Udaybir Sandhu: 10 ఏళ్ల నిరీక్షణ, వేల ఆడిషన్స్- ధురంధర్ 2లో ఆ ఒక్క సీన్‌తో దక్కిన గుర్తింపు- ఉదయ్‌బీర్ సంధు ఎమోషనల్!
Udaybir Sandhu About Dhurandhar 2 Pinda Role: ‘ధురంధర్ 2’లో ‘పిండా’గా అద్భుత నటన కనబరిచిన నటుడు ఉదయ్‌బీర్ సంధుపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఇండస్ట్రీలో అవుట్‌సైడర్‌గా ఎదుర్కొన్న సవాళ్లు, పదేళ్ల తన సుదీర్ఘ పోరాటం గురించి ఆయన పంచుకున్న విశేషాలు ఇక్కడ తెలుసుకుందాం.
ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట కొనసాగిస్తున్న ‘ధురంధర్: ది రివెంజ్’ చిత్రంలో రణ్‌వీర్ సింగ్‌తో పాటు మరో నటుడి పేరు మారుమోగిపోతోంది. ఆయనే ఉదయ్‌బీర్ సంధు. ధురంధర్ 2 సినిమాలో ఆయన కనిపించేది కొన్ని నిమిషాలే అయినా, ‘పిండా’ అనే పాత్రలో తనదైన ముద్ర వేశారు.

ముఖ్యంగా రణ్‌వీర్ సింగ్ పోషించిన ‘హమ్జా’ పాత్రలోని మరో కోణాన్ని బయటకు తీయడంలో పిండా పాత్ర కీలకంగా మారింది. తాజాగా పింక్‌విల్లాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉదయ్‌బీర్ తన సినీ ప్రయాణం గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు.
పదేళ్ల నిరీక్షణ.. వేల ఆడిషన్లు!
సినిమా రంగంలో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేని వ్యక్తికి ఒక మంచి బ్రేక్ రావడం ఎంత కష్టమో ఉదయ్‌బీర్ మాటల్లో వినిపించింది. "నేను ఈ రంగంలోకి వచ్చి పదేళ్లు అవుతోంది. ఢిల్లీలో మోడల్‌గా ప్రయాణం మొదలుపెట్టి, ఆ తర్వాత ముంబైకి మారాను. కెమెరా ముందు ఎలా ఉండాలో నేర్చుకోవడానికి ఎన్నో యాడ్ ఫిల్మ్స్ చేశాను. టీవీ సీరియల్స్, సినిమాలు, ఓటీటీ వెబ్ సిరీస్‌ల కోసం నేను ఎన్ని వేల ఆడిషన్లు ఇచ్చానో నాకే తెలియదు" అని ఉదయ్‌బీర్ సంధు గుర్తు చేసుకున్నారు.
ఇండస్ట్రీలోకి రావడం గురించి చెబుతూ.. "బయట నుంచి వచ్చే వారికి ఇక్కడ అవకాశం దక్కడం చాలా కష్టం. ఆ చిన్న తలుపు ఎప్పుడు తెరుచుకుంటుందా, మనం ఎప్పుడు లోపలికి వెళ్తామా అని ఏళ్ల తరబడి వేచి చూడాలి. ఆ ఎదురుచూపులకే చాలా సమయం పడుతుంది" అని తన ఆవేదనను పంచుకున్నారు ఉదయ్‌బీర్.
"ఇల్లు గుర్తుకు రాలేదా జస్సీ?"
ధురంధర్ 2 ఇంటర్వెల్‌లో రణ్‌వీర్ సింగ్, ఉదయ్‌బీర్ మధ్య జరిగే ఘర్షణ సన్నివేశం థియేటర్లలో ఈలలు వేయిస్తోంది. పాకిస్థాన్‌లో గూఢచారిగా తన గుర్తింపును దాచుకోవడానికి హమ్జా ప్రయత్నిస్తున్నప్పుడు అతడి పాత స్నేహితుడైన పిండా ఎదురవుతాడు.
ఆ సమయంలో ఉదయ్‌బీర్ చెప్పే "ఘర్ దీ యాద్ నహీ ఆయీ తుఝే, జస్సీ?" (నీకు ఇల్లు గుర్తుకు రాలేదా జస్సీ?) అనే డైలాగ్ అందరిని షాక్‌కు గుర్తు చేస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ డైలాగ్ ట్రెండింగ్‌లో ఉంది. ఈ డైలాగ్‌తో సోషల్ మీడియాలో మీమ్స్ కూడా వస్తున్నాయి.
పదేళ్ల నిరీక్షణకు గుర్తింపు
ఈ ఒక్క సీన్‌తో ఉదయ్‌బీర్ స్క్రీన్ ప్రెజెన్స్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఒక్క సీన్‌తోనే ఉదయ్‌బీర్ సంధుకు ఎనలేని గుర్తింపు వస్తోంది. పదేళ్ల నిరీక్షణ, వేల ఆడిషన్స్ ఇచ్చిన కష్టానికి ఇది తగిన ప్రతిఫలంగా మారింది.
రికార్డుల వేటలో ‘ధురంధర్ 2’
గతేడాది డిసెంబర్‌లో విడుదలైన ‘ధురంధర్’ మొదటి భాగం ప్రపంచవ్యాప్తంగా రూ. 1300 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా వచ్చిన ‘ధురంధర్ 2’ జస్కీరాంత్ సింగ్ రంగీ ఎలా హమ్జా అలీ మజారీగా మారాడు అనే బ్యాక్‌స్టోరీతో అలరిస్తోంది.
ప్రతి ఒక్కరికీ గుర్తింపు
రణ్‌వీర్ సింగ్‌తో పాటు ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, రాకేష్ బేడీ, సారా అర్జున్ వంటి దిగ్గజ తారాగణం ఈ సినిమాలో నటించింది. వీరందరికి తమ పాత్రలతో మంచి గుర్తింపు వస్తోంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


