మన శంకర వర ప్రసాద్ గారు సినిమాకు ఒకే ఫ్యామిలీ నుంచి 140 మంది.. ట్రాక్టర్, కార్లతో ర్యాలీగా-వైరల్ వీడియో

మన శంకర వర ప్రసాద్ గారు మేనియా అంతటా పాకిపోయింది. ఫ్యామిలీలకు ఫ్యామిలీలు థియేటర్లకు వరుస కడుతున్నారు. ఒకే కుటుంబానికి చెందిన 140 మంది ఈ సినిమాకు కలిసి వెళ్లడం విశేషం. ఈ వీడియో వైరల్ గా మారింది. 

Jan 18, 2026, 16:28:21 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఒకప్పుడు చిరంజీవి సినిమా అంటే ఊర్లకు ఊర్లే వెళ్లిపోయేవని అంటుంటారు. కానీ ఆయన మధ్యలో పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడంతో ఈ ఫ్యాన్ ఫాలోయింగ్ కు బ్రేక్ పడింది. తిరిగి సినిమాల్లోకి వచ్చినా ఫ్యామిలీ ఆడియన్స్ కు నచ్చే మూవీ రావడానికి టైమ్ పట్టింది. ఇప్పుడు మన శంకర వర ప్రసాద్ గారు సినిమాతో ఆ టైమ్ వచ్చింది. ఒకే ఫ్యామిలీ నుంచి 140 మంది సినిమాకు వెళ్లిన వీడియో ఒకటి వైరల్ గా మారింది.

మన శంకర వర ప్రసాద్ గారులో చిరంజీవి
మన శంకర వర ప్రసాద్ గారులో చిరంజీవి

ఒకే ఫ్యామిలీ నుంచి 140 మంది

చిరంజీవి పర్ఫెక్ట్ ఫ్యామిలీ మూవీతో వస్తే రిజల్ట్ ఎలా ఉంటుందనేది మరోసారి మన శంకర వర ప్రసాద్ గారు సినిమాతో స్పష్టమవుతోంది. ఈ మూవీకి ఒకే ఫ్యామిలీ నుంచి ఏకంగా 140 మంది వెళ్లారు. ట్రాక్టర్, కార్లపై సినిమా చూసేందుకు వెళ్లారు. వీళ్లంతా మూవీకి వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అత్యధిక కలెక్షన్లు

చిరంజీవి కెరీర్ లోనే అత్యధిక గ్రాస్ కలెక్షన్లు సాధించిన సినిమాగా మన శంకర వర ప్రసాద్ గారు నిలిచింది. ఆరు రోజుల్లోనే ఈ మూవీ రూ.261 కోట్ల గ్రాస్ వసూళ్లతో సైరా నరసింహా రెడ్డి (రూ.246.6 కోట్లు) రికార్డును బ్రేక్ చేసింది. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న మన శంకర వర ప్రసాద్ గారు మూవీ రిలీజైంది.

మన శంకర వర ప్రసాద్ గారు మూవీ స్టోరీ

ఇండియన్ సెక్యూరిటీ ఏజెన్సీలో శంకర వరప్రసాద్ (చిరంజీవి) చీఫ్ సెక్యూరిటీ అడ్వైజర్ గా ఉంటారు. ఆయన అప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కూడా. కానీ జీవీఆర్ గ్రూప్స్ కంపెనీ బాస్ శశిరేఖ (నయనతార) పరిచయంతో వరప్రసాద్ లైఫ్ టర్న్ తీసుకుంటుంది. ఆమెతో చూస్తుండగానే పెళ్లి అయిపోతుంది. కానీ శశిరేఖ తండ్రి (సచిన్ ఖేడేకర్)కు ఈ పెళ్లి ఇష్టం ఉండదు. అందుకే వరప్రసాద్, శశిరేఖను విడదీస్తాడు. తన పిల్లలకూ వరప్రసాద్ దూరమవుతాడు.

కట్ చేస్తే కేంద్రమంత్రి శర్మ (శరత్ సక్సేనా) సెక్యూరిటీని వరప్రసాద్ చూసుకుంటాడు. శర్మకు వరప్రసాద్ చాలా క్లోజ్ అవుతాడు. ఈ క్రమంలోనే విడిపోయిన భార్య, పిల్లలకు వరప్రసాద్ ను దగ్గర చేయాలని శర్మ అనుకుంటాడు.

ఈ క్రమంలో తన పిల్లలు చదువుతున్న స్కూల్లో పీఈటీగా వెళ్తాడు వరప్రసాద్. మరి ఆ తర్వాత ఏం జరిగింది? అసలు శశిరేఖ, వరప్రసాద్ ఎందుకు విడిపోయారు? ఇందులో వెంకీ గౌడ (వెంకటేశ్) పాత్రకు ఉన్న సంబంధం ఏమిటన్నదే మన శంకర వరప్రసాద్ గారు మూవీ స్టోరీ.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More