OTT Malayalam: మస్ట్ వాచ్ మలయాళం మైండ్ బ్లోయింగ్ థ్రిల్లర్.. సైబర్ స్కామ్‌లపై అమ్మాయి పోరాటం.. ఒక్కో ట్విస్ట్ అదుర్స్
OTT Malayalam: మల్లూవుడ్ నుంచి వచ్చిన మరో వినూత్నమైన ఎక్స్‌పెరిమెంటల్ సైబర్ థ్రిల్లర్ అండ్ ఫ్యామిలీ డ్రామా ఓటీటీలో అడుగుపెట్టింది. ఆన్‌లైన్ మోసాలు, డిజిటల్ సైబర్ స్కామ్‌ల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ట్విస్ట్ లు మామూలుగా లేవు. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ డీటెయిల్స్ చూసేయండి.
OTT Malayalam: డిజిటల్ నేరాలు, సైబర్ స్కామ్‌లు రోజురోజుకూ పెరుగుతున్న ప్రస్తుత కాలంలో.. దానికి ఫ్యామిలీ ఎమోషన్స్‌ను జోడించి తెరకెక్కించిన మలయాళ చిత్రం ‘అచ్యుత అవతారం’ (Achyuta Avataaram). పునీత్ ఆరాధ్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మాళవికా నందన్ టైటిల్ రోల్ (అచ్యుత) పోషించింది.

అచ్యుత అవతారం ఓటీటీ
జులై 17, 2026న థియేటర్లలో విడుదలై విమర్శకుల ప్రశంసలు పొందిన ఈ మైండ్ బెండింగ్ థ్రిల్లర్ అచ్యుత అవతారం ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ఇవాళ (ఆగస్టు 13) నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో డిజిటల్ స్ట్రీమింగ్‌కు అవుతోంది. కేవలం మలయాళంలోనే కాకుండా తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులోకి రావడంతో సౌత్ ఓటీటీ వీక్షకులు ఈ సినిమాపై తీవ్ర ఆసక్తి చూపుతున్నారు.
ఒక సామాన్య యువతి పోరాటం
ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న 'డిజిటల్ అరెస్ట్', ఫేక్ కాల్స్, ఇన్వెస్ట్‌మెంట్ స్కామ్‌ల వంటి యథార్థ పరిస్థితులకు అద్దం పట్టేలా ఈ అచ్యుత అవతారం కథ సాగుతుంది.
అచ్యుత అనే సాధారణ యువతి, ఆమె కుటుంబం ఒక గ్రామంలో ప్రశాంతంగా జీవిస్తుంటారు. అయితే, అనూహ్యంగా ఒక పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన సైబర్ క్రిమినల్స్ దాడిలో ఆ కుటుంబం తమ కష్టార్జితాన్ని, దాచుకున్న సొమ్మునంతటినీ ఆన్‌లైన్ స్కామ్‌లో కోల్పోతుంది.
రివేంజ్ కోసం
పోలీసులు, వ్యవస్థ నుంచి తగిన న్యాయం జరగకపోవడంతో.. అచ్యుత స్వయంగా రంగంలోకి దిగుతుంది. తన కుటుంబాన్ని రోడ్డున పడేసిన ఆన్‌లైన్ ఫ్రాడ్‌స్టర్స్ ను పట్టుకోవడానికి డిజిటల్ అండర్‌వర్ల్డ్‌లోకి అడుగుపెడుతుంది.
అయితే కేవలం హ్యాకింగ్, క్రైమ్ ఎలిమెంట్స్ మాత్రమే కాకుండా.. మానసిక ధైర్యం, కుటుంబ బంధాలు, కొన్ని ఆధ్యాత్మిక కోణాలను కలిపి స్టోరీని ఆసక్తికరంగా నడిపారు.
థ్రిల్లర్ లవర్స్ ఎందుకు చూడాలి?
- రియల్ లైఫ్ సైబర్ అవేర్‌నెస్: మన రోజువారీ జీవితంలో ఫోన్లకు వచ్చే ఒక్క ఓటీపీ లేదా లింక్ మన జీవితాలను ఎలా నాశనం చేస్తుందో అత్యంత సహజంగా చూపించారు. ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాల్సిన సైబర్ సెక్యూరిటీ అంశాలు ఇందులో ఉన్నాయి.
- మాళవికా నందన్ పెర్ఫార్మెన్స్: ఒక సామాన్య అమ్మాయిగా, కుటుంబం కోసం పోరాడే ధైర్యవంతురాలిగా అచ్యుత పాత్రలో మాళవికా నందన్ జీవించేసింది.
- మల్టీ లాంగ్వేజ్ డబ్బింగ్: ప్రైమ్ వీడియోలో తెలుగు ఆడియో క్వాలిటీ, డబ్బింగ్ ఎంతో సహజంగా ఉండటంతో తెలుగు ప్రేక్షకులు సులభంగా కథలోకి లీనమైపోవచ్చు.
వీకెండ్‌లో మంచి ఎమోషనల్ అండ్ మెసేజ్ ఓరియంటెడ్ సైబర్ థ్రిల్లర్ చూడాలనుకునే వారికి ‘అచ్యుత అవతారం’ ప్రైమ్ వీడియోలో ఒక పర్ఫెక్ట్ ఛాయిస్ అని చెప్పొచ్చు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


