ఈ సైకలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌లో నన్ను చూసి ఆశ్చర్యపోతారు.. ఇంతకుముందు ఎప్పుడూ అలా చూడలేదు: వరుణ్ సందేశ్

టాలీవుడ్ నటుడు వరుణ్ సందేశ్ ఇప్పటి వరకూ ఎప్పుడూ చూడని పాత్రలో కనిపించబోతున్నాడు. జీ5 ఓటీటీలోకి రాబోతున్న సైకలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ నయనంతో అతడు ఓటీటీలోకి అడుగుపెట్టనున్న విషయం తెలిసిందే.

Published on: Dec 16, 2025, 20:57:20 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

'హ్యాపీ డేస్' హీరో వరుణ్ సందేశ్ తొలిసారిగా డిజిటల్ ఎంట్రీ ఇస్తూ 'నయనం' (Nayanam) అనే వెబ్ సిరీస్‌లో నటిస్తున్నాడు. ఎప్పుడూ లవర్ బాయ్ పాత్రల్లో కనిపించే వరుణ్.. ఇందులో ఇతరుల జీవితాల్లోకి తొంగిచూసి, నేరాలు చేసే ఒక క్రేజీ డాక్టర్‌గా కనిపించబోతున్నాడు. ఈ థ్రిల్లర్ వెబ్ సిరీస్ డిసెంబర్ 19న జీ5లో స్ట్రీమింగ్ కానుంది.

ఈ సైకలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌లో నన్ను చూసి ఆశ్చర్యపోతారు.. ఇంతకుముందు ఎప్పుడూ అలా చూడలేదు: వరుణ్ సందేశ్
ఈ సైకలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌లో నన్ను చూసి ఆశ్చర్యపోతారు.. ఇంతకుముందు ఎప్పుడూ అలా చూడలేదు: వరుణ్ సందేశ్

నయనం వెబ్ సిరీస్ గురించి..

టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్ తన ఇమేజ్‌ను పూర్తిగా మార్చుకునే పనిలో పడ్డాడు. పక్కింటి కుర్రాడి పాత్రలకు గుడ్ బై చెప్పి.. వెన్నులో వణుకు పుట్టించే 'సైకో డాక్టర్' పాత్రతో ఓటీటీలోకి అడుగుపెడుతున్నాడు. అతడు ప్రధాన పాత్రలో నటించిన న్యూ ఏజ్ థ్రిల్లర్ 'నయనం'. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ వెబ్ సిరీస్ డిసెంబర్ 19 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

వరుణ్ సందేశ్ ఏమన్నాడంటే?

ఈ నయనం వెబ్ సిరీస్‌లో తన పాత్ర గురించి వరుణ్ సందేశ్ మాట్లాడాడు. "దర్శకురాలు కథ చెప్పినప్పుడు.. నన్నే ఎందుకు ఎంచుకున్నారా అని ఆశ్చర్యపోయాను. కానీ స్క్రిప్ట్ చదివాక.. నాలోని నటుడిని బయటకు తెచ్చే ప్రాజెక్ట్ ఇదే అనిపించింది. ప్రేక్షకులు నన్ను ఇంతకు ముందెప్పుడూ చూడని అవతారంలో చూస్తారు" అని చెప్పాడు.

ఇందులో వరుణ్ సందేశ్ డాక్టర్ నయన్‌గా కనిపిస్తాడు. పేదవాళ్లకు కంటి ఆపరేషన్ చేసి లెన్సులు అమరుస్తాడు. అయితే ఆ లెన్సుల ద్వారా వారి జీవితాలను చూస్తూ అమాయకులను చంపేసే ఒక శాడిస్ట్ డాక్టర్ పాత్ర ఇది.

ఇలాంటి ఇంటెన్స్ పాత్ర చేయడం చాలా కష్టమైందని, మానసికంగా తనపై ప్రభావం చూపిందని వరుణ్ తెలిపాడు. డాక్టర్ నయన్ మైండ్‌సెట్‌ను అర్థం చేసుకోవడానికి తనకు కొంత సమయం పట్టిందని అన్నాడు.

స్వాతి ప్రకాష్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో మొత్తం ఆరు ఎపిసోడ్లు ఉన్నాయి. ప్రతి ఎపిసోడ్, ముఖ్యంగా క్లైమాక్స్ ఎపిసోడ్ ప్రేక్షకులను సీట్లకు అతుక్కుపోయేలా చేస్తుందని వరుణ్ ధీమా వ్యక్తం చేశాడు.

నయనం వెబ్ సిరీస్ స్టోరీ, నటీనటులు

స్వాతి ప్రకాష్ దర్శకత్వం వహించిన నయనం వెబ్ సిరీస్ లో మొత్తం 6 ఎపిసోడ్లు ఉంటాయి. బిగ్ బాస్ 8 ఫేమ్ ప్రియాంక జైన్ ఇందులో ఫిమేల్ లీడ్‌గా నటించింది. ఆమె పాత్ర కథలో చాలా కీలకం. వీళ్లే కాకుండా ఉత్తేజ్, అలీ రెజా, రేఖ నిరోషా, హరీష్ ముఖ్య పాత్రల్లో నటించారు.

లవర్ బాయ్ పాత్రలే చేస్తాడనుకునే వారికి ఈ సిరీస్ ఒక సర్ప్రైజ్ అని, క్లైమాక్స్ ఎపిసోడ్ అదిరిపోతుందని వరుణ్ ధీమా వ్యక్తం చేశాడు. వరుస పరాజయాల్లో ఉన్న వరుణ్ సందేశ్‌కు ఈ సిరీస్ బ్రేక్ ఇస్తుందేమో చూడాలి. ఈ శుక్రవారం (డిసెంబర్ 19) నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More