...
...
Next Story

గురు పౌర్ణమి రోజే బాబుకు జన్మనిచ్చిన టీవీ నటి.. 42 ఏళ్ల వయసులో తొలిసారి తల్లయిన కరిష్మా

Karishma Tanna: టీవీ, ఓటీటీ నటి కరిష్మా తన్నా గురు పౌర్ణమి రోజే బాబుకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆమె తన ఇన్‌స్టా అకౌంట్ లో పోస్ట్ చేసింది. దీంతో ఆమెపై టీవీ, సినిమా ఇండస్ట్రీ నుంచి శుభాకాంక్షల వర్షం కురుస్తోంది.

Published on: Jul 29, 2026, 21:18:05 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Karishma Tanna: ఈరోజు అంటే జులై 29 గురు పౌర్ణమి పవిత్ర పర్వదినాన బాలీవుడ్ ప్రముఖ నటి కరిష్మా తన్నా ఇంట సరికొత్త వెలుగులు విరబూశాయి. తన భర్త వరుణ్ బంగేరాతో (Varun Bangera) కలసి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్లు సోషల్ మీడియా వేదికగా అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. ఈ గుడ్ న్యూస్ విన్న వెంటనే సినీ, టీవీ రంగానికి చెందిన ప్రముఖులతో పాటు ఫ్యాన్స్ నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

గురు పౌర్ణమి రోజే బాబుకు జన్మనిచ్చిన టీవీ నటి.. 42 ఏళ్ల వయసులో తొలిసారి తల్లయిన కరిష్మా
గురు పౌర్ణమి రోజే బాబుకు జన్మనిచ్చిన టీవీ నటి.. 42 ఏళ్ల వయసులో తొలిసారి తల్లయిన కరిష్మా

తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో కరిష్మా ఒక ఎమోషనల్ బ్లాక్ అండ్ వైట్ ఫోటోను షేర్ చేశారు. ఆ పిక్‌లో పాపాయి చిన్న పాదాలు కనిపిస్తూ, 'హి ఈజ్ హియర్' (He's Here) అని రాసి ఉన్న ట్యాగ్ అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది. "ఈ పవిత్రమైన గురు పౌర్ణమి రోజున మా జీవితంలోకి అతిపెద్ద బ్లెస్సింగ్ వచ్చింది. జులై 29, 2026న మా చిన్ని ప్రపంచంలోకి నీకు స్వాగతం" అంటూ ఆనందంతో ఒక క్యాప్షన్ కూడా రాసుకొచ్చారు. ఆమె 42 ఏళ్ల వయసులో తల్లి కావడం విశేషం.

సినీ దిగ్గజాల శుభాకాంక్షలు.. సోషల్ మీడియాలో వైరల్

కరిష్మా తన్నా దంపతులకు బాబు పుట్టాడనే వార్త తెలిసిన వెంటనే సినీ లోకం నుంచి ప్రశంసల జల్లు కురిసింది. ప్రముఖ రాజకీయ నాయకురాలు, నటి స్మృతి ఇరానీ, బాలీవుడ్ యంగ్ బ్యూటీ ఖుషీ కపూర్, పాపులర్ కమెడియన్ కికు శార్దా, సోను సూద్, సోనాల్ చౌహాన్, వామికా గబ్బి, నేహా దూపియా లాంటి ఎందరో సెలబ్రిటీలు కామెంట్ సెక్షన్‌లో తమ లవ్‌ను తెలియజేశారు.

కరిష్మా తన్నా, బిజినెస్‌మ్యాన్ వరుణ్ బంగేరా 2021లో ప్రేమలో పడ్డారు. ఏడాది పాటు డేటింగ్‌లో ఉన్న ఈ జంట.. 2022 ముంబైలో చాలా గ్రాండ్‌గా పెళ్లి చేసుకున్నారు. హల్దీ, మెహందీ వేడుకలతో పాటు గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించి సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు.

ఈ ఏడాది ఏప్రిల్‌లో కరిష్మా తాను గర్భవతిననే విషయాన్ని ఫ్యాన్స్‌తో పంచుకున్నారు. మే నెలలో తన భర్త కుటుంబ సాంప్రదాయం ప్రకారం తుళు శైలిలో చాలా డిఫరెంట్‌గా సీమంతం వేడుక జరుపుకున్నారు. ఆ ఫోటోలు, వీడియోలు కూడా నెట్టింట విపరీతంగా ట్రెండ్ అయ్యాయి. "మా హృదయాలు ఆనందంతో నిండిపోయాయి" అని ఆ సమయంలో కరిష్మా ఆనందం వ్యక్తం చేశారు.

'స్కూప్' వెబ్ సిరీస్‌తో నేషనల్ వైడ్ క్రేజ్

టీవీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న కరిష్మా తన్నా.. ఆ తర్వాత ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లపై కూడా తన మార్క్ చూపించారు. ప్రముఖ దర్శకుడు హన్సల్ మెహతా తెరకెక్కించిన 'స్కూప్' (Scoop) వెబ్ సిరీస్‌లో జర్నలిస్ట్ జాగృతి పాఠక్ పాత్రలో నటించి దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నారు. ఈ నెట్‌ఫ్లిక్స్ సిరీస్ ద్వారా ఆమె నటనకు మైండ్ బ్లాకింగ్ రెస్పాన్స్ వచ్చింది.

దీనికి తోడు 2024లో అనన్య పాండే నటించిన 'కాల్ మీ బే' సిరీస్‌లో స్పెషల్ కేమియో రోల్‌లో మెరిసారు. గతంలో 'లాహోర్ కాన్ఫిడెన్షియల్' సినిమాతో పాటు పలు పాపులర్ రియాలిటీ షోలలో మెరిసిన కరిష్మా, ఇప్పుడు మదర్‌హుడ్ ఎంజాయ్ చేసేందుకు కొన్ని రోజులు షూటింగ్‌లకు విరామం ఇవ్వనున్నారు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks