ఆది సాయి కుమార్ ఇంట డబుల్ జోష్.. శంబాల హిట్.. వారసుడి ఎంట్రీ.. లిటిల్ ఫింగర్స్ తో హీరో పోస్ట్
సీనియర్ నటుడు సాయి కుమార్, అతని తనయుడు ఆది సాయి కుమార్ ఇప్పుడు రెట్టింపు సంతోషంలో తేలిపోతున్నారు. రీసెంట్ గా శంబాల సినిమాతో హిట్ అందుకున్నాడు ఆది. ఇప్పుడు అతనికి కొడుకు పుట్టాడు. ఓ క్యూట్ పోస్ట్ తో ఈ విషయాన్ని వెల్లడించాడు ఆది.
చాలా కాలం నుంచి ఓ హిట్ కోసం వెయిట్ చేసిన హీరో ఆది సాయి కుమార్ కు ఇప్పుడు డబుల్ డిలైట్. అతని ఆనందం ఇప్పుడు రెట్టింపైంది. ఓ వైపు అతని రీసెంట్ మూవీ శంబాల హిట్ గా నిలిచింది. మరోవైపు ఆది భార్య అరుణ ఓ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆది సాయి కుమార్ శనివారం (జనవరి 3) ఇన్ స్టాగ్రామ్ లో ఓ క్యూట్ పోస్ట్ తో పంచుకున్నాడు.

మరోసారి తండ్రిగా ఆది
సీనియర్ నటుడు సాయి కుమార్ తనయుడు ఆది సాయికుమార్ మరోసారి తండ్రి అయ్యాడు. అతని భార్య అరుణ మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇప్పటికే వీళ్లకు ఓ కూతురు ఉంది. ఆమె పేరు అయాన. ఇప్పుడు ఆదికి కొడుకు పుట్టాడు. ఈ ఆనందాన్ని క్యూట్ పోస్టుతో పంచుకున్నాడు ఆది. తన బాబు లిటిల్ ఫింగర్స్ తో పాటు ఇది అబ్బాయి చెప్తూ ఫొటోలు పోస్టు చేశాడు.
2014లో పెళ్లి
‘‘మన రెండో బిడ్డకు వెల్ కమ్ చెప్తున్నాం. ఇప్పుడు అబ్బాయి పుట్టాడు. జనవరి 2, 2026’’ అని ఆది ఇన్ స్టాగ్రామ్ లో శనివారం పోస్టు పెట్టాడు. ఈ పోస్టు వైరల్ గా మారింది. సెలబ్రిటీలు, ఫ్యాన్స్ అతనికి కంగ్రాట్స్ చెప్తూ పోస్టులు పెడుతున్నారు. 2014లో రాజమండ్రికి చెప్పిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అరుణను పెళ్లి చేసుకున్నాడు ఆది. ఈ దంపతులకు ఇప్పటికే ఓ కూతురు ఉంది.
శంబాలతో హిట్
సాయి కుమార్ వారసుడిగా ఆది సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. 2011లో డెబ్యూ చేశాడు. కానీ ఈ 15 ఏళ్లలో 25 సినిమాలు చేసినా హిట్లు మాత్రం అంతంతమాత్రమే. దీంతో ఓ మంచి హిట్ కోసం ఆది, అతని తండ్రి సాయి కుమార్ పరితపించిపోయారు. ఎట్టకేలకు ఇప్పుడు శంబాల మూవీతో ఆ వెయిటింగ్ కు ఎండ్ కార్డు వేశాడు ఆది. డిసెంబర్ 25న క్రిస్మస్ రోజు శంబాల రిలీజైంది.
రూ.16.20 కోట్లు
డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన హారర్ థ్రిల్లర్ శంబాల హిట్ టాక్ తో సాగిపోతుంది. ఈ మూవీ వారం రోజుల్లో రూ.16.20 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించినట్లు మేకర్స్ ప్రకటించారు. ఆది కెరీర్ లోనే ఇది అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమా.
2011లో ప్రేమ కావాలి సినిమాతో తెరంగేట్రం చేశాడు ఆది సాయి కుమార్. ఆ మూవీ హిట్ గా నిలిచింది. అంతేకాదు బెస్ట్ మేల్ డెబ్యూగా ఈ సినిమాకు ఆది ఫిల్మ్ ఫేర్, సైమా అవార్డులూ గెలుచుకున్నాడు. ఆ తర్వాత చాలా సినిమాలే చేసినా పెద్దగా హిట్లు దక్కలేదు. ఇప్పుడు శంబాలతో కాస్త రిలీఫ్ దొరికింది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


