Nora Fatehi: ఐటమ్ భామ నోరా ఫతేహికి రూ. 3 కోట్ల పరువు నష్టం దావా.. అలా వీడియోలు తీసినందుకు కోర్టులో కేసు!
Nora Fatehi 3 Crore Defamation Case: బాలీవుడ్ నటి, తెలుగు ఐటమ్ భామ నోరా ఫతేహికి న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యాయి. డ్యూన్స్ ఏవియేషన్ సంస్థకు చెందిన విమానంలో నోరా ఫతేహి తీసిన వీడియోలు దుమారం సృష్టించాయి. దీన్ని సవాలు చేస్తూ గాంధీనగర్ కోర్టుకెక్కిన సంస్థ నోరాకు రూ. 3 కోట్ల పరువు నష్టం దావా వేసింది.
Nora Fatehi 3 Crore Defamation Case: బాలీవుడ్ నటి, ప్రముఖ డ్యాన్సర్ నోరా ఫతేహికి ఊహించని న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యాయి. ఒక చార్టర్డ్ విమానాన్ని ఉద్దేశించి సోషల్ మీడియాలో ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర వివాదానికి దారితీశాయి. సదరు ఏవియేషన్ సంస్థ ప్రతిష్టను దెబ్బతీశారనే ఆరోపణలతో గుజరాత్‌లోని గాంధీనగర్ కోర్టులో నోరాపై రూ. 3 కోట్ల మాననష్ట దావా దాఖలైంది.

ముంబై నుంచి జైపూర్‌కు ప్రయాణం
గత డిసెంబరులో ముంబై నుంచి జైపూర్ ప్రయాణిస్తున్న సమయంలో డ్యూన్స్ ఏవియేషన్‌కు చెందిన సెస్నా సైటేషన్ CJ2 చార్టర్డ్ విమానంలో నోరా ఫతేహి ప్రయాణించారు. ఆ సమయంలో విమానం లోపల వీడియోలు తీసి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు.
లెగో ఏరోప్లేన్, డాల్ ఎరోప్లేన్
ఆ వీడియోల్లో విమానాన్ని "చిన్న బొమ్మ", "లెగో ఏరోప్లేన్", "టాయ్ ప్లేన్" అంటూ నోరా ఫతేహి వర్ణించారు. రూ. 4.6 కోట్లకు పైగా ఫాలోవర్లు ఉన్న ఆమె ఖాతాలో ఈ వీడియోలు వైరల్ కావడంతో కంపెనీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
కంపెనీ వ్యాపారానికి భారీ గండి!
బాధ్యతారాహిత్యంగా చేసిన ఈ కామెంట్స్ వల్ల తమ సంస్థ నమ్మకం, మార్కెట్ విలువ తీవ్రంగా దెబ్బతిన్నాయని డ్యూన్స్ ఏవియేషన్ కోర్టును ఆశ్రయించింది. విమానాల భద్రత, సాంకేతిక విషయాలపై ఎలాంటి పరిజ్ఞానం లేకుండా, నిజానిజాలు సరిచూసుకోకుండా నోరా ఈ వ్యాఖ్యలు చేశారని పిటిషన్‌లో పేర్కొంది.
15 నుంచి 20 శాతం తగ్గిన బుకింగ్స్
ఈ వీడియోల కారణంగా తమ బుకింగ్స్ 15 నుంచి 20 శాతం వరకు పడిపోయాయని, అనేక మంది ప్రయాణికులు ప్రయాణాలను రద్దు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. తమ విమానం పూర్తి సురక్షితమైనదని డ్యూన్స్ ఏవియేషన్ స్పష్టం చేసింది.
అన్ని అనుమతులు ఉన్నాయి!
"మా విమానానికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) పూర్తి గుర్తింపు ఉంది. చెల్లుబాటు అయ్యే నాన్-షెడ్యూల్డ్ ఆపరేటర్స్ పర్మిట్ (NSOP) ద్వారా చట్టబద్ధంగానే సేవలు అందిస్తున్నాం" అని కంపెనీ కోర్టుకు తెలిపింది.
పరిహారంతో పాటు పబ్లిక్ క్లారిఫికేషన్!
కేవలం రూ. 3 కోట్ల నష్టపరిహారం కోరడమే కాకుండా, సోషల్ మీడియా వేదికల నుంచి ఆ వీడియోలను వెంటనే తొలగించాలని కంపెనీ డిమాండ్ చేసింది. దీనిపై నోరా ఫతేహి బహిరంగంగా వివరణ ఇవ్వాలని కూడా కోరింది. ఈ ఏడాది ఏప్రిల్‌లోనే పిటిషన్ దాఖలు కాగా, గాంధీనగర్‌లోని సీనియర్ సివిల్ జడ్జి ఆర్. అగర్వాల్ ధర్మాసనం సెప్టెంబర్ 25న ఈ వ్యవహారంపై విచారణ జరపనుంది.
తెలుగులో ఐటమ్ భామగా నోరా ఫతేహి
ఇదిలా ఉంటే, నోరా ఫతేహి తెలుగులో కూడా మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. కిక్ 2 (టైటిల్ సాంగ్), టెంపర్ (ఇట్టాగే రెచ్చిపోదాం సాంగ్), బాహుబలి (మనోహరి సాంగ్) సినిమాల్లో ఐటమ్ సాంగ్స్‌తో నోరా ఫతేహి రాణించారు.
నోరా ఫతేహి సర్కే చునార్ సాంగ్ వివాదం
ఉఫ్ యే సియాప్పా, స్ట్రీట్ డ్యాన్సర్ త్రీడీ, రోర్ వంటి సినిమాల్లోనూ నోరా ఆకట్టుకున్నారు. కన్నడ యాక్షన్ థ్రిల్లర్ కేడీ ది డెవిల్‌లో నోరా ఫతేహి నర్తించిన సర్కే చునార్ సాంగ్ పెద్ద వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


