...
...
Next Story

OTT Actor: ఇండియన్ సినిమాలో స్టార్లు ఏసీ బోగీలో ఉంటారు.. నటులకు అసలు టికెట్లే ఉండవు: నటుడి షాకింగ్ కామెంట్స్

OTT Actor: ఇండియన్ సినిమాలో ఒకప్పుడు స్టార్‌డమ్ ఎలా ఉండేదో.. తర్వాత టీవీ, ఓటీటీ విప్లవంతో అది ఎలా మారిందో చెప్పాడు నటుడు గజరాజ్ రావ్. ప్రస్తుతం ఆయన నటించిన దుపహియా వెబ్ సిరీస్ సీజన్ 2 ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

Published on: Oct 2, 2026, 12:08:05 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

OTT Actor: వెర్సటైల్ బాలీవుడ్ నటుడు గజరాజ్ రావు (Gajraj Rao) ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోని క్లాస్ డివైడ్, స్టార్‌డమ్ సంస్కృతిపై చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. FICCI ఫ్రేమ్స్ 2026 ఈవెంట్‌లో పాల్గొన్న ఆయన.. ఇండస్ట్రీని ఒక ప్రయాణీకుల రైలుతో పోలుస్తూ పాతకాలంలో నటులు పడ్డ ఇబ్బందులను కళ్లకు కట్టినట్లు వివరించారు.

ఇండస్ట్రీ ఒక రైలు.. స్టార్స్ ఫస్ట్ ఏసీలో ఉంటే నటులు వితౌట్ టికెట్

OTT Actor: ఇండియన్ సినిమాలో స్టార్లు ఏసీ బోగీలో ఉంటారు.. నటులకు అసలు టికెట్లే ఉండవు: నటుడి షాకింగ్ కామెంట్స్
OTT Actor: ఇండియన్ సినిమాలో స్టార్లు ఏసీ బోగీలో ఉంటారు.. నటులకు అసలు టికెట్లే ఉండవు: నటుడి షాకింగ్ కామెంట్స్

25 నుంచి 30 ఏళ్ల క్రితం ఫిలిం ఇండస్ట్రీ ఒక రైలులా ఉండేదని గజరాజ్ రావు అన్నారు. అందులో కేవలం ఒక్క ఫస్ట్ ఏసీ బోగీ మాత్రమే ఉండేదని, ఆ బోగీలో స్టార్ హీరోలు సకల సౌకర్యాలతో ప్రశాంతంగా ప్రయాణించేవారని చెప్పారు.

మిగతా 100 నుంచి 200 జనరల్ కాంపాక్ట్‌మెంట్స్‌లో ఎలాంటి టికెట్ లేకుండా సామాన్య నటులు తమ ఉనికి కోసం, ఒక చిన్న సీటు కోసం నిత్యం పోరాటం చేయాల్సి వచ్చేదని గుర్తు చేసుకున్నారు. ఆ రోజుల్లో కేవలం కొద్దిమందికే ఇండస్ట్రీలో గౌరవం, అవకాశాలు దక్కేవని తెలిపారు.

ఏక్తా కపూర్ టీవీ విప్లవం.. ఆ తర్వాత ఓటీటీ హవా

కొన్నేళ్ల క్రితం ప్రైవేట్ టీవీ నెట్‌వర్క్స్, ఏక్తా కపూర్ రాకతో బుల్లితెరపై పెద్ద విప్లవమే వచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఆ సమయంలోనే నటులకు కాస్త గుర్తింపు, మంచి జీతాలు, సొంత కార్లు కొనుక్కునే స్థాయి లభించడం మొదలైందని చెప్పారు.

ఇక గత 7-8 ఏళ్లలో ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఎంట్రీ ఇవ్వడంతో ఆ రైలుకి సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ బోగీలు కూడా తోడయ్యాయని ఆయన వివరించారు. దీనివల్ల ప్రతి ప్రతిభావంతుడైన యాక్టర్‌కి ఒక బెర్త్ దొరుకుతోందని ఆనందం వ్యక్తం చేశారు.

'పాతాళ్ లోక్' నుంచి 'మిర్జాపూర్' వరకు.. చెరిగిపోతున్న సరిహద్దులు

ఇటీవలే ప్రైమ్ వీడియో సూపర్ హిట్ వెబ్ సిరీస్.. 'మిర్జాపూర్ ద మూవీ' బాక్సాఫీస్ దగ్గర గ్రాండ్ సక్సెస్ సాధించిందని, ఇది ఓటీటీ స్టార్స్, థియేట్రికల్ స్టార్స్ మధ్య ఉన్న సరిహద్దులను పూర్తిగా చెరిపేసిందని గజరాజ్ రావు అభిప్రాయపడ్డారు.

'దుపహియా 2'తో డిజిటల్ స్పేస్‌లో హల్ చల్

'బధాయి హో' లాంటి సూపర్ హిట్ సినిమాలతో విశేష ప్రజాదరణ పొందిన గజరాజ్ రావు.. ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న 'దుపహియా సీజన్ 2' (Dupahiya Season 2) తో వీక్షకులను అలరిస్తున్నారు. అక్టోబర్ 1 నుంచి ఈ వెబ్ సిరీస్ అందుబాటులోకి వచ్చింది.

ఈ క్లీన్ క్యారెక్టర్ డ్రివెన్ కామెడీ డ్రామాలో రేణుకా షహానే, భువన్ అరోరా, స్పర్శ్ శ్రీవాస్తవ, యశ్పాల్ శర్మలతో కలిసి ఆయన కీలక పాత్ర పోషించారు. సోనం నాయర్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌కు ఓటీటీ ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks