హీరోయిన్లు చీరలే కట్టుకోవాలని, సామాన్లు కనిపించేలా డ్రెస్సులు వేసుకోకూడదని కామెంట్స్ చేసిన నటుడు శివాజీ దిగి వచ్చాడు. తాను తప్పు చేశానని, క్షమించాలని కోరుతూ ఓ వీడియో రిలీజ్ చేశాడు. దండోరా అనే మూవీ ఈవెంట్ లో శివాజీ చేసిన కామెంట్స్ దుమారం రేగడం.. అనసూయ, చిన్మయిలాంటి వాళ్లు ఘాటుగా స్పందించడంతో శివాజీ దిగివచ్చాడు.
శివాజీ క్షమాపణ వీడియో

నటుడు శివాజీ మంగళవారం (డిసెంబర్ 23) సాయంత్రం ఓ వీడియోను ఎక్స్‌లో రిలీజ్ చేశాడు. అందులో అతడు మహిళలందరికీ క్షమాపణ చెప్పాడు.
“నాలుగు మంచి మాటలు చెప్పాలని చెబుతూనే రెండు అనకూడని మాటలు అన్నాను. వాళ్ల మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి క్షమాపణ చెబుతున్నాను. ఆ మాటలు అందరు అమ్మాయిలను ఉద్దేశించి చేసినవి కావు. నేను ఎవరినీ అవమానపరచాలని చేయలేదు. నేను ఎప్పుడూ స్త్రీ అంటే అమ్మవారిలాగే, మహాశక్తిలాగే చూస్తాను. సమాజంలో స్త్రీని ఎంత తక్కువగా చూస్తున్నారో మనకు తెలుసు. ఆ అవకాశం ఇవ్వకూడదనే అలా అన్నాను. నా ఉద్దేశం సరైనదే. కానీ ఆ రెండు మాటలు మాట్లాడకుండా ఉండాల్సింది” అని శివాజీ అన్నాడు.
అసలు ఏం జరిగిందంటే?
దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నటుడు శివాజీ హీరోయిన్లు వేసుకొనే బట్టల విషయంలో చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి.
‘‘ఒక విషయం చెబుతున్నా. అమ్మాయిలు, హీరోయిన్లు ఏ బట్టలు పడితే అవి వేసుకుని పోతే మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తదమ్మా. ఏం అనుకోవద్దు హీరోయిన్లందరూ, మీరు అనుకున్నా నాకు పోయేదేం లేదు. లైట్ తీసుకుంటాం అది వేరే విషయం. కానీ మీ అందం చీరలోనే, నిండుగా కప్పుకొనే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాన్లు కనపడేదాంట్లో ఏముండదమ్మా’’ అని శివాజీ అన్నారు.
‘‘అవి వేసుకున్నంత మాత్రాన చాలా మంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు కానీ దరిద్రపు ము*.. ఇలాంటి బట్టలు ఎందుకు వేసుకుంది? మంచివి వేసుకోవచ్చు కదా అని అనాలని ఉంటుంది లోపల. కానీ అనలేం కదా. అంటే మళ్లీ స్ట్రీ స్వాతంత్రం లేదంటారు’’ అని శివాజీ కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేశారు.
స్త్రీ అంటే ప్రకృతి
{{/usCountry}}‘‘అవి వేసుకున్నంత మాత్రాన చాలా మంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు కానీ దరిద్రపు ము*.. ఇలాంటి బట్టలు ఎందుకు వేసుకుంది? మంచివి వేసుకోవచ్చు కదా అని అనాలని ఉంటుంది లోపల. కానీ అనలేం కదా. అంటే మళ్లీ స్ట్రీ స్వాతంత్రం లేదంటారు’’ అని శివాజీ కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేశారు.
స్త్రీ అంటే ప్రకృతి
{{/usCountry}}‘‘స్త్రీ అంటే ప్రకృతి. ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరుగుతుంది. ఈ ప్రకృతి అద్భుతంగా ఉంటుంది. అలాగే స్త్రీ మా అమ్మ ఎప్పటికీ గుండెల్లో కనిపిస్తూ ఉంటుంది. సావిత్రి, సౌందర్య కానీ ఈ జనరేషన్ లో రష్మిక లాంటి వాళ్లు. చాలా మంది అమ్మాయిలు ఉన్నారు. వీళ్లందరూ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు కాబట్టి వెంబడే చెప్పగలుగుతున్నాం. గ్లామర్ అనేది ఒక దశ వరకే ఉండాలి. ఇక్కడి (చేతులు) వరకు ఉంటే పర్వాలేదు కానీ ఇక్కడి (ఎద) వరకూ రాకూడదు’’ అని శివాజీ మాట్లాడాడు.