...
...
Next Story

Nivetha Pethuraj: సినిమాలు మానేయాలని అనుకున్నా.. తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా.. హీరోయిన్ నివేదా పేతురాజ్ ఓపెన్ కామెంట్స్

Nivetha Pethuraj: సినీ కెరీర్, వ్యక్తిగత జీవితంపై నటి నివేదా పేతురాజ్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఒకానొక దశలో సినిమాలు వదిలేయాలని భావించానని, ఆ తర్వాత కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకున్నానని ఓపెన్ కామెంట్స్ చేసింది. మరి ఆమె అలా చెప్పడం వెనుక ఉన్న కారణాలేంటో చూసేయండి.

Published on: Jun 15, 2026, 05:46:08 IST
Advertisement

Nivetha Pethuraj: టాలీవుడ్‌లో తనదైన నటన, అందంతో గుర్తింపు తెచ్చుకున్న నటి నివేదా పేతురాజ్ తన సినీ కెరీర్‌కు సంబంధించి సంచలన విషయాలు వెల్లడించింది. ఒక దశలో సినిమాలు మానేద్దామని డిసైడ్ అయినట్లు పేర్కొంది. సింగ్ గీతం మూవీతో రీ ఎంట్రీపై ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేసింది.

నివేదా పేతురాజ్ కామెంట్లు

సినిమాలు మానేయాలని అనుకున్నా.. తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా.. హీరోయిన్ నివేదా పేతురాజ్ ఓపెన్ కామెంట్స్ (x/Nivetha_Tweets)
సినిమాలు మానేయాలని అనుకున్నా.. తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా.. హీరోయిన్ నివేదా పేతురాజ్ ఓపెన్ కామెంట్స్ (x/Nivetha_Tweets)

గ్లామర్ పాత్రలతో పాటు నటనకు ప్రాధాన్యమున్న క్యారెక్టర్లు చేస్తూ ప్రేక్షకులకు దగ్గరైంది బ్యూటీఫుల్ హీరోయిన్ నివేదా పేతురాజ్. అయితే గతంలో తాను ఎదుర్కొన్న మానసిక సంఘర్షణను, తీసుకున్న కొన్ని నిర్ణయాలను తాజాగా ఆమె బయటపెట్టింది.

​ఒకానొక దశలో చిత్ర పరిశ్రమకు పూర్తిగా గుడ్‌బై చెప్పాలని భావించినట్లు నివేదా సంచలన ప్రకటన చేసింది. ఆ సమయంలో మానసికంగా ఎలాంటి గందరగోళానికి గురైంది, ఆ తర్వాత ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంది అనే విషయాలను ఆమె చాలా ఓపెన్‌గా మాట్లాడింది.

​సినిమాలకు దూరం కావాలని

​"2023 సంవత్సరంలో నేను ఒక కీలక నిర్ణయం తీసుకున్నాను. ఇకపై సినిమాలు పూర్తిగా మానేయాలని, ఇండస్ట్రీకి దూరం కావాలని డిసైడ్ అయ్యాను" అని నివేదా పేతురాజ్ ఆనాటి పరిస్థితులను గుర్తుచేసుకుంది.

​తప్పుడు నిర్ణయాలు

​పరిశ్రమను వదిలి వెళ్లాలనే ఆలోచనతో పాటు ఆ సమయంలో కొన్ని పొరపాట్లు కూడా చేశానని ఈ ముద్దుగుమ్మ నివేదా పేతురాజ్ అంగీకరించింది. సింగ్ గీతం మూవీతో మంచి ఛాన్స్ దొరికిందని చెప్పుకొచ్చింది.

​"సినిమాలు వదిలేయాలనే ఆలోచనల నుంచి బయటకు వచ్చి, ఫైనల్‌గా 'సింగ్ గీతం' సినిమాతో మళ్లీ రీఎంట్రీ ఇవ్వడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది. నాగ్ అశ్విన్ నాకు ఈ అవకాశం ఇవ్వకపోతే ఇప్పుడు హిమాలయాల్లో ఉండేదాన్ని" అని నివేదా పేతురాజ్ పేర్కొంది.

పెళ్లి క్యాన్సిల్

నిజానికి నివేదా పేతురాజ్ తన పెళ్లి క్యాన్సిల్ గురించే తప్పుడు నిర్ణయమంటూ పరోక్షంగా ప్రస్తావించిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ భామ దుబాయ్ కు చెందిన రజిత్ ఇబ్రాన్ అనే బిజినెస్ మ్యాన్ ను లవ్ చేసింది. ఈ ఇద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు. కానీ ఆ తర్వాత విడిపోయారు. ఆ డిప్రెషన్ నుంచి బయటకొచ్చిన నివేదా ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తోంది.

సింగ్ గీతం మూవీలో అదరగొట్టిన నివేదా పేతురాజ్ ఇప్పుడు వెంకటేష్, చిరంజీవి సినిమాల్లో నటిస్తోంది. త్రివిక్రమ్-వెంకటేష్ కాంబినేషన్లో వస్తున్న ‘ఆదర్శ కుటుంబం’తో పాటు చిరు-బాబీ మూవీలోనూ కీ రోల్స్ ప్లే చేస్తోంది నివేదా పేతురాజ్.

People Also Ask- ​తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)

​ప్రశ్న: నటి నివేదా పేతురాజ్ 2023లో ఎలాంటి నిర్ణయం తీసుకుంది?

జవాబు: 2023 సంవత్సరంలో సినిమాలు పూర్తిగా మానేయాలని, యాక్టింగ్ కెరీర్‌కు ముగింపు పలకాలని నివేదా పేతురాజ్ నిర్ణయించుకుంది?

​ప్రశ్న: నివేదా పేతురాజ్ రీఎంట్రీ ఇచ్చిన సినిమా పేరేంటి?

జవాబు: కొన్ని తప్పుడు నిర్ణయాల వల్ల బ్రేక్ తీసుకున్న నివేదా.. 'సింగ్ గీతం' అనే సరికొత్త చిత్రంతో మళ్లీ వెండితెరపైకి రీఎంట్రీ ఇచ్చింది.

​ప్రశ్న: తన కెరీర్ పొరపాట్లపై నివేదా ఏమని స్పందించింది?

జవాబు: సినిమాలు మానేయాలనుకున్న సమయంలో తాను కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకున్నానని, అయితే ఇప్పుడు 'సింగ్ గీతం' సినిమాతో తిరిగి రావడం చాలా ఆనందంగా ఉందని ఆమె పేర్కొంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks