Kamal Haasan: ఇండియన్ సినిమా హిస్టరీలో 'లోకనాయకుడు'గా నీరాజనాలు అందుకుంటున్న వర్సటైల్ యాక్టర్ కమల్ హాసన్ తన 67 ఏళ్ల సినీ సుదీర్ఘ ప్రయాణంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. "సినిమా ఇండస్ట్రీలో నేనే అత్యంత పెద్ద వయస్కుడైన జెన్ జీ (Gen Z) కావచ్చు" అని వ్యాఖ్యానిస్తూ సోషల్ మీడియాలో పెట్టిన సుదీర్ఘ పోస్ట్ ప్రస్తుతం గ్లోబల్ వైడ్‌గా వైరల్ అవుతోంది.
బాల నటుడిగా పరిచయమై..

1960లో 'కళత్తూర్ కణ్ణమ్మ' సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా వెండితెరకు పరిచయమైన కమల్ హాసన్, నాటి నుంచి నేటి వరకు నటుడిగా, డైరెక్టర్‌గా, ప్రొడ్యూసర్‌గా, స్క్రిప్ట్ రైటర్‌గా సరికొత్త బెంచ్‌మార్క్స్ క్రియేట్ చేశారు. భారతీయ సినిమా చరిత్రలో అనేక భాషల్లో నటిస్తూ విలక్షణమైన పాత్రలతో ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేశారు.
1895 డిసెంబర్‌లో లూమియర్ బ్రదర్స్ ప్రపంచంలోనే తొలిసారిగా మూవీ స్క్రీనింగ్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు సినిమా రంగానికి దాదాపు 130 ఏళ్ల 8 నెలల చరిత్ర ఉంది. అందులో సగానికి పైగా అంటే ఏకంగా 67 ఏళ్లు తన జీవితాన్ని సినిమా కోసమే అంకితం చేశానని కమల్ హాసన్ గుర్తుచేసుకున్నారు.
"20 ఏళ్లే నేర్చుకున్నది.. మిగిలినదంతా డ్రైనేజీ వాటర్ ప్రవాహమే"
తన కెరీర్‌పై అత్యంత నిజాయితీగా స్పందించిన కమల్ హాసన్.. "నన్ను ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదాలు. అయితే ఈ 67 ఏళ్లలో కేవలం 20 ఏళ్లను మాత్రమే నేను నిజమైన అభ్యాసంగా లేదా నేర్చుకున్న కాలంగా భావిస్తున్నాను. మిగిలిన కాలమంతా వ్యర్థమైన మురుగునీటి ప్రవాహంలో కొట్టుకుపోయినట్లే అయింది" అని రాసుకొచ్చారు.
కాలువ ఎంత నల్లగా, చీకటిగా మారినా.. చివరికి అది కలవాల్సిన సముద్రం ఒక్కటేనని పేర్కొన్నారు. ఆ అనంతమైన సముద్రమే సినిమా ప్రపంచమని, ఆర్టిస్టులు, టెక్నీషియన్లు, ఆడియన్స్ అందరం ఆ ప్రవాహంలోకే ప్రయాణిస్తున్నామని కమల్ చాలా లోతైన ఫిలాసఫీని పంచుకున్నారు.
ఏఐ నేర్చుకోవడానికి యూఎస్ ప్రయాణం
{{/usCountry}}కాలువ ఎంత నల్లగా, చీకటిగా మారినా.. చివరికి అది కలవాల్సిన సముద్రం ఒక్కటేనని పేర్కొన్నారు. ఆ అనంతమైన సముద్రమే సినిమా ప్రపంచమని, ఆర్టిస్టులు, టెక్నీషియన్లు, ఆడియన్స్ అందరం ఆ ప్రవాహంలోకే ప్రయాణిస్తున్నామని కమల్ చాలా లోతైన ఫిలాసఫీని పంచుకున్నారు.
ఏఐ నేర్చుకోవడానికి యూఎస్ ప్రయాణం
{{/usCountry}}కేవలం నటనతోనే ఆగిపోకుండా లేటెస్ట్ టెక్నాలజీని నేర్చుకోవడంలో కమల్ హాసన్ ఎప్పుడూ ముందుంటారు. 2024లో ఆయన అమెరికా వెళ్లి 90 రోజుల పాటు ప్రత్యేకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కోర్సులో చేరడం ఇండస్ట్రీని ఆశ్చర్యపరిచింది. పని ఒత్తిడి వల్ల 45 రోజులు మాత్రమే ఆ తరగతులకు హాజరైనట్లు ఆయన గతంలో వెల్లడించారు.
"AI అనేది మన అందరి పరిధిని మించిన ఒక అద్భుతమైన టెక్నాలజీ. దాన్ని సరైన అవగాహన లేకుండా ముట్టుకోకూడదు. సినిమా విజువల్స్ విషయంలో ఇది ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. భవిష్యత్తులో మన కంప్యూటర్ల లాగే AI కూడా ప్రతి ఒక్కరి జీవితంలో భాగమవుతుంది. దీనికి భయపడాల్సిన అవసరం లేదు" అని ఆయన స్పష్టం చేశారు.
కమల్ హాసన్ క్రేజీ లైనప్.. కల్కి 2 సహా వరుస పాన్ ఇండియా ప్రాజెక్ట్స్
మణిరత్నం కాంబినేషన్‌లో వచ్చిన భారీ యాక్షన్ మూవీ 'థగ్ లైఫ్' (2025) తర్వాత కమల్ హాసన్ చేతిలో వరుస బ్లాక్‌బస్టర్ లైనప్స్ ఉన్నాయి. సూపర్ స్టార్ రజనీకాంత్‌తో కలిసి నెల్సన్ దిలీప్‌కుమార్ డైరెక్షన్ లో ఒక అద్భుతమైన మల్టీస్టారర్ ప్రాజెక్ట్ తెరకెక్కుతోంది. ఈ సినిమాకు ధర్మన్ అనే టైటిల్ కూడా పెట్టారు.
దీంతో పాటు బాక్సాఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా రికార్డు వసూళ్లు సాధించడమే కాకుండా రెండు జాతీయ అవార్డులు గెలుచుకున్న ప్రభాస్ 'కల్కి 2898 AD' సీక్వెల్ (Kalki 2) లోనూ సుప్రీమ్ యాస్కిన్‌గా కమల్ హాసన్ నటించబోతున్నారు. అలాగే ప్రముఖ స్టంట్ మాస్టర్స్ అన్బరివ్ డైరెక్షన్‌లోనూ ఒక పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు కమల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.