National Awards 2026: అటు సీనియర్.. ఇటు జూనియర్.. ఇద్దరికి బెస్ట్ యాక్టర్.. 72 నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ కంప్లీట్ లిస్ట్!
National Awards 2026: కేంద్ర ప్రభుత్వం 72వ జాతీయ చలనచిత్ర అవార్డులను ప్రకటించింది. 'ఆర్టికల్ 370' ఉత్తమ చిత్రంగా నిలవగా, మమ్ముట్టి, కార్తీక్ ఆర్యన్, యామీ గౌతమ్ ఉత్తమ నటీనటులుగా నిలిచారు. తెలుగు చిత్రాలు 'కల్కి', 'పుష్ప 2', 'కమిటీ కుర్రోళ్లు' సత్తా చాటాయి. పూర్తి అవార్డుల లిస్ట్ పై ఓ లుక్కేయండి.
National Awards 2026: భారతీయ చలనచిత్ర రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల (72 National Film Awards)ను కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీలో అధికారికంగా వెల్లడించింది. దేశవ్యాప్తంగా వివిధ భాషల నుంచి వచ్చిన దాదాపు 400 పోటీ ఎంట్రీలను జాతీయ జ్యూరీ సభ్యులు క్షుణ్ణంగా పరిశీలించి విజేతలను ఎంపిక చేశారు.

2024 'సినిమాలకు
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ద్వారా 2024 సంవత్సరంలో సర్టిఫికేట్ పొందిన చిత్రాలను ఈ అవార్డుల కోసం పరిగణనలోకి తీసుకున్నారు. ఈ ఏడాది నేషనల్ ఫిల్మ్ అవార్డుల్లో 'ఆర్టికల్ 370' సినిమాతో పాటు స్టార్ హీరోలు మమ్ముట్టి, కార్తీక్ ఆర్యన్, నటి యామీ గౌతమ్ జాతీయ పురస్కారాలతో తమ సత్తా చాటారు.
మన టాలీవుడ్ నుంచి 'కల్కి 2898 AD', 'పుష్ప 2', 'కమిటీ కుర్రోళ్లు', '35 – చిన్న కథ కాదు' చిత్రాలు నేషనల్ ఫిల్మ్ అవార్డుల పంట పండించి తెలుగు సినిమా ఖ్యాతిని జాతీయ స్థాయిలో నిలబెట్టాయి.
బెస్ట్ యాక్టర్
ప్రధాన విభాగాల్లో ఈసారి తీవ్ర పోటీ నెలకొంది. 'భ్రమయుగం' సినిమాలో చూపించిన అద్భుత నటనకు గాను మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును అందుకున్నారు. ఆయనతో పాటు 'చందు ఛాంపియన్' చిత్రంలో చూపించిన అసాధారణ ప్రతిభకు బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్ కూడా ఉత్తమ నటుడి అవార్డును పంచుకున్నాడు.
ఇక 'ఆర్టికల్ 370' చిత్రంలో పవర్‌ఫుల్ ప్రదర్శన ఇచ్చిన యామీ గౌతమ్ ఉత్తమ నటిగా జాతీయ పురస్కారాన్ని కైవసం చేసుకుంది. 'అమరన్' చిత్రానికి గాను రాజ్ కుమార్ పెరియాసామి ఉత్తమ దర్శకుడిగా ఎంపికయ్యాడు.
తెలుగు సినిమాల హవా
ఈ ఏడాది జాతీయ అవార్డుల్లో తెలుగు చిత్ర పరిశ్రమ సాంకేతిక విభాగాలతో పాటు ప్రధాన విభాగాల్లోనూ అదరగొట్టింది. గ్లోబల్ హిట్ సాధించిన 'కల్కి 2898 AD' చిత్రం ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా (హోల్‌సమ్ ఎంటర్‌టైన్‌మెంట్) నిలిచింది. ఈ సినిమాకు అద్భుతమైన సెట్టింగులు వేసిన నితిన్ జిహాన్ చౌదరి ఉత్తమ ప్రొడక్షన్ డిజైనర్‌గా అవార్డు అందుకున్నారు.
సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 'పుష్ప 2: ది రూల్' చిత్రానికి గాను సుకుమార్ ఉత్తమ స్క్రీన్‌ప్లే రచయితగా నిలిచాడు. చిన్న చిత్రాలుగా వచ్చి పెద్ద విజయం సాధించిన 'కమిటీ కుర్రోళ్లు' ఉత్తమ తెలుగు చిత్రంగా నిలవగా, ఈ సినిమాకు పని చేసిన పి. రవికుమార్ ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్‌గా అవార్డు గెలుచుకున్నాడు. అలాగే '35 – చిన్న కథ కాదు' సినిమా ఉత్తమ బాలల చిత్రంగా నిలిచింది. ఈ సినిమాలో నటించిన అరుణ్ దేవ్ పోతులకు ఉత్తమ బాలనటుడి పురస్కారం లభించింది.
72వ జాతీయ చలనచిత్ర అవార్డుల పూర్తి విజేతల జాబితా
ఉత్తమ చిత్రం: ఆర్టికల్ 370
ఉత్తమ నటుడు: మమ్ముట్టి (భ్రమయుగం), కార్తీక్ ఆర్యన్ (చందు ఛాంపియన్)
ఉత్తమ నటి: యామీ గౌతమ్ (ఆర్టికల్ 370)
ఉత్తమ దర్శకత్వం: రాజ్ కుమార్ పెరియాసామి (అమరన్)
ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం: కల్కి 2898 AD
ఉత్తమ డెబ్యూ (తొలి) చిత్రం: స్వాతంత్య్ర వీర్ సావర్కర్
జాతీయ, సామాజిక, పర్యావరణ విలువలను పెంపొందించే ఉత్తమ చిత్రం: కెప్టెన్ మిల్లర్
ఉత్తమ బాలల చిత్రం: 35 – చిన్న కథ కాదు
ఉత్తమ సహాయ నటుడు/నటి: సంజయ్ మిశ్రా (భక్షక్), సచన నమిదాస్ (మహారాజ), రూపశ్రీ వర్కాడి (మిత్య)
ఉత్తమ బాలనటులు: అరుణ్ దేవ్ పోతుల (35 – చిన్న కథ కాదు), అతిష్ ఎస్ శెట్టి (మిత్య), రిద్దిమాన్ బెనర్జీ, తోపోమోయ్ దేబ్, గీతాశ్రీ చక్రవర్తి (ఒంకో కి కొథిన్)
ఉత్తమ స్క్రీన్‌ప్లే: సుకుమార్ (పుష్ప 2), యోగేష్ దేశ్‌పాండే (స్వర్గంధర్వ సుధీర్ ఫడ్కే)
ఉత్తమ సంభాషణలు (డైలాగ్స్): వెంకీ అట్లూరి (లక్కీ భాస్కర్)
ఉత్తమ సంగీత దర్శకత్వం: జి.వి. ప్రకాష్ కుమార్ (అమరన్), శాశ్వత్ సచ్‌దేవ్ (ఆర్టికల్ 370)
ఉత్తమ సాహిత్యం: మనోజ్ ముంతాషిర్ (జానే దో - మైదాన్)
ఉత్తమ నేపథ్య గాయకులు: వైకోమ్ విజయలక్ష్మి (ARM), అభయ్ జోధ్‌పూర్కర్ (ఘరాత్ గణపతి)
ఉత్తమ యాక్షన్ కొరియోగ్రఫీ (ఫైట్స్): అని అరసు (మహారాజ)
ఉత్తమ నృత్య దర్శకత్వం (కొరియోగ్రఫీ): విజయ్ గంగూలీ (స్త్రీ 2)
ఉత్తమ సినిమాటోగ్రఫీ: షెహనాద్ జలాల్ (భ్రమయుగం)
ఉత్తమ ఎడిటింగ్: ఆర్. కలైవానన్ (అమరన్)
ఉత్తమ సౌండ్ డిజైన్: మానస్ చౌదరి (భూల్ భులయ్యా 3)
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: నితిన్ జిహాన్ చౌదరి (కల్కి 2898 AD)
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్: దీపాలి నూర్, శీతల్ శర్మ (పుష్ప 2)
ఉత్తమ మేకప్: పి. రవి కుమార్ (కమిటీ కుర్రోళ్లు)
ప్రత్యేక ప్రశంసలు (స్పెషల్ మెన్షన్స్): ధనుష్ (కెప్టెన్ మిల్లర్), సురేన్ జి (II మెయ్యళగన్)
ప్రాంతీయ భాషల్లో ఉత్తమ చిత్రాలు:
ఉత్తమ తెలుగు చిత్రం: కమిటీ కుర్రోళ్లు
ఉత్తమ తమిళ చిత్రం: రాయన్
ఉత్తమ మలయాళ చిత్రం: ఫెమినిచ్చి ఫాతిమా
ఉత్తమ కన్నడ చిత్రం: మిత్య
ఉత్తమ హిందీ చిత్రం: శ్రీకాంత్
ఉత్తమ మరాఠీ చిత్రం: ముక్కామ్ పోస్ట్ బొంబిల్వాడి
ఉత్తమ గుజరాతీ చిత్రం: మారన్
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


