Kherrub: తెలుగులో సరికొత్త ఫాంటసీ థ్రిల్లర్ కెరూబ్- అదిరిపోయిన విజువల్స్, మేకపిల్లలా హీరోయిన్- ఫస్ట్ లుక్ రిలీజ్

Kherrub First Look Poster Released: విహాన్ కార్తీక్, దివ్య విశ్వకర్మ జంటగా నటిస్తున్న తెలుగు ఫాంటసీ థ్రిల్లర్ 'కెరూబ్'. ఎం జె నాయుడు దర్శకత్వంలో ఖుషి ఎంటర్ టైన్‌మెంట్స్ నిర్మించిన ఈ మూవీ సెన్సార్ పూర్తి చేసుకుని సెప్టెంబర్‌లో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో రిలీజ్ చేసిన ఫస్టు లుక్ ఆకట్టుకుంటోంది.

Published on: Aug 13, 2026, 17:42:52 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Kherrub First Look Poster Released: తెలుగు చిత్ర పరిశ్రమలో వినూత్న కథాంశాలతో వచ్చే సినిమాలకు ఎప్పుడూ మంచి ఆదరణ లభిస్తూనే ఉంటుంది. అదే బాటలో ఒక సరికొత్త ఫాంటసీ థ్రిల్లర్ కథతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది 'కెరూబ్' సినిమా.

తెలుగులో సరికొత్త ఫాంటసీ థ్రిల్లర్ కెరూబ్- అదిరిపోయిన విజువల్స్, మేకపిల్లలా హీరోయిన్- ఫస్ట్ లుక్ రిలీజ్
తెలుగులో సరికొత్త ఫాంటసీ థ్రిల్లర్ కెరూబ్- అదిరిపోయిన విజువల్స్, మేకపిల్లలా హీరోయిన్- ఫస్ట్ లుక్ రిలీజ్

విహాన్ కార్తీక్, దివ్య విశ్వకర్మ హీరో హీరోయిన్లుగా

విహాన్ కార్తీక్, దివ్య విశ్వకర్మ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ కెరూబ్ చిత్రాన్ని ఖుషి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. నిర్మాత బాలు బల్లెకారి ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. దర్శకుడు ఎంజె నాయుడు (జీవన్) ఈ కెరూబ్ చిత్రాన్ని తెరకెక్కించారు.

తుది దశకు సెన్సార్ పనులు.. సెప్టెంబర్‌లో విడుదల!

ఇప్పటికే నిర్మాణంతర పనులు పూర్తిచేసుకొని ఫస్ట్ కాపీతో సిద్ధమైన కెరూబ్ చిత్రం ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ ప్రక్రియ ముగిసిన వెంటనే సెప్టెంబర్ నెలలో చిత్రాని గ్రాండ్‌గా థియేటర్లలోకి తీసుకొచ్చేందుకు దర్శక నిర్మాతలు సన్నాహాలు వేగవంతం చేశారు.

ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్ పోస్టర్

ఇప్పటికే విడుదలైన ఈ కెరూబ్ చిత్ర టీజర్‌కు డిజిటల్, సోషల్ మీడియాలో అద్భుతమైన స్పందన వచ్చింది. కాగా, తాజాగా మేకర్స్ విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ సినీ ప్రియులను అమితంగా ఆకట్టుకుంటోంది. జలపాతాల నడుమ ఆహ్లాదకరమైన ప్రకృతి ఒడిలో కథానాయకుడు వేణువు వాయిస్తున్న ఈ పోస్టర్ చూస్తుంటే, ఒక సరికొత్త రకమైన ఫాంటసీ ప్రపంచంలోకి తీసుకెళ్లే కథాంశమిదని స్పష్టమవుతోంది.

వినూత్నమైన కాన్సెప్ట్

"ఒక వినూత్నమైన కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించాం. ఇటీవల వచ్చిన టీజర్‌కు, ఇప్పుడు ఫస్ట్ లుక్‌కు ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన మా నమ్మకాన్ని మరింత పెంచింది. త్వరలోనే మరిన్ని అప్‌డేట్స్‌ను వెల్లడిస్తాం" అని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేసింది.

బలమైన తారాగణం.. ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులు

ఈ కెరూబ్ చిత్రంలో సీనియర్ నటీనటులు కల్పలత, సుమన్ శెట్టి, రమేష్ కొనంభొట్ల, గడ్డం సురేష్, శ్రీధర్ మాడ తదితరులు కీలక పాత్రలు పోషించారు. సత్య రాధాకృష్ణ అందించిన మ్యూజిక్, రమేష్ తోకల ఛాయాగ్రహణం (DOP) ఈ ఫాంటసీ కథనానికి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.

రివీల్ చేయని కథ

కొక్కుల ప్రసాద్ ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. కెరూబ్ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు, ప్రమోషనల్ ఈవెంట్స్ సమాచారాన్ని మేకర్స్ త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. ఇకపోతే ఇదివరకు విడుదలైన కెరూబ్ టీజర్‌లో పెద్దగా కథను రివీల్ చేయలేదు.

మేకపిల్లలా హీరోయిన్

అడవిలో హీరో వెణువు వాయిస్తూ ఉంటాడు. అదే అడవిలో అతనికి హీరోయిన్ కనిపిస్తుంది. అడవిలో తప్పిపోయిన తన మేకపిల్ల కోసం వెతుకుతుండగా మీరు కనిపించారని హీరోయిన్‌తో హీరో చెబుతాడు. అడవిలో తన మేకపిల్లలా తప్పిపోయిన హీరోయిన్‌కు సహాయం చేసేందుకు హీరో అక్కడ ఉన్నట్లుగా ఆ టీజర్ ద్వారా అర్థమవుతోంది.

అదిరిపోయే విజువల్స్

అనంతరం నటి కల్పలత, బిగ్ బాస్ ఫేమ్, కమెడియన్ సుమన్ శెట్టి రక్తపుమడుగుల్లో ఉండటం ఉత్కంఠత కలిగించింది. హీరో హీరోయిన్లకు వారికి ఏంటీ సంబధం, అసలు వారికి ఏమైంది అనేది ఇంట్రెస్ట్ కలిగించింది. అంతేకాకుండా టీజర్‌లో చూపించిన విజువల్స్ అదిరిపోయాయి.

ఇంకా రిలీజ్ డేట్ ఫిక్స్ కానీ కెరూబ్ బాక్సాఫీస్ వద్ద ఏ మేర ఆకట్టుకుంటుందో చూడాలి.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More