అనౌన్స్‌మెంట్ రోజు నుంచే ప్రేక్షకుల్లోనే కాకుండా సినీ వర్గాల్లోనూ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్న సినిమా ద్రౌపది 2. మోహన్.జి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ హిస్టారికల్ యాక్షన్ డ్రామాపై అంచనాలు రోజు రోజుకి పెరుగుతున్నాయి.
భారీ బడ్జెట్‌తో

14వ శతాబ్దంలో దక్షిణ భారతదేశపు నేపథ్యంలో సాగే కథతో ద్రౌపది 2 సినిమాను భారీ బడ్జెట్‌తో బహుభాషా చిత్రంగా రూపొందించారు. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికేట్‌ను పొందింది.
ద్రౌపది 2లో ముగ్గురు విలన్స్
రిచర్డ్ రిషి లుక్, చక్కటి పాటలు, విజువల్స్ సినిమాపై ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్‌ను మరింతగా పెంచాయి. ద్రౌపది 2 సినిమాలో చిరాగ్ జానీ విలన్‌గా నటిస్తుండటం అంచనాలను నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లాయి. అంతేకాకుండా ద్రౌపది 2లో ముగ్గురు విలన్స్ ఉండటం విశేషంగా మారింది.
తీసుకునే నిర్ణయాల వల్ల
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మోహన్.జి మాట్లాడుతూ "మహమ్మద్‌బీన్ తుగ్లక్ పాత్రలో చిరాగ్ నటించారు. ఈ పాత్రను విలన్‌గానే కాకుండా.. తను తీసుకునే నిర్ణయాల వల్ల సమస్యల్లో పడే పాలకుడిగా చూపించే క్రమంలో దాన్ని చిరాగ్ అద్భుతంగా పోషించారు" అని అన్నారు.
రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ
"చరిత్రలో తుగ్లక్‌ను తెలివైన మూర్ఖుడు అని అంటుంటారు. ఇలాంటి పాత్రను చేయాలంటే లుక్ పరంగా గంభీరంగా కనిపిస్తూనే మేథస్సు, తెలివిని బ్యాలెన్స్ చేస్తూ నటించే యాక్టర్ కావాలి. ఇలాంటి వేరియేషన్‌ను చూపించటం చాలా కష్టంతో కూడుకున్నది. చిరాగ్ ఆ పాత్రలో పూర్తిగా లీనమై నటించి పాత్రలో అన్నీ రకాల ఎమోషన్స్‌ను అద్భుతంగా పలికించారు" అని ప్రశంసించారు డైరెక్టర్ మోహన్ జి.
ద్రౌపది 2 నటీనటులు
ఇదిలా ఉంటే, ద్రౌపది 2 సినిమాలో రిచర్డ్ రిషి హీరోగా, రక్షణ ఇందుసుదన్ హీరోయిన్గా నటించారు. నట్టి నటరాజ్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇంకా ఈ సినిమాలో వై.జి. మహేంద్రన్, నడోడిగల్ బరాణి, సరవణ సుబ్బయ్య, వెల్ రామమూర్తి, దినేష్ లాంబా, గణేష్ గౌరాంగ్, దివి, దేవయానీ శర్మ, అరుణోదయన్ తదితరులు ఇతర పాత్రల్లో అలరించనున్నారు.
గిబ్రాన్ సంగీతం
{{/usCountry}}ఇదిలా ఉంటే, ద్రౌపది 2 సినిమాలో రిచర్డ్ రిషి హీరోగా, రక్షణ ఇందుసుదన్ హీరోయిన్గా నటించారు. నట్టి నటరాజ్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇంకా ఈ సినిమాలో వై.జి. మహేంద్రన్, నడోడిగల్ బరాణి, సరవణ సుబ్బయ్య, వెల్ రామమూర్తి, దినేష్ లాంబా, గణేష్ గౌరాంగ్, దివి, దేవయానీ శర్మ, అరుణోదయన్ తదితరులు ఇతర పాత్రల్లో అలరించనున్నారు.
గిబ్రాన్ సంగీతం
{{/usCountry}}ద్రౌపది 2 సినిమాను చోళ చక్రవర్తి (నేతాజీ ప్రొడక్షన్స్), జి.ఎం. ఫిల్మ్ కార్పొరేషన్‌తో కలిసి నిర్మించారు. ఫిలిప్ ఆర్. సుందర్ సినిమాటోగ్రఫీ అందించగా, గిబ్రాన్ సంగీతాన్ని అందించారు. యాక్షన్ సంతోష్, నృత్యాలను తనిక టోనీ యాక్షన్ సన్నివేశాలను డిజైన్ చేశారు.
సెన్సార్ పూర్తి
ఎడిటర్‌గా దేవరాజ్, ప్రొడక్షన్ డిజైనర్‌గా కమల్‌నాథన్ బాధ్యతలను నిర్వహించారు. పద్మ చంద్రశేఖర్, మోహన్.జి డైలాగ్స్ రాశారు. సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ద్రౌపది 2 ట్రైలర్‌ను త్వరలోనే రిలీజ్ చేసి, ఆడియో లాంచ్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
వరల్డ్ వైడ్‌గా రిలీజ్ చేసేందుకు
ద్రౌపది 2 సినిమాను ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ద్రౌపది 2 సినిమా రిలీజ్ డేట్‌పై కూడా ప్రకటన త్వరలోనే రానుందని మేకర్స్ పేర్కొన్నారు.