టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీల తన చిరకాల కోరికను నెరవేర్చుకుంది. సినిమాల్లో బిజీగా ఉంటూనే వైద్య విద్యను పూర్తి చేసి, అధికారికంగా 'డాక్టర్' పట్టా అందుకుంది. ముంబైలో జరిగిన కాన్వొకేషన్ సెర్మనీలో ఆమె ఎంబీబీఎస్ (MBBS) డిగ్రీని అందుకుంది. ఆ ఫోటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
డాక్టర్ శ్రీలీలగా ప్రమాణ స్వీకారం..

వరుస సినిమాలు, ఊపిరి సలపని షూటింగ్ షెడ్యూల్స్.. అయినా సరే చదువును ఏమాత్రం నిర్లక్ష్యం చేయలేదు మన టాలీవుడ్ బ్యూటీ శ్రీలీల. గత ఆరేళ్లుగా ఒకవైపు సినిమాలు చేస్తూనే, మరోవైపు ఎంబీబీఎస్ చదివిన ఆమె.. తాజాగా తన కలను సాకారం చేసుకుంది. ఫిబ్రవరి 10న ముంబైలోని డీవై పాటిల్ యూనివర్సిటీలో (DY Patil University) జరిగిన కాన్వొకేషన్ సెర్మనీలో ఆమె అధికారికంగా ఎంబీబీఎస్ డిగ్రీని అందుకుంది.
వైరల్ అవుతున్న వీడియోల్లో శ్రీలీల మెరూన్ రంగు గౌను (Convocation Robes) ధరించి వేదికపై డిగ్రీని స్వీకరించడం చూడవచ్చు. తన సహచరులతో కలిసి ఆమె 'హిపోక్రటిక్ ఓత్' (వైద్య వృత్తి ప్రమాణం) చేసింది. డిగ్రీ అందుకున్న ఆనందంలో వేదిక దిగగానే తన కుటుంబ సభ్యులను గట్టిగా హత్తుకుని ఎమోషనల్ అయింది. 'క్లాస్ ఆఫ్ 2020' బ్యాచ్‌తో కలిసి ఆమె డాక్టర్‌గా పట్టా పుచ్చుకున్నారు.
ఫ్యాన్స్ ఫిదా.. ఆ డిసిప్లిన్ గ్రేట్!
శ్రీలీల డెడికేషన్ చూసి అభిమానులు, నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. "మామూలుగా పాస్ మార్కులు తెచ్చుకోవడమే కష్టం. అలాంటిది ఇన్ని సినిమాలు చేస్తూ, స్టార్ హీరోయిన్‌గా ఉంటూ ఎంబీబీఎస్ ఎలా పూర్తి చేసింది?" అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఆమెకు ముగ్గురు దత్తత పిల్లలు ఉన్న విషయాన్ని కూడా కొందరు గుర్తు చేస్తూ, ఆమె బాధ్యతను కొనియాడుతున్నారు.
తల్లి బాటలో..
అమెరికాలో పుట్టి బెంగళూరులో పెరిగిన శ్రీలీల తల్లి స్వర్ణలత కూడా ప్రముఖ గైనకాలజిస్ట్. తల్లి స్ఫూర్తితోనే శ్రీలీల వైద్య వృత్తిని ఎంచుకుంది. 'పెళ్లి సందD'తో తెలుగు తెరకు పరిచయమైన శ్రీలీల.. ధమాకా, భగవంత్ కేసరి, గుంటూరు కారం వంటి చిత్రాలతో స్టార్డమ్ తెచ్చుకుంది. ఇటీవల 'పుష్ప-2'లో 'కిస్సిక్' సాంగ్‌తో మాస్ ఆడియెన్స్‌ను ఉర్రూతలూగించింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సరసన 'ఉస్తాద్ భగత్ సింగ్', హిందీలో కార్తీక్ ఆర్యన్‌తో ఒక సినిమా, అలాగే ధనుష్‌తో మరో సినిమా చేస్తూ బిజీగా ఉంది.
{{/usCountry}}అమెరికాలో పుట్టి బెంగళూరులో పెరిగిన శ్రీలీల తల్లి స్వర్ణలత కూడా ప్రముఖ గైనకాలజిస్ట్. తల్లి స్ఫూర్తితోనే శ్రీలీల వైద్య వృత్తిని ఎంచుకుంది. 'పెళ్లి సందD'తో తెలుగు తెరకు పరిచయమైన శ్రీలీల.. ధమాకా, భగవంత్ కేసరి, గుంటూరు కారం వంటి చిత్రాలతో స్టార్డమ్ తెచ్చుకుంది. ఇటీవల 'పుష్ప-2'లో 'కిస్సిక్' సాంగ్‌తో మాస్ ఆడియెన్స్‌ను ఉర్రూతలూగించింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సరసన 'ఉస్తాద్ భగత్ సింగ్', హిందీలో కార్తీక్ ఆర్యన్‌తో ఒక సినిమా, అలాగే ధనుష్‌తో మరో సినిమా చేస్తూ బిజీగా ఉంది.
{{/usCountry}}