Aamir Khan Love Jihad: బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ మూడో పెళ్లి ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. రీసెంట్‌గా గౌరీ స్ప్రాట్‌ను పెళ్లాడిన ఆమిర్ ఖాన్ పై హిందూ సంఘాలు, ముఖ్యంగా భజరంగ్ దళ్ కార్యకర్తలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఈ పెళ్లిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ రోడ్లపైకి వచ్చి ఆమిర్ ఖాన్ దిష్టిబొమ్మను దహనం చేయడమే కాకుండా, అతనిపై 'లవ్ జిహాద్' ఆరోపణలు చేయడం బాలీవుడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
హిందూ సమాజాన్ని అవమానించడమే..

కేవలం సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో చాలా సింపుల్‌గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు ఆమిర్ ఖాన్. సోషల్ మీడియాలో ఈ పెళ్లి ఫొటోలు, వీడియోలు వైరల్ అయిన వెంటనే భజరంగ్ దళ్ నేతలు సీరియస్ అయ్యారు.
భజరంగ్ దళ్ లీడర్ మనోజ్ సోని ఒక అధికారిక ప్రకటన జారీ చేస్తూ.. "ఆమిర్ ఖాన్ వరుసగా హిందూ ఆడపడుచులను పెళ్లి చేసుకుంటూ ఒక లైన్ మెయింటైన్ చేస్తున్నాడు. ఇది ముమ్మాటికీ హిందూ సమాజాన్ని అవమానించడమే" అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు.
ముస్లిం అమ్మాయిలు దొరకలేదా అంటూ వార్నింగ్
ఈ వివాదం అంతటితో ఆగలేదు. ఆమిర్ ఖాన్ తన పద్ధతి మార్చుకోకపోతే తగిన గుణపాఠం చెబుతామని మనోజ్ సోని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో మనోజ్ సోని మాట్లాడుతూ.. "ఆయనకు ముస్లిం మహిళలు ఎందుకు నచ్చరు? కేవలం హిందూ అమ్మాయిలనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?" అంటూ సూటిగా ప్రశ్నించాడు. అంతేకాకుండా ఈ వ్యవహారంపై కోర్టులు, ప్రభుత్వం వెంటనే స్పందించి ఆమిర్ ఖాన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు.
గౌరీ స్ప్రాట్ బ్యాక్‌గ్రౌండ్.. ఆమిర్ పాత పెళ్లిళ్ల కథేంటి?
ఇక ఆమిర్ ఖాన్ కొత్త భార్య గౌరీ స్ప్రాట్ విషయానికి వస్తే.. ఆమె బెంగళూరులో పుట్టి పెరిగిన ఒక సెలూన్ ఆంత్రప్రెన్యూర్. ఆమె తల్లిది తమిళనాడు కాగా, తండ్రి ఐరిష్ సంతతికి చెందినవాడు. ఆమె తాతయ్య ఒక స్వాతంత్య్ర సమరయోధుడు కావడం విశేషం. మొదట్లో వీళ్ల పెళ్లి చాలా గ్రాండ్‌గా జరుగుతుందని బాలీవుడ్ మీడియాలో టాక్ నడిచినా, ఆమిర్ ఖాన్ మాత్రం ఎలాంటి హడావుడి లేకుండా చాలా సైలెంట్‌గా ఈ రిజిస్టర్ మ్యారేజ్ కంప్లీట్ చేశాడు.
{{/usCountry}}ఇక ఆమిర్ ఖాన్ కొత్త భార్య గౌరీ స్ప్రాట్ విషయానికి వస్తే.. ఆమె బెంగళూరులో పుట్టి పెరిగిన ఒక సెలూన్ ఆంత్రప్రెన్యూర్. ఆమె తల్లిది తమిళనాడు కాగా, తండ్రి ఐరిష్ సంతతికి చెందినవాడు. ఆమె తాతయ్య ఒక స్వాతంత్య్ర సమరయోధుడు కావడం విశేషం. మొదట్లో వీళ్ల పెళ్లి చాలా గ్రాండ్‌గా జరుగుతుందని బాలీవుడ్ మీడియాలో టాక్ నడిచినా, ఆమిర్ ఖాన్ మాత్రం ఎలాంటి హడావుడి లేకుండా చాలా సైలెంట్‌గా ఈ రిజిస్టర్ మ్యారేజ్ కంప్లీట్ చేశాడు.
{{/usCountry}}ఆమిర్ ఖాన్ వివాహ జీవితం మొదటి నుంచి వార్తల్లో ఉంటూనే ఉంది. 1986లో తన చిన్ననాటి స్నేహితురాలు రీనా దత్తాను పెళ్లాడిన ఆమిర్.. 2002లో ఆమెతో విడిపోయాడు. వీరికి జునైద్, ఐరా అని ఇద్దరు పిల్లలు ఉన్నారు. రీసెంట్‌గానే జునైద్ 'మహారాజ్' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇవ్వగా, ఐరా పెళ్లి కూడా గ్రాండ్‌గా జరిగింది. ఆ తర్వాత 2005లో కిరణ్ రావును పెళ్లి చేసుకున్నాడు ఆమిర్. వీరికి ఆజాద్ అనే బాబు పుట్టాడు. దాదాపు 16 ఏళ్ల తర్వాత 2021లో కిరణ్ రావుతో కూడా విడిపోయిన ఆమిర్, ఇప్పుడు మూడోసారి గౌరీతో కొత్త లైఫ్ స్టార్ట్ చేశాడు.
బాక్సాఫీస్ దగ్గర ఆమిర్ నెక్స్ట్ ప్లాన్స్ ఇవే..
ప్రొఫెషనల్ లైఫ్ విషయానికి వస్తే, ఆమిర్ ఖాన్ రీసెంట్‌గా నటించిన 'సితారే జమీన్ పర్' మూవీ బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది. మంచి కంటెంట్‌తో వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది. యాక్టర్‌గా తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటనేది ఇంకా అఫీషియల్‌గా అనౌన్స్ చేయలేదు.
కానీ నిర్మాతగా మాత్రం బాలీవుడ్‌లో ఒక బారీ ప్రాజెక్ట్ ప్లాన్ చేశాడు. సన్నీ డియోల్, ప్రీతి జింటా, కరణ్ డియోల్ లీడ్ రోల్స్‌లో 'బట్వారా 1947' అనే భారీ పాన్ ఇండియా సినిమాను నిర్మిస్తున్నాడు. లెజెండరీ డైరెక్టర్ రాజ్ కుమార్ సంతోషి డైరెక్ట్ చేస్తున్న ఈ ఎమోషనల్ పీరియాడిక్ డ్రామా, 2026 ఆగస్టు 14న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కాబోతోంది.