ఈటీవీ విన్ ఓటీటీలో వచ్చిన #90's వెబ్ సిరీస్ లో సాంప్రదాయిని సుప్పిని అంటూ ఆదిత్య పాత్రలో నటించిన రోహన్ రాయ్ గుర్తున్నాడు. ఇప్పుడు అతడు తొడగొట్టి మరీ విజయ్ దేవరకొండకు సవాలు విసిరాడు. దీనికి రౌడీ బాయ్ కూడా ఎక్స్ వేదికగా రియాక్ట్ కావడం విశేషం. నీకు ఏది కావాలంటే అది ఇస్తానని అన్నాడు.
రోహన్ తొడగొట్టి..

ఈటీవీ విన్ ఓటీటీలో వచ్చిన ఆ #90's వెబ్ సిరీస్ తో ప్రతి తెలుగు వారి ఇంట్లో ప్రత్యేక స్థానం సంపాదించిన చైల్డ్ ఆర్టిస్ట్ రోహన్ రాయ్. తాజాగా అతడు ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో అనే మూవీలో నటించాడు. ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ సందర్భంగా అతడు మాట్లాడాడు.
అప్పుడే అతడు తొడగొట్టి.. విజయ్ దేవరకొండన్నా.. టీజర్ రిలీజ్ అప్పుడు కూడా చెప్పాను.. నా సైజు ఎస్.. మా మొత్తం టీమ్ కు రౌడీ షర్టులు రెడీగా పెట్టుకో అని అతడు అన్నాడు. ఈ వీడియో తెగ వైరల్ అయింది. దీనిని చూసిన విజయ్ ఎక్స్ లోనే స్పందించాడు.
నీకు ఏం కావాలన్నా ఇస్తా
సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోపై గురువారం (నవంబర్ 6) రాత్రి విజయ్ దేవరకొండ స్పందించాడు. ఆ వీడియోను రీట్వీట్ చేస్తూ.. “రోహన్.. నీకు ఏది కావాలంటే అది నేనిస్తాను. 90's చూసినప్పటి నుంచీ నేను నీ అభిమానిని. నేను నిన్న త్వరలోనే కలుస్తాను. ప్రీ వెడ్డింగ్ షో టీమ్ మొత్తానికి సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను” అని విజయ్ ట్వీట్ చేశాడు.
ది గ్రేట్ ప్రీవెడ్డింగ్ షో గురించి..
ది గ్రేట్ ప్రీవెడ్డింగ్ షో సినిమాను రాహుల్ శ్రీనివాస్ డైరెక్ట్ చేశాడు. ఇందులో తిరువీర్, టీనా శ్రావ్య, మాస్టర్ రోహన్ లాంటి వాళ్లు నటించారు. సురేష్ బొబ్బిలి మ్యూజిక్ అందించాడు. శుక్రవారం (నవంబర్ 7) రిలీజైన ఈ సినిమాకు మంచి రివ్యూలే వస్తున్నాయి. ఈ మూవీలో ప్రీ వెడ్డింగ్ షూట్ కు సంబంధించిన చిప్ పోవడం, దానిని వెతకడం, ఆ క్రమంలో ఎదురయ్యే ఫన్నీ అనుభవాల చుట్టూ తిరుగుతుంది. ఇందులో రమేష్ అనే పాత్రలో తిరువీర్, రామ్ చరణ్ పాత్రలో మాస్టర్ రోహన్ నటించారు.
{{/usCountry}}ది గ్రేట్ ప్రీవెడ్డింగ్ షో సినిమాను రాహుల్ శ్రీనివాస్ డైరెక్ట్ చేశాడు. ఇందులో తిరువీర్, టీనా శ్రావ్య, మాస్టర్ రోహన్ లాంటి వాళ్లు నటించారు. సురేష్ బొబ్బిలి మ్యూజిక్ అందించాడు. శుక్రవారం (నవంబర్ 7) రిలీజైన ఈ సినిమాకు మంచి రివ్యూలే వస్తున్నాయి. ఈ మూవీలో ప్రీ వెడ్డింగ్ షూట్ కు సంబంధించిన చిప్ పోవడం, దానిని వెతకడం, ఆ క్రమంలో ఎదురయ్యే ఫన్నీ అనుభవాల చుట్టూ తిరుగుతుంది. ఇందులో రమేష్ అనే పాత్రలో తిరువీర్, రామ్ చరణ్ పాత్రలో మాస్టర్ రోహన్ నటించారు.
{{/usCountry}}