Sing Geetham Twitter Review: సింగ్ గీతం ట్విటర్ రివ్యూ-మాస్టర్ పీస్-94 ఏళ్ల వయసులో ఆ మేకింగ్ ఏంటీ? సర్ ప్రైజ్ క్యామియో
Sing Geetham Twitter Review: సినిమాలతో ప్రయోగాలు చేసే లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు 94 ఏళ్ల వయసులో మరో ప్రయోగం చేశారు. సింగ్ గీతం అంటూ డైలాగ్ లే పాటలుగా సాగే మూవీని తీసుకొచ్చారు. మరి ఈ సినిమా ట్విటర్ రివ్యూ ఎలా ఉందో ఇక్కడ చూసేయండి.
Sing Geetham Twitter Review: కొన్ని సినిమాలు కళ్లకు నచ్చుతాయి. కొన్ని మాత్రం మనసుకు నచ్చుతాయి. ఇంకొన్ని అయితే మనతో పాటే థియేటర్ బయటకు వచ్చేస్తాయి. ఇవాళ రిలీజైన ‘సింగ్ గీతం’ మూవీ కూడా మనతో పాటే ట్రావెల్ చేసే సినిమా అనే కామెంట్లు వస్తున్నాయి. 94 ఏళ్ల వయసులో సింగీతం శ్రీనివాస రావు తీసిన మాస్టర్ పీస్ ఇదని నెటిజన్లు ఎక్స్ లో రాసుకొస్తున్నారు.

సింగ్ గీతం ట్విటర్ రివ్యూ
డిఫరెంట్ పేరుతోనే, తన నేమ్ తోనే మూవీ అర్థం వచ్చేలా సింగీతం శ్రీనివాసరావు తీసిన మూవీ ‘సింగ్ గీతం’. ఈ చిత్రం జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. పాపులర్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ మూవీ కోసం ప్రొడ్యూసర్ గా మారాడు. దీనికి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు. ఈ చిత్రానికి సోషల్ మీడియాలో పాజిటివ్ టాక్ వినిపిస్తోంది.
మాస్టర్ పీస్
‘సింగ్ గీతం’ మూవీని మాస్టర్ పీస్ అంటూ నెటిజన్లు పొగిడేస్తున్నారు. ‘‘94 ఏళ్ల వయసులో ఈ వ్యక్తి (సింగీతం శ్రీనివాసరావు) ఓ మాస్టర్ పీస్ ను డైరెక్ట్ చేశారు. సినిమా పట్ల ఆయనకున్న ప్రేమ, తపన అద్భుతం. వెంటనే థియేటర్లకు వెళ్లండి, లేదంటే అద్భుతాన్ని మిస్ అవుతారు’’ అని ఓ యూజర్ రాసుకొచ్చాడు.
పిల్లలను తీసుకెళ్లాలి
‘‘సింగ్ గీతం ఓ మంచి సినిమా. పిల్లలు కచ్చితంగా తమ పిల్లలను ఈ మూవీకి తీసుకెళ్లాలి. ఈ చిత్రాన్ని కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. సింగీతం శ్రీనివాసరావు సార్ ఓ లెజెండ్. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఈ సినిమాకు సోల్ గా నిలిచింది’’ అని ఒక నెటిజన్ తన రివ్యూ పంచుకున్నాడు.
ఏడవకుండా ఉండలేరంటూ
క్లైమాక్స్ సాగ్ కు మనిషి అన్నవాడు ఏడవకుండా ఉండడు. మళ్లీ వింటేజ్ డేస్ గుర్తు చేశావ్ దేవి శ్రీ ప్రసాద్ అన్న. ఈ ఇయర్ అన్ని అవార్డులు నీకే. నువ్వే మా జనరేషన్ కు గోట్ వి’’ అని సింగ్ గీతం మూవీకి మ్యూజిక్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ పై ఓ ఫ్యాన్ ప్రశంసలు కురిపించాడు.
రిటర్న్ ఆఫ్ లెజెండ్
‘‘94 ఏళ్ల యువ, దిగ్గజ డైరెక్టర్ సింగీతం శ్రీనివాస రావు ఎట్టకేలకు తన 40 ఏళ్ల కలల ప్రాజెక్ట్ కు ప్రాణం పోశారు. మిస్టీరియస్ విలేజ్ కుబేర పురం చుట్టూ సాగే కథ ఇది. ఓ మైనింగ్ ఓనర్ దురాశకు గ్రామస్థులు ఎదుర్కునే విచిత్ర పరిస్థితులే ఈ సినిమా. మూవీ చాలా బాగుంంది. దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. కొత్త నటీనటులు బాగా చేశారు’’ అని ఒక నెటిజన్ తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు.
సర్ ప్రైజ్ క్యామియో
సింగ్ గీతం సినిమాలో ఓ సర్ ప్రైజ్ క్యామియో ఉందని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఓ స్పెషల్ క్యారెక్టర్ లో కనిపిస్తాడని చెప్తున్నారు. నాగ్ అశ్విన్ కు విజయ్ దేవరకొండ లక్కీ ఛార్మ్ అని అంటున్నారు. నాగ్ అశ్విన్ తీసిన మహానటి, కల్కిలో విజయ్ దేవరకొండ నటించిన సంగతి తెలిసిందే.
People Also Ask (FAQ)
సింగ్ గీతం మూవీ ఎప్పుడు రిలీజైంది?
సింగ్ గీతం సినిమా జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజైంది.
సింగ్ గీతం సినిమాకు డైరెక్టర్ ఎవరు?
సింగ్ గీతం మూవీకి 94 ఏళ్ల దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాస్ రావు డైరెక్టర్.
సింగ్ గీతం మూవీని పిల్లలతో చూడొచ్చా?
అవును, సింగ్ గీతం సనిమాను పిల్లలతో చూడొచ్చు. ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేసే క్లీన్ మూవీ ఇది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


