న్యూడ్‌గా చెట్టెక్కిన నటుడు.. ఎందుకలా చేయాల్సి వచ్చిందో చెబుతూ పోస్ట్.. కనీసం ఆకులైనా కట్టుకోవాలంటూ..
ఓ నటుడు ఒంటిపై నూలుపోగు లేకుండా చెట్టెక్కడం ఎప్పుడైనా చూశారా? బాలీవుడ్ నటుడు విద్యుత్ జామ్వాల్ ఇప్పుడదే పని చేశాడు. అంతేకాదు ఆ వీడియోను తానే ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ.. అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో వివరించాడు.
ఇండియాలో అత్యంత ఫిట్‌గా ఉండే హీరోల్లో ఒకరైన విద్యుత్ జామ్వాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కేరళకు చెందిన పురాతన యుద్ధ విద్య ‘కలరిపయట్టు’లో (Kalaripayattu) అతడు దిట్ట. తరచుగా సాహసోపేతమైన విన్యాసాలతో అభిమానులను ఆశ్చర్యపరిచే విద్యుత్.. తాజాగా శనివారం (జనవరి 10) ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియో చూసి జనం షాక్ అవుతున్నారు. ఇందులో అతడు న్యూడ్ గా చెట్టు ఎక్కుతూ కనిపించాడు.

నగ్నంగా విద్యుత్.. అసలేంటీ ‘సహజ’ ప్రక్రియ?
ఆ వీడియోలో విద్యుత్ జామ్వాల్ చకచకా చెట్టు పైకి ఎక్కడం చూడవచ్చు. అయితే వెనుక భాగం కనిపించకుండా ఒక ‘దిష్టి బొమ్మ’ ఎమోజీని అడ్డుగా పెట్టాడు. దీనిపై విద్యుత్ వివరణ ఇస్తూ.. "కలరిపయట్టు సాధకుడిగా, నేను ఏడాదికి ఒకసారి ‘సహజ’ (Sahaja) అనే యోగ ప్రక్రియను ఆచరిస్తాను. సహజ అంటే మన సహజసిద్ధమైన స్థితికి, ప్రవృత్తికి దగ్గరగా వెళ్లడం. ఇది ప్రకృతితో, మన అంతరాత్మతో మమేకమయ్యేలా చేస్తుంది" అని పేర్కొన్నాడు. శాస్త్రీయంగా ఇది నాఢీ వ్యవస్థను ఉత్తేజితం చేస్తుందని, శరీర సమతుల్యతను, ఏకాగ్రతను పెంచుతుందని అతడు చెప్పుకొచ్చాడు.
టార్జాన్ కూడా ఆకులు కట్టుకుంటాడు కదా!
విద్యుత్ చెప్పిన ‘సైన్స్’ ఎలా ఉన్నా, నెటిజన్లు మాత్రం ఈ వీడియో చూసి నోరెళ్లబెడుతున్నారు. కామెంట్ సెక్షన్‌లో మీమ్స్, సెటైర్లు పేలుతున్నాయి. "చెట్టు ఎక్కడానికి బట్టలు విప్పాల్సిన అవసరం ఏముంది?" అని ఒకరు ప్రశ్నిస్తే.. "అడవిలో టార్జాన్ కూడా కనీసం ఆకులైనా చుట్టుకుంటాడు.. కానీ నువ్వు వేరు సామి, మాహానుభావుడివి" అని మరొకరు చమత్కరించారు. ఇంకొందరు మాత్రం "మీ కాన్ఫిడెన్స్ మామూలుగా లేదు బాస్" అంటూ మెచ్చుకుంటున్నారు.
బాక్సాఫీస్ వద్ద జోరు.. హాలీవుడ్ ఎంట్రీ
ఇక విద్యుత్ జామ్వాల్ సినిమాల విషయానికి వస్తే.. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన ‘మదరాసి’ (Madharaasi) సినిమాతో విద్యుత్ ఇటీవల భారీ విజయాన్ని అందుకున్నాడు. ఇండియాలో ఈ సినిమా కేవలం ఐదు రోజుల్లోనే రూ. 44 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది.
త్వరలోనే విద్యుత్ హాలీవుడ్‌లోకి అడుగుపెట్టనున్నాడు. ప్రముఖ వీడియో గేమ్ ఆధారంగా తెరకెక్కుతున్న ‘స్ట్రీట్ ఫైటర్’ (Street Fighter) రీబూట్‌లో అతడు యోగి ‘ధల్సిమ్’ పాత్రలో కనిపించనున్నాడు. ఈ మూవీలో ‘ఆక్వామ్యాన్’ ఫేమ్ జాసన్ మోమోవా వంటి హాలీవుడ్ ప్రముఖులు కూడా నటిస్తుండటం విశేషం.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


