బాలీవుడ్ స్టార్ కపుల్ అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ బచ్చన్ విడాకులు తీసుకోబోతున్నారంటూ గత కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 2007లో వివాహం చేసుకున్న ఈ జంట.. ఇన్నేళ్ల ప్రయాణంలో ఎన్నోసార్లు ఇలాంటి పుకార్లను ఎదుర్కొన్నారు. అయితే తాజాగా లిల్లీ సింగ్‌తో జరిగిన ఒక ఇంటర్వ్యూలో అభిషేక్ బచ్చన్ తన వ్యక్తిగత జీవితం, భార్యతో తనకున్న బంధం గురించి ఎంతో హుందాగా మాట్లాడాడు. ఈ కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
భాగస్వామ్యం అంటే సమానత్వం

తమ వివాహ బంధాన్ని ఒక సహజమైన భాగస్వామ్యంగా అభిషేక్ బచ్చన్ అభివర్ణించాడు. ఇంట్లో ఎవరు ఏం చేయాలి అనే విషయంలో తమ మధ్య ఎప్పుడూ కఠినమైన నిబంధనలు లేవని అతడు స్పష్టం చేశాడు. తన తల్లిదండ్రులు అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్‌లను ఉదాహరణగా చూపిస్తూ.. వారు వివాహం చేసుకున్న సమయంలో తన తండ్రి కంటే తల్లి పెద్ద స్టార్ అని గుర్తు చేశాడు.
"నా భార్య ఏదైనా పని మానుకుంటేనే నేను సురక్షితంగా ఫీల్ అవుతాను అనుకునే వ్యక్తిని కాదు. అలాంటి బంధంలో నేను ఉండాలనుకోను. ఐశ్వర్య ఆలోచనలు కూడా ఇలాగే ఉంటాయి" అని అభిషేక్ పేర్కొన్నాడు.
ఈగో, గౌరవం గురించి..
సాధారణంగా దంపతుల మధ్య వచ్చే 'ఈగో' సమస్యల గురించి కూడా అభిషేక్ మాట్లాడాడు. తన దృష్టిలో ఈగో అంటే అభద్రతాభావం కాదని, అది ఆత్మవిశ్వాసంతో కూడిన మనస్తత్వమని వివరించాడు.
ఐశ్వర్యతో తన పరిచయం గురించి చెబుతూ.. తమ కెరీర్ ప్రారంభంలో ఇద్దరం స్నేహితులుగా మొదలై, ఆ తర్వాత ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నామని తెలిపాడు. తమ బంధం పరస్పర గౌరవంపై ఆధారపడిందే తప్ప, ఒకరిపై ఒకరు ఆధిపత్యం చలాయించుకోవడానికి కాదని అతడు స్పష్టం చేశాడు.
కూతురు ఆరాధ్య పెంపకంపై..
తమ గారాల పట్టి ఆరాధ్య బచ్చన్ పెంపకం గురించి అభిషేక్ కొన్ని నిజాయితీతో కూడిన వ్యాఖ్యలు చేశాడు. "తండ్రులు అంత మంచి టీచర్స్ కాలేరు" అని అతడు చమత్కరించాడు. మహిళలతో పోలిస్తే పురుషులకు భావోద్వేగాల విషయంలో సున్నితత్వం తక్కువగా ఉంటుందని అతడు అభిప్రాయపడ్డాడు.
{{/usCountry}}తమ గారాల పట్టి ఆరాధ్య బచ్చన్ పెంపకం గురించి అభిషేక్ కొన్ని నిజాయితీతో కూడిన వ్యాఖ్యలు చేశాడు. "తండ్రులు అంత మంచి టీచర్స్ కాలేరు" అని అతడు చమత్కరించాడు. మహిళలతో పోలిస్తే పురుషులకు భావోద్వేగాల విషయంలో సున్నితత్వం తక్కువగా ఉంటుందని అతడు అభిప్రాయపడ్డాడు.
{{/usCountry}}అయితే పిల్లలకు నీతులు చెప్పడం కంటే, ప్రవర్తన ద్వారా వారికి ఎగ్జాంపుల్ గా నిలవడమే నిజమైన పెంపకం అని అతడు చెప్పుకొచ్చాడు. "పిల్లలకు ఏది సరైనదో చెప్పడం కంటే, మన ప్రవర్తన ద్వారా అది చూపించాలి. మా ఇంట్లో సంప్రదాయ పద్ధతుల విషయంలో ఎలాంటి పోటీ ఉండదు. విలువలే బిడ్డ భవిష్యత్తును నిర్ణయిస్తాయి" అని అతడు వివరించాడు.
దాదాపు రెండు దశాబ్దాల వైవాహిక జీవితాన్ని పూర్తి చేసుకోబోతున్న ఈ జంట, పుకార్లను నేరుగా ఖండించకపోయినా.. అభిషేక్ చేసిన ఈ వ్యాఖ్యలు వారి మధ్య ఉన్న బలమైన బంధాన్ని చాటిచెబుతున్నాయి. పోలికలు, అంచనాలకు తావులేకుండా ఒకరినొకరు గౌరవించుకోవడమే తమ విజయ రహస్యమని అతడు పరోక్షంగా వెల్లడించాడు.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)
1. అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ వివాహం ఎప్పుడు జరిగింది?
వీరిద్దరూ ఏప్రిల్ 20, 2007న ముంబైలో వివాహం చేసుకున్నారు. వీరికి ఆరాధ్య అనే కుమార్తె ఉంది.
2. విడాకుల పుకార్లపై అభిషేక్ ఏమని స్పందించారు?
తమ బంధం పరస్పర గౌరవం, సమానత్వంపై ఆధారపడిందని, తన భార్య విజయాన్ని చూసి తాను ఎప్పుడూ అభద్రతాభావానికి గురికాబోనని ఆయన పరోక్షంగా పుకార్లకు చెక్ పెట్టారు.
3. పెంపకం విషయంలో అభిషేక్ అభిప్రాయం ఏమిటి?
పిల్లలకు సూచనలు ఇవ్వడం కంటే, తల్లిదండ్రులు తమ ప్రవర్తన ద్వారా వారికి ఆదర్శంగా నిలవాలని ఆయన నమ్ముతారు.