Srihari Wife: శ్రీహరి కూడా అలానే నటించేవారు, సింహాన్ని చూసినట్లుంది- కొడుకుపై రియల్ స్టార్ భార్య డిస్కో శాంతి కామెంట్స్
Disco Shanthi Speech In Aasmaan First Look Launch Event: రియల్ స్టార్ శ్రీహరి ఫ్యామిలీ నుంచి హీరోగా ఆయన కుమారుడు మేఘాంశ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఆ సినిమానే ఆస్మాన్. ఇటీవల శ్రీహరి జయంతి సందర్భంగా ఆస్మాన్ ఫస్ట్ లుక్ లాంచ్ చేశారు. ఈ ఈవెంట్‌లో శ్రీహరి భార్య డిస్కో శాంతి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
Disco Shanthi Speech In Aasmaan First Look Launch Event: రియల్ స్టార్, దివంగత నటుడు శ్రీహరికి తెలుగులో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నో సినిమాల్లో హీరోగా, నటుడిగా, విలన్‌గా తన నటనతో ఎంతగానో మెప్పించారు.

శ్రీహరి కుటుంబం నుంచి హీరో
అలాంటి నటుడు కుటుంబం నుంచి హీరోగా మరో తరం వస్తోంది. శ్రీహరి కుమారుడు మేఘాంశ్ శ్రీహరి హీరోగా ఎంట్రీ ఇస్తున్న సినిమా ఆస్మాన్. ఈ సినిమాను శ్రీమతి. కొండారు శ్రీనివాసరావు సమర్పణలో శ్రీ క్లీంకార సెల్యూలాయిడ్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్నారు.
ఈ ఆస్మాన్ మూవీకి రామ్ నందన్ దర్శకత్వం వహించగా.. వెంకటేష్ కొండారు, శ్రీకాంత్ మన్నెం నిర్మిస్తున్నారు. ఈ మూవీలో మేఘాంశ్ శ్రీహరికి జోడీగా హీరోయిన్‌గా రాయంచ చేస్తోంది. వీరితోపాటు ఆస్మాన్ సినిమాలో రవివర్మ, కమల్, కేశవ్ దీపక్, నిఖిల్, రాజశేఖర్, పద్మిని, ప్రేరణ గ్యాంగ్, సంతోష్, రమణ, కుమార్, సత్యరాజ్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు.
డిస్కో శాంతి కామెంట్స్
కాగా ఆస్మాన్ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, అరబిక్ భాషల్లో రూపొందుతోంది. ఇటీవల ఆగస్ట్ 15న శ్రీహరి జయంతి సందర్భంగా ఆస్మాన్ మూవీ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో శ్రీహరి భార్య, స్పెషల్ సాంగ్స్ నటి డిస్కో శాంతి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
శాంతి శ్రీహరి మాట్లాడుతూ.. "మేఘాంశ్ మీద నమ్మకంతో ‘ఆస్మాన్’ చేసేందుకు ముందుకు వచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. మేఘాంశ్‌ని కూడా పగలు, రాత్రి అన్న తేడా లేకుండా వర్క్ చేయిస్తున్నారు. శ్రీహరి గారు కూడా అలానే నటించేవారు. ఆర్టిస్టులు ఎప్పుడూ అలానే కష్టపడి నటించాలి" అని అన్నారు.
చిన్న పిల్లాడిలానే చూస్తుంటానీ.. కానీ,
"మేఘాంశ్‌ని అద్భుతంగా చూపిస్తున్న రామ్ నందన్‌కి థాంక్స్. ఈ మూవీకి పని చేస్తున్న ప్రతీ ఒక్కరికీ థాంక్స్. ‘ఆస్మాన్’తో మేఘాంశ్‌కి మంచి విజయం దక్కాలని ఓ తల్లిగా కోరుకుంటున్నాను" అని కోరారు డిస్కో శాంతి.
"నేను ఇప్పటికీ మేఘాంశ్‌ని చిన్న పిల్లాడిలానే చూస్తుంటాను. కానీ, ఈ రోజు పోస్టర్ చూసిన తర్వాత సింహాన్ని చూసినట్టుగా అనిపించింది. శశాంక్ అయితే మేఘాంశ్‌ని మరింత కేరింగ్‌గా చూసుకుంటాడు. మాకు ఈ జర్నీలో సపోర్ట్ చేస్తున్న మీడియాకి, నిర్మాతలకు థాంక్స్" అని డిస్కో శాంతి శ్రీహరి తన స్పీచ్ ముగించారు.
హీరోయిన్ రాయంచ స్పీచ్
ఇదే ఈవెంట్‌లో హీరోయిన్ రాయంచ మాట్లాడుతూ .. "‘ఆస్మాన్’ కోసం నేను ఎంతో ఎదురు చూస్తున్నాను. నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. కాన్సెప్ట్ పోస్టర్ నుంచీ మాకు మంచి పాజిటివ్ వైబ్ వస్తోంది" అని అన్నారు.
"కొన్ని రోజుల్లోనే ఆస్మాన్ షూట్ పూర్తి అవుతోంది. మాకు ఆడియెన్స్ నుంచి ఆదరాభిమానాలు కావాలి. శ్రీహరి గారి జయంతి సందర్భంగా మా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ లాంచ్ చేయడం ఆనదంగా ఉంది" అని హీరోయిన్ రాయంచ తెలిపారు.
వీకెండ్ లవ్ సినిమాలో శ్రీహరితో నటించా
"‘ఆస్మాన్’ చిత్రంలో నాకు అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. రామ్ మాకు ఈ కథను చాలా ఎక్కించారు. మేఘాంశ్ గారు పాత్రకు ప్రాణం పోస్తున్నారు. నాకు సపోర్ట్ చేసిన టీంకు థాంక్స్" అని కెమెరామెన్ షోయబ్ చెప్పుకొచ్చారు.
నటుడు రవి వర్మ మాట్లాడుతూ .. "‘శ్రీహరి గారితో నేను ‘వీకెండ్ లవ్’ అనే సినిమాను చేశాను. ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది. శ్రీహరి లానే మేఘాంశ్ ఎంతో ఎనర్జీగా, పవర్ ఫుల్‌గా కనిపిస్తున్నారు" అని పేర్కొన్నారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


