Ananya Raj: చిత్రసీమలో తీవ్ర విషాదం- నిద్రలోనే కన్నుమూసిన 27 ఏళ్ల హీరోయిన్ అనన్య- కన్నీళ్లు పెట్టిస్తున్న చివరి పోస్ట్!
Actress Ananya Raj Dies At Age 27: బాలీవుడ్‌తో పాటు తగ్గెదే లే వంటి తెలుగు సినిమాల్లో నటించిన 27 ఏళ్ల హీరోయిన్ అనన్య రాజ్ హఠాన్మరణం చెందారు. గత నెలలోనే ఆమె నిద్రలోనే కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తాజాగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించడంతో సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది.
Actress Ananya Raj Dies At Age 27: చిత్రసీమలో మరో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మోడల్, టాలీవుడ్ నటి, బాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనన్య రాజ్ (27) చిన్న వయసులోనే లోకాన్ని విడిచి వెళ్లారు. హిందీతో పాటు ప్రాంతీయ భాషా చిత్రాల్లో, మ్యూజిక్ వీడియోలలో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె హఠాన్మరణం అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

నిద్రలోనే కన్నుమూసిన అనన్య రాజ్
గత కొద్దిరోజులుగా అనన్య రాజ్ వార్తల్లో కనిపించకపోవడంతో అభిమానులు ఆందోళన చెందగా, జులై 15వ తేదీ అర్థరాత్రి నిద్రలోనే అనన్య రాజ్ కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తాజాగా ప్రకటించారు.
ఏడాదిగా మానసిక, శారీరక క్షోభ.. ఏమైందంటే?
అనన్య రాజ్ ఆకస్మిక మరణానికి గల కచ్చితమైన కారణాలను కుటుంబ సభ్యులు బయటకు చెప్పనప్పటికీ, గత ఏడాది కాలంగా ఆమె తీవ్రమైన శారీరక, మానసిక సమస్యలతో బాధపడినట్లు తెలిపారు. ఎంతటి కష్టమొచ్చినా ఒక యోధురాలిలా పోరాడిందని, అయితే జులై 15న అర్థరాత్రి నిద్రలోనే ప్రశాంతంగా ప్రాణాలు వదిలిందని సోషల్ మీడియాలో పేర్కొన్నారు.
అనన్య రాజ్ అంత్రక్రియల ఫొటోలు
హీరోయిన్ అనన్య రాజ్ అంత్యక్రియలకు సంబంధించిన కొన్ని ఫొటోలను షేర్ చేస్తూ, ఈ కష్టసమయంలో తమ వ్యక్తిగత జీవితానికి (ప్రైవసీ) ప్రాధాన్యం ఇవ్వాలని కుటుంబ సభ్యులు కోరారు.
"వెలిగిపోయే సమయం వచ్చింది": చివరి పోస్ట్ వైరల్
అనన్య రాజ్ మే 17న పెట్టిన చివరి సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు నెటిజన్లను కన్నీళ్లు పెట్టిస్తోంది. ఒక షూటింగ్ సెట్‌లో బ్లాక్ అండ్ వైట్ దుస్తుల్లో అందంగా పోజ్ ఇచ్చిన ఫోటోను షేర్ చేస్తూ.. "బ్లాక్ అండ్ వైట్.. ఇక నేను వెలిగిపోయే సమయం వచ్చింది (It's time to shine)" అని అనన్య రాజ్ క్యాప్షన్ రాసుకొచ్చారు.
శాశ్వతంగా నూరేళ్లు నిండిపోతాయని
అయితే అదే ఆమె చివరి పోస్ట్ అవుతుందని, అంతలోనే శాశ్వతంగా నూరేళ్లు నిండిపోతాయని ఎవరూ ఊహించలేదు. ఈ పోస్ట్ చూసిన అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా అనన్య ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులు అర్పిస్తున్నారు.
అనన్య రాజ్ బాలీవుడ్ సినిమాలు, ఫాలోవర్లు
అనన్య రాజ్‌కు సోషల్ మీడియాలో 1.5 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. 2016లో వచ్చిన '7 అవర్స్ టు గో' సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన అనన్య రాజ్ ఆ తర్వాత 'ది ఫైనల్ ఎగ్జిట్' (2017), విక్రమ్ భట్ దర్శకత్వంలో వచ్చిన 'గోస్ట్' (2019) సినిమాల్లో నటించి గుర్తింపు పొందారు.
'తగ్గెదే లే' సినిమాతో తెలుగులో గుర్తింపు
టి-సిరీస్, జీ మ్యూజిక్, టైమ్స్ మ్యూజిక్ వంటి దిగ్గజ సంస్థల మ్యూజిక్ వీడియోల్లోనూ అనన్య మెరిసారు. తెలుగులో నవీన్ చంద్ర హీరోగా వచ్చిన 'తగ్గేదే లే' చిత్రంతో పాటు 'మద్రాసి గ్యాంగ్' అనే త్రిభాషా చిత్రంలోనూ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అనన్య రాజ్.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


