Srihari Son: హీరోగా రియల్ స్టార్ శ్రీహరి కొడుకు ఎంట్రీ-పెద్ద అరచేతిలో కాగడ పట్టుకున్న మేఘాంశ్- ఆస్మాన్ ఫస్ట్ లుక్ రిలీజ్

Actor Srihari Son Meghamsh Aasman First Look: దివంగత నటుడు, రియల్ స్టార్ శ్రీహరి కుమారుడు మేఘాంశ్ హీరోగా నటిస్తున్న తొలి సినిమా ఆస్మాన్. రామ్ నందన్ దర్శకత్వం వహిస్తున్న ఆస్మాన్ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌ను తాజాగా విడుదల చేశారు. పెద్ద అరచేయిలో మధ్యలో హీరో కాగడ పట్టుకున్న ఈ పోస్టర్ ఆకట్టుకునేలా ఉంది.

Published on: Aug 16, 2026, 12:28:13 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Actor Srihari Son Meghamsh Aasmaan First Look Released: శ్రీమతి. కొండారు శ్రీనివాసరావు సమర్పణలో శ్రీ క్లీంకార సెల్యూలాయిడ్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న చిత్రం ‘ఆస్మాన్’. ఈ సినిమాలో దివంగత నటుడు, రియల్ స్టార్ శ్రీహరి కుమారుడు మేఘాంశ్ శ్రీహరి హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమాకు రామ్ నందన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాని వెంకటేష్ కొండారు, శ్రీకాంత్ మన్నెం నిర్మిస్తున్నారు.

హీరోగా రియల్ స్టార్ శ్రీహరి కొడుకు ఎంట్రీ-పెద్ద అరచేతిలో కాగడ పట్టుకున్న మేఘాంశ్- ఆస్మాన్ ఫస్ట్ లుక్ రిలీజ్
హీరోగా రియల్ స్టార్ శ్రీహరి కొడుకు ఎంట్రీ-పెద్ద అరచేతిలో కాగడ పట్టుకున్న మేఘాంశ్- ఆస్మాన్ ఫస్ట్ లుక్ రిలీజ్

ఆస్మాన్ మూవీ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ రిలీజ్

ఆస్మాన్ సినిమా తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, అర‌బిక్ భాష‌ల్లో రూపొందుతోంది. స్వ‌ర్గీయ న‌టుడు శ్రీహరి జయంతి సందర్భంగా ఆస్మాన్ మూవీ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌ను శనివారం (ఆగస్ట్ 15) నాడు రిలీజ్ చేశారు. ఆస్మాన్ మోష‌న్ పోస్ట‌ర్ వీడియో గ‌మ‌నిస్తే.. సినిమాపై ఆస‌క్తి క‌లుగుతోంది.

పెద్ద అరచేయి మధ్యలో హీరో

పెద్ద అర‌చేయి మ‌ధ్య‌లో హీరో మేఘాంశ్ కాగ‌డా ప‌ట్టుకుని నిల‌బ‌డి ఉన్నాడు. ఆ అర‌చేయికి సంబంధించిన నుదురు, దానిపై డిఫ‌రెంట్‌గా డిజైన్ చేసిన బొట్టును కూడా మోష‌న్ పోస్ట‌ర్‌లో గ‌మ‌నించ‌వ‌చ్చు. అర‌చేయి చుట్టూ జ‌నాలంద‌రూ కాగడాల‌ను ప‌ట్టుకుని నిలుచున్నారు. అస‌లు అర‌చేయి ఎవ‌రిది? మేఘాంశ్ పాత్ర ఎలా ఉండ‌బోతుంద‌నే క్యూరియాసిటీ అంద‌రిలోనూ క్రియేట్ అవుతోంది.

హీరో మేఘాంశ్ శ్రీహరి కామెంట్స్

ఈ మేరకు నిర్వహించిన ఆస్మాన్ మోషన్ పోస్టర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో మేఘాంశ్ శ్రీహరి మాట్లాడుతూ .. "‘ఆస్మాన్’ చిత్రంలో అవకాశం ఇచ్చిన నిర్మాతలకు థాంక్స్. రామ్‌తో వర్క్ చేయడం ఓ గొప్ప ఎక్స్‌పీరియెన్స్. సెట్‌లో ఎప్పుడూ ఓ పండుగ వాతావరణం కనిపించేది" అని అన్నారు.

హీరోయిన్‌గా రాయంచ చేస్తున్నారు

"రాయంచ మా చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. ప్రశాంత్ గారి బీజీఎమ్ అద్భుతంగా ఉండబోతోంది. మిగతా విషయాలన్నీ మున్ముందు ప్రచార కార్యక్రమాల్లో మాట్లాడతాను" అని తెలిపారు హీరో మేఘాంశ్ శ్రీహారి.

మేఘాంశ్ బయట కూడా హీరోనే

దర్శకుడు రామ్ నందన్ మాట్లాడుతూ .. "‘ఆస్మాన్’ మూవీ అందరికీ ఓ కొత్త ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుంది. థియేటర్లో అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన నిర్మాత వెంకట్ గారు, హీరో మేఘాంశ్ గారికి, విజువల్స్ ఇచ్చిన షోయబ్ గారికి థాంక్స్. మేఘాంశ్ గారు బయట కూడా హీరోనే. మున్ముందు మరిన్ని అప్డేట్‌లతో వస్తాం" అని చెప్పారు.

మేఘాంశ్‌ది ట్రాన్స్‌ఫార్మర్ లాంటి బాడీ

నిర్మాత వెంకటేష్ మాట్లాడుతూ .. "‘ఆస్మాన్’ పోస్టర్ అద్భుతంగా ఉంది. నాకు పోస్టర్ చూస్తుంటే మాత్రం ఫుల్ ఎనర్జిటిక్‌గా అనిపిస్తోంది. మేఘాంశ్‌ది ట్రాన్స్‌ఫార్మర్‌లాంటి బాడీ. మేఘాంశ్ యాక్టింగ్ చూసి అందరం ఆశ్చర్యపోయేవాళ్లం" అని అన్నారు.

రియల్ స్టార్ కొడుకు ఇలానే ఉంటాడని

"మేఘాంశ్ షూటింగ్ సెట్‌లో అందరి కంటే ముందుంటాడు. రియల్ స్టార్ కొడుకు అంటే ఇలానే ఉంటాడనిపించేలా ఉంటాడు. మాకు ఈ జర్నీలో సపోర్ట్ చేసిన డిస్కో శాంతి మేడంకి థాంక్స్. సినిమా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను" అని ఆశాభావం వ్యక్తం చేశారు నిర్మాత వెంకటేష్.

తెలుగులో చాలా అరుదుగా వస్తుంది

మ్యూజిక్ డైరెక్టర్ ప్రశాంత్ ఆర్ విహారి మాట్లాడుతూ .. "‘ఆస్మాన్’ లాంటి చిత్రం తెలుగులో చాలా అరుదుగా వస్తుంది. ఇలాంటి డిఫరెంట్ ప్రాజెక్ట్‌కి పని చేస్తుండటం ఆనందంగా ఉంది. నాకు అవకాశం ఇచ్చిన అందరికీ థాంక్స్" అని పేర్కొన్నారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More