OTT Tamil: ఏకంగా 9.1 రేటింగ్.. తెలుగులోనూ ఓటీటీలోకి వచ్చేస్తున్న తమిళ రొమాంటిక్ డ్రామా..క్యారెక్టర్ గా మైండ్ వాయిస్

OTT Tamil: ఓటీటీలోకి ఓ తమిళ రొమాంటిక్ డ్రామా మూవీ రాబోతుంది. ఈ చిత్రానికి ఐఎండీబీలో ఏకంగా 9.1 రేటింగ్ ఉండటం విశేషం. ఈ సినిమా తెలుగులోనూ డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. పూర్తి వివరాలను ఇక్కడ చూసేయండి.

Published on: May 31, 2026, 08:31:33 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

OTT Tamil: ఓటీటీలో మలయాళ, తమిళ్, కన్నడ భాషల్లోని సినిమాలను తెలుగు ఆడియన్స్ ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తుంటారు. మంచి కంటెంట్ ఉంటే చాలు ఇతర భాషల సినిమాలు అనే భేధం లేకుండా చూసేస్తారు. ఇప్పుడు తెలుగు ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు ఓ తమిళ రొమాంటిక్ డ్రామా వచ్చేస్తోంది. ఆ సినిమా పేరే ‘29’. ఈ మూవీ ఓటీటీ రిలీజ్ పై అప్ డేట్ వచ్చేసింది.

ఓటీటీలోకి వచ్చేస్తున్న తమిళ రొమాంటిక్ డ్రామా (x)
ఓటీటీలోకి వచ్చేస్తున్న తమిళ రొమాంటిక్ డ్రామా (x)

29 ఓటీటీ

తమిళంలో డిఫరెంట్ కంటెంట్ తో, టైటిల్స్ తో మూవీస్ వస్తూనే ఉంటాయి. అలా డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన చిత్రమే ‘29’. 29 ఏళ్ల ఏజ్ లో ఓ యువకుడి జీవితం ఎలాంటి మలుపులు తీసుకుందనే స్టోరీ లైన్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ మూవీ ఓటీటీలోకి రాబోతుంది. పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

ఎప్పుడంటే?

తమిళ రొమాంటిక్ డ్రామా ‘29’ మూవీ నెట్‌ఫ్లిక్స్ లో జూన్ 5 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు ఆ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ‘కమింగ్ ఆన్ ఫ్రైడే’ లిస్ట్ లో ‘29’ చిత్రాన్ని చేర్చారు. ఈ సినిమా తెలుగు ఆడియన్స్ కోసం తెలుగులోనూ రిలీజ్ కానుంది. తమిళ్, తెలుగుతో పాటు మలయాళం, కన్నడ, హిందీ భాషల్లోనూ పాన్ ఇండియా ఆడియన్స్ కు రీచ్ అయ్యేలా స్ట్రీమింగ్ కానుంది.

నెల రోజుల్లోపే

‘29’ మూవీ నెల రోజుల్లోనే ఓటీటీలోకి రానుంది. మే 8, 2026న థియేటర్లలో ఈ చిత్రం రిలీజ్ అయింది. జూన్ 5న ఓటీటీలో విడుదల కానుంది. ఈ సినిమాలో విధు, ప్రీతి అస్రాని లీడ్ రోల్స్ ప్లే చేశారు. ఈ మూవీకి రత్న కుమార్ డైరెక్టర్. వైట్ కార్పెట్ ఫిల్మ్స్ బ్యానర్ పై కార్తీక్ సుబ్బరాజు, కార్తికేయన్ సంతానం, లోకేష్ కనగరాజు నిర్మించారు. ఈ మూవీకి ఐఎండీబీలో ఏకంగా 9.1 రేటింగ్ ఉంది.

29 మూవీ స్టోరీ

సత్య (విధు) 29 ఏళ్ల యువకుడు. ఆ ఏజ్ లో ఉండే అందరి యువకుల్లానే గుర్తింపు కోసం ఆరాటపడతాడు. అగ్రికల్చర్ డిగ్రీ చేసిన సత్య చెన్నైలో ఓ జాబ్ చేస్తుంటాడు. అతనికి, తల్లికి మధ్య విభేధాలుంటాయి. ఫ్రెండ్స్ తో కలిసి అతను రూమ్ లో ఉంటాడు. అయితే తన మైండ్ వాయిస్ మాత్రం ‘నేను ఎవరు?’ అని సత్యను ప్రశ్నిస్తూనే ఉంటుంది.

అమ్మాయి రాకతో

ఈ పరిస్థితుల్లో సత్య జీవితంలోకి ఓ అమ్మాయి విజయలక్ష్మి వస్తుంది. దీంతో అతని లైఫ్ లో ఊహించని సంఘటనలు జరుగుతాయి. అతని మైండ్ వాయిస్ ఏకంగా ఓ క్యారెక్టర్ గా మారి విజయలక్ష్మి గురించి పూర్తిగా తెలుసుకునేందుకు ప్రయత్నిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు విజయలక్ష్మి ఎవరు? అనేది ‘29’ మూవీలో చూసి తెలుసుకోవాల్సిందే.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More