...
...
Next Story

Aamir Khan Wedding: అవును.. నేను మూడో పెళ్లి చేసుకుంటున్నా.. జులై 5నే ముహూర్తం: ఆమిర్ ఖాన్

Aamir Khan Wedding: బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ తన పర్సనల్ లైఫ్‌లో కొత్త చాప్టర్ స్టార్ట్ చేయబోతున్నారు. గత రెండేళ్లుగా తనతో లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్న గౌరీ స్ప్రాట్‌ను జులై 5న ఆయన పెళ్లి చేసుకోబోతున్నట్లు అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేశారు. దీంతో బాలీవుడ్ వర్గాల్లో ఈ పెళ్లి హాట్ టాపిక్‌గా మారింది.

Published on: Jun 4, 2026, 15:39:24 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Aamir Khan Wedding: బాలీవుడ్ ‘మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్’ ఆమిర్ ఖాన్ మళ్లీ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. గత కొంతకాలంగా సోషల్ మీడియాలో, ఇండస్ట్రీలో వినిపిస్తున్న గాసిప్స్‌ను నిజం చేస్తూ.. తన లాంగ్‌టైమ్ పార్ట్‌నర్ గౌరీ స్ప్రాట్‌ను ఆయన పెళ్లాడబోతున్నారు. వచ్చే నెల అంటే జులై 5, 2026న వీళ్ల పెళ్లి జరగనుంది. ఈ విషయాన్ని ఆమిర్ ఖాన్ స్వయంగా కన్ఫర్మ్ చేసి ఫ్యాన్స్‌కు పెద్ద సర్ప్రైజ్ ఇచ్చారు.

Aamir Khan Wedding: అవును.. నేను మూడో పెళ్లి చేసుకుంటున్నా.. జులై 5నే ముహూర్తం: ఆమిర్ ఖాన్
Aamir Khan Wedding: అవును.. నేను మూడో పెళ్లి చేసుకుంటున్నా.. జులై 5నే ముహూర్తం: ఆమిర్ ఖాన్

"నా పెళ్లి గురించి వస్తున్న వార్తలు నిజమే. జులై 5న మా మ్యారేజ్ జరగబోతోంది" అని ఓ ఇంటర్నేషనల్ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమిర్ ఖాన్ క్లారిటీ ఇచ్చారు.

భారీ హంగామా లేదు.. ఇంట్లోనే సింపుల్‌గా!

సాధారణంగా బాలీవుడ్ స్టార్స్ పెళ్లిళ్లంటేనే డెస్టినేషన్ వెడ్డింగ్స్, కోట్లు ఖర్చు పెట్టి వారం రోజుల పాటు చేసే హడావుడి మనకు గుర్తొస్తాయి. కానీ ఆమిర్ ఖాన్ తన మూడో పెళ్లిని చాలా సాదాసీదాగా, సింపుల్‌గా చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. ఎలాంటి హంగామా లేకుండా, అత్యంత సన్నిహితుల మధ్య ఈ వేడుకను ప్లాన్ చేశారు.

ముంబైలోని ఆమిర్ ఖాన్ ఇంట్లోనే రిజిస్టర్డ్ మ్యారేజ్ చేసుకోబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్. కేవలం ఫ్యామిలీ మెంబర్స్, కొద్దిమంది క్లోజ్ ఫ్రెండ్స్ మాత్రమే ఈ ప్రైవేట్ ఫంక్షన్‌కు రానున్నారు. పబ్లిసిటీకి దూరంగా, చాలా సైలెంట్‌గా లైఫ్ పార్ట్‌నర్‌ను ఆహ్వానించాలనేది ఈ జంట ప్లాన్‌గా తెలుస్తోంది.

ఎవరీ గౌరీ స్ప్రాట్? 25 ఏళ్ల నాటి పరిచయం!

ఆమిర్ ఖాన్‌ను పెళ్లాడబోతున్న గౌరీ స్ప్రాట్ బ్యాక్‌గ్రౌండ్ చూస్తే.. ఆమె బెంగళూరుకు చెందినవారు. ఫ్యాషన్, బ్యూటీ, వెల్‌నెస్ రంగంలో ఆమెకు మంచి గుర్తింపు ఉంది. లైఫ్‌స్టైల్, సెలూన్ బిజినెస్‌లో అపారమైన అనుభవం ఉన్న ఆమె.. ప్రస్తుతం ముంబైలో సెటిల్ అయ్యారు. ఆమెకు ఒక కొడుకు కూడా ఉన్నాడు. ఆమిర్‌తో రిలేషన్‌షిప్ బయటకు వచ్చిన తర్వాతే గౌరీ పేరు మీడియాలో ఎక్కువగా వైరల్ అయినా, వీళ్ల పరిచయం ఈనాటిది కాదు.

"నేను గౌరీని కలవడం నిజంగా నా అదృష్టం. ఆమెతో ఉంటే నా మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. నా మాజీ భార్యలు రీనా దత్తా, కిరణ్ రావులతో నా బాండింగ్ చాలా స్ట్రాంగ్ అయినప్పటికీ కొన్ని కారణాల వల్ల అవి వర్కవుట్ అవ్వలేదు. గౌరీ నా లైఫ్‌లోకి రావడం దేవుడిచ్చిన వరంగా ఫీల్ అవుతున్నా. ఇప్పుడు నేను పూర్తిగా కంప్లీట్ అయినట్లు అనిపిస్తోంది" అని ఆమిర్ ఖాన్ గతంలో తన మనసులోని మాటలను పంచుకున్నారు.

రెండు బ్రేకప్స్ తర్వాత మూడో అడుగు

ఆమిర్ ఖాన్‌కు ఇది మూడో పెళ్లి. ఆయన ఫస్ట్ వైఫ్ రీనా దత్తాతో 1986లో పెళ్లి జరగ్గా.. 17 ఏళ్ల తర్వాత 2002లో విడాకులు తీసుకున్నారు. వీరికి జునైద్ ఖాన్, ఐరా ఖాన్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ తర్వాత 2005లో ప్రముఖ డైరెక్టర్ కిరణ్ రావును ఆమిర్ పెళ్లాడారు. వీరికి ఆజాద్ రావు ఖాన్ అనే కొడుకు ఉన్నాడు. అయితే 2021లో ఈ జంట కూడా పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు ప్రకటించింది. పెళ్లి బంధాలు ముగిసినప్పటికీ, తన మాజీ భార్యలిద్దరితో ఆమిర్ ఇప్పటికీ మంచి ఫ్రెండ్‌షిప్ మెయింటైన్ చేస్తున్నారు.

ప్రస్తుతం ఆమిర్ ఖాన్ తన యాక్టింగ్‌తో పాటు ప్రొడక్షన్ పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఆయన లాస్ట్ టైమ్ ‘సితారే జమీన్ పర్’ సినిమాలో కనిపించారు. ఈ టైమ్‌లో ఆయన పర్సనల్ లైఫ్‌లో తీసుకోబోతున్న ఈ డెసిషన్ బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. 61వ ఏట అడుగుపెట్టిన ఈ స్టార్ హీరో లైఫ్‌లో కొత్త జర్నీ హ్యాపీగా సాగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe