ప్రముఖ నటి ఖుషీ ముఖర్జీ చిక్కుల్లో పడింది. టీమిండియా స్టార్ క్రికెటర్, టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌పై ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు ఆమె మెడకు చుట్టుకున్నాయి. ఈ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఫైజాన్ అన్సారీ.. జనవరి 13న ఆమెపై రూ. 100 కోట్ల పరువు నష్టం దావా వేశాడు.
అసలేం జరిగింది?

ఇటీవల ఒక పబ్లిక్ ఈవెంట్‌లో ఖుషీ ముఖర్జీ మాట్లాడుతూ.. "చాలా మంది క్రికెటర్లు నా వెంట పడ్డారు. సూర్యకుమార్ యాదవ్ కూడా నాకు గతంలో చాలా మెసేజ్‌లు చేసేవాడు. ఇప్పుడు మేం పెద్దగా మాట్లాడుకోవడం లేదు. నాకు ఎవరితోనూ లింక్ అప్స్ వద్దు" అని కామెంట్ చేసింది.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సూర్యకుమార్ అభిమానులు మండిపడ్డారు. జాతీయ స్థాయి క్రీడాకారుడిపై ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేయడం సరికాదని విమర్శించారు.
రూ. 100 కోట్ల దావా.. ఏడేళ్ల జైలు శిక్ష కావాలి
ఈ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న ఫైజాన్ అన్సారీ.. ముంబై నుంచి యూపీలోని ఘాజీపూర్‌కు వెళ్లి మరీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఖుషీ ముఖర్జీ కేవలం పబ్లిసిటీ కోసమే ఇలాంటి అబద్ధాలు చెబుతోందని, దీనివల్ల దేశం గర్వించదగ్గ క్రీడాకారుడి పరువు పోతోందని ఆయన ఆరోపించారు.
ఆమెపై తక్షణం ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేయాలని, ఆరోపణలు రుజువైతే కనీసం ఏడేళ్ల జైలు శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. ఆమె సరైన ఆధారాలు చూపిస్తే బహిరంగ క్షమాపణ చెబుతానని, లేదంటే ఆమెపై చర్యలు తీసుకునే వరకు ఘాజీపూర్‌లోనే ఉంటానని భీష్మించుకు కూర్చున్నారు.
నా మాటలను వక్రీకరించారు: ఖుషీ
వివాదం ముదరడంతో ఖుషీ ముఖర్జీ వివరణ ఇచ్చింది. తన మాటలను సోషల్ మీడియాలో వక్రీకరించారని, తాను సూర్యకుమార్‌తో కేవలం స్నేహితురాలిగా మాత్రమే మాట్లాడానని చెప్పింది. "గతంలో ఒక మ్యాచ్ ఓడిపోయినప్పుడు స్నేహితుడిగా మాత్రమే మాట్లాడాను. మా మధ్య ఎలాంటి ప్రేమ వ్యవహారం లేదు. నా సోషల్ మీడియా ఖాతా హ్యాక్ అయ్యింది" అని ఆమె సమర్థించుకునే ప్రయత్నం చేసింది.
సూర్యకుమార్ మౌనం..
{{/usCountry}}వివాదం ముదరడంతో ఖుషీ ముఖర్జీ వివరణ ఇచ్చింది. తన మాటలను సోషల్ మీడియాలో వక్రీకరించారని, తాను సూర్యకుమార్‌తో కేవలం స్నేహితురాలిగా మాత్రమే మాట్లాడానని చెప్పింది. "గతంలో ఒక మ్యాచ్ ఓడిపోయినప్పుడు స్నేహితుడిగా మాత్రమే మాట్లాడాను. మా మధ్య ఎలాంటి ప్రేమ వ్యవహారం లేదు. నా సోషల్ మీడియా ఖాతా హ్యాక్ అయ్యింది" అని ఆమె సమర్థించుకునే ప్రయత్నం చేసింది.
సూర్యకుమార్ మౌనం..
{{/usCountry}}ఈ మొత్తం వ్యవహారంపై సూర్యకుమార్ యాదవ్ ఇప్పటివరకు స్పందించలేదు. అయితే ఫైజాన్ అన్సారీ వేసిన ఈ భారీ దావా ఇప్పుడు బాలీవుడ్, క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.