేశారు. ఆ తర్వాత రణవీర్ క్షమాపణలు చెప్పాడు.
జయా బచ్చన్ వర్సెస్ ఫొటోగ్రాఫర్లు
అమితాబ్ బచ్చన్ భార్య జయ బచ్చన్ ఇటీవల ఫొటోగ్రాఫర్లపై ఆగ్రహం వెళ్లగక్కడం తెలిసిందే. ఇది తరచుగా గోప్యత, సమ్మతి, మీడియా నీతి నియమాలపై చర్చలను పునరుద్ధరించింది. ఇటీవల జయ బచ్చన్ ఈనాటి పాపరాజీ దృశ్యాన్ని "వింత"గా అభివర్ణించింది. దాని నైతికత, వృత్తి నైపుణ్యంపై ప్రశ్నలు లేవనెత్తింది. కేవలం ఫోన్ కలిగి ఉండటం వారికి అధికారాన్ని ఇస్తుందని నమ్మే వ్యక్తులుగా పాపరాజీల పాత్ర, విశ్వసనీయతపై ఆమె విరుచుకుపడింది.
కరిష్మా కపూర్-ప్రియా సచ్‌దేవ్ లీగల్ బాటిల్
ఈ ఏడాది జూన్‌లో కరిష్మా కపూర్ మాజీ భర్త సంజయ్ కపూర్ మరణించిన తర్వాత, అతని ఆస్తులకు సంబంధించిన కీలక పత్రాలు, అతని పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్‌పై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. కరిష్మా కపూర్ పిల్లలు.. సంజయ్ కపూర్ ఆస్తులను విక్రయించకుండా లేదా అన్యాక్రాంతం చేయకుండా ప్రియా కపూర్‌కు వ్యతిరేకంగా స్టే కోరారు. కరిష్మా కపూర్, సంజయ్ కపూర్ 2016లో విడిపోయారు. వీళ్లకు ఇద్దరు పిల్లలు. సంజయ్ తర్వాత ప్రియా సచ్‌దేవ్ కపూర్‌ను వివాహం చేసుకున్నారు.
సైఫ్ అలీ ఖాన్ కత్తిపోటు
ఈ ఏడాది జనవరిలో నటుడు సైఫ్ అలీ ఖాన్ కత్తిపోటు సంఘటన కలకలం రేపింది. అతని బాంద్రా నివాసంలోకి చొరబడిన దుండగుడు సైఫ్ లో హత్యాయత్నం చేశాడు. సంఘటన సమయంలో సైఫ్ తీవ్రంగా గాయపడ్డాడు. నటుడిని లీలావతి హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ అతను ఐదు రోజులు చికిత్స పొంది, జనవరి 21న డిశ్చార్జ్ అయ్యాడు.
పలాష్ ముచ్చల్, స్మృతి పెళ్లి
టీమిండియా స్టార్ వుమెన్ క్రికెటర్ స్మృతి మంధాన, మ్యూజిక్ డైరెక్టర్ పలాష్ ముచ్చల్ పెళ్లి రద్దు కూడా ప్రధానంగా వార్తల్లో నిలిచింది. నిజానికి నవంబర్ 23, 2025న పలాష్, స్మృతి పెళ్లి చేసుకోవాల్సింది. కానీ ఆ రోజు ఉదయం స్మృతి తండ్రి శ్రీనివాస్ కు గుండె పోటు వచ్చిందని పెళ్లి వాయిదా వేశారు. ఆ తర్వాత రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించారు.
శివాజీ కామెంట్లు
తెలుగు సీనియర్ నటుడు శివాజీ తాజాగా చేసిన కామెంట్లు కాంట్రవర్సీకి దారితీశాయి. హీరోయిన్లు డ్రెస్ విషయంపై మాట్లాడుతూ ‘సామాన్లు’, ‘దొంగ ము**’ అనే మాటలు వాడాడు శివాజీ. దీనిపై మహిళా కమిషన్ కూడా సీరియస్ అయింది. అనసూయ, శివాజీ మాటల వార్ వైరల్ గా మారింది. చివరకు శివాజీ సారీ చెప్పాడు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


