...
...
Next Story

తిరుమల శ్రీవారికి రూ.100 కోట్ల విలువైన ఆస్తి ఇచ్చేసిన అలనాటి నటి.. ఎయిర్ హోస్టెస్ నుంచి స్టార్ హీరోయిన్‌గా ఎదిగి..

అలనాటి తెలుగు నటి కాంచన తిరుమల శ్రీవారి పట్ల తనకున్న భక్తిని చాటుకుంది. చెన్నైలో తనకు వారసత్వంగా వచ్చిన రూ.100 కోట్ల విలువైన భూమిని తిరుమల తిరుపతి దేవస్థానానికి విరాళంగా ఇవ్వడం విశేషం.

Published on: Dec 8, 2025, 17:55:29 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

తెలుగు హీరోయిన్ కాంచన తెలుసా? కొన్ని దశాబ్దాల కిందట తెలుగు, తమిళ స్టార్ హీరోల సరసన నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఆ మధ్య అర్జున్ రెడ్డి మూవీలో నటించింది. ఇక ఇప్పుడు ప్రభాస్ స్పిరిట్ మూవీలోనూ నటించనుంది. ఆమె ఇప్పుడు 86 ఏళ్ల వయసులో తన ఉదారతను చాటుకుంది. ఏకంగా రూ.100 కోట్ల విలువైన ఆస్తిని తిరుమల శ్రీవారి ఆలయానికి రాసిచ్చేసింది.

కాంచన విరాళం

తిరుమల శ్రీవారికి రూ.100 కోట్ల విలువైన ఆస్తి ఇచ్చేసిన అలనాటి నటి.. ఎయిర్ హోస్టెస్ నుంచి స్టార్ హీరోయిన్‌గా ఎదిగి..
తిరుమల శ్రీవారికి రూ.100 కోట్ల విలువైన ఆస్తి ఇచ్చేసిన అలనాటి నటి.. ఎయిర్ హోస్టెస్ నుంచి స్టార్ హీరోయిన్‌గా ఎదిగి..

వసుంధర దేవిగా 1939లో చెన్నైలో జన్మించిన నటి కాంచన. మొదట ఎయిర్ హోస్టెస్ అయిన ఆమె తర్వాత సినిమాల్లోకి వచ్చింది. చాలా రోజులుగా ఎవరి కంటా పడని ఆమె.. ఇప్పుడు టీటీడీకి భూరి విరాళంతో వార్తల్లో నిలిచింది. ఆమె తిరుమల తిరుపతి దేవస్థానానికి (TTD) ఏకంగా రూ. 100 కోట్ల విలువైన ఆస్తిని విరాళంగా రాసిచ్చింది. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిపై ఆమెకున్న అచంచలమైన భక్తే ఇందుకు కారణం. ఆ స్వామి సేవ కోసమే ఆమె పెళ్లి కూడా చేసుకోకుండా, ఆధ్యాత్మిక జీవనాన్ని గడుపుతోంది.

న్యాయ పోరాటం చేసి మరీ..

కాంచన, ఆమె సోదరి గిరిజా పాండేలకు చెన్నైలోని టీ నగర్, జీఎన్ చెట్టి రోడ్డులో అత్యంత విలువైన స్థలం వారసత్వంగా వచ్చింది. అయితే బంధువులు ఆ ఆస్తిని లాక్కోవడానికి ప్రయత్నించడంతో ఆమె సుదీర్ఘ న్యాయ పోరాటం చేయాల్సి వచ్చింది. ఆస్తి దక్కితే దేవుడికే ఇస్తానని మొక్కుకుంది. కోర్టులో గెలిచిన వెంటనే తన మాట తప్పకుండా ఆ స్థలాన్ని స్వామివారికి రాసిచ్చేసింది. అక్కడ వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవార్ల ఆలయ నిర్మాణం కోసం ఈ ఆస్తిని టీటీడీకి అప్పగించింది. ప్రస్తుతం ఈ ఆస్తి విలువ రూ. 80 కోట్ల నుంచి 100 కోట్ల వరకు ఉంటుందని అంచనా.

ఎయిర్ హోస్టెస్ హీరోయిన్ వరకు..

ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు వంటి అగ్ర హీరోలందరి సరసన ఆడిపాడింది. చెన్నైలో ఒక తెలుగు కుటుంబంలో జన్మించిన కాంచన.. జీవితాంతం బ్రహ్మచారిణిగా ఉండిపోవాలని నిర్ణయించుకుంది. ప్రస్తుతం ఆమె తన చెల్లెలితో కలిసి ప్రశాంతమైన, ఆధ్యాత్మిక జీవితాన్ని గడుపుతోంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe