మలయాళ నటి పార్వతి తిరువోతు తెలుసు కదా. ఆ ఇండస్ట్రీకే పరిమితం కాకుండా తన సహజమైన నటనతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటి ఆము. తెరపై ఎంత సీరియస్‌గా కనిపిస్తుందో బయట కూడా విషయాలను అంతే సూటిగా, కుండబద్దలు కొట్టినట్లు చెబుతుంది. తాజాగా ‘ది మేల్ ఫెమినిస్ట్’ (The Male Feminist) అనే కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. చిన్నతనంలో తాను ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి వివరిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది.
పుట్టడమే ఆలస్యం.. దాడులు మొదలవుతాయి!

ఆనాటి చేదు జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ పార్వతి తిరువోతు తీవ్ర భావోద్వేగానికి లోనయింది. "మనం పుట్టడమే ఆలస్యం.. మనపై దాడులు మొదలవుతాయి. ఆటో ఎక్కుతుంటే ఎవరో గిల్లేవారు. ఒకసారి రైల్వే స్టేషన్‌లో అమ్మను వదిలి, నాన్న వైపు నడుచుకుంటూ వెళ్తున్నాను. ఇంతలో ఎవరో ఒక వ్యక్తి వచ్చి నా ఛాతీపై బలంగా కొట్టి పారిపోయాడు. అది ఏదో పొరపాటున తాకడం కాదు.. ఉద్దేశపూర్వకంగా గట్టిగా కొట్టడం. అప్పుడు నేను చిన్న పిల్లను. ఆ నొప్పి నాకు ఇంకా గుర్తుంది" అని పార్వతి తన ఆవేదనను చెప్పింది.
అమ్మ ఏం నేర్పించిందంటే..
రోడ్డుపై ఎలా నడవాలనే విషయం గురించి తన తల్లి ఇచ్చిన సలహాలను ఆమె ప్రస్తావించింది. "రోడ్డుపై వెళ్లేటప్పుడు షాపుల వైపు చూడొద్దు.. ఎదురుగా వస్తున్న మగవాళ్ల చేతుల వైపు చూస్తూ జాగ్రత్తగా నడవమని మా అమ్మ నాకు నేర్పించేది. ఒక తల్లి తన కూతురికి ఇలాంటి విషయాలు నేర్పించాల్సి రావడం ఎంత దారుణమో ఊహించండి" అని ఆమె తెలిపింది.
అలాగే చాలాసార్లు మగవాళ్లు లుంగీ ఎత్తి తమ ప్రైవేట్ పార్ట్స్ చూపించడం (ఫ్లాషింగ్) వంటి అసభ్యకరమైన చర్యలను తాను చూశానని చెప్పింది. "ఆ వయసులో వాళ్లు ఏం చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో అర్థమయ్యేది కాదు. కానీ ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే.. ఆ అనుభవాల ప్రభావం మన శరీరంపై, మనసుపై ఎంత బలంగా పడిందో అర్థమవుతుంది" అని ఆమె వాపోయింది.
పార్వతి కెరీర్ ఇలా..
‘టేక్ ఆఫ్’, ‘చార్లీ’, ‘బెంగళూరు డేస్’ వంటి సినిమాలతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న పార్వతి.. త్వరలో హృతిక్ రోషన్ నిర్మాణంలో రాబోతున్న ‘ది స్టార్మ్’ (The Storm) అనే వెబ్ సిరీస్‌లో కనిపించనుంది. ప్రైమ్ వీడియో కోసం అజిత్‌పాల్ సింగ్ రూపొందిస్తున్న ఈ వెబ్ సిరీస్ ముంబై నేపథ్యంలో సాగే ఒక ఉత్కంఠ రేపే థ్రిల్లర్ డ్రామా.
{{/usCountry}}‘టేక్ ఆఫ్’, ‘చార్లీ’, ‘బెంగళూరు డేస్’ వంటి సినిమాలతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న పార్వతి.. త్వరలో హృతిక్ రోషన్ నిర్మాణంలో రాబోతున్న ‘ది స్టార్మ్’ (The Storm) అనే వెబ్ సిరీస్‌లో కనిపించనుంది. ప్రైమ్ వీడియో కోసం అజిత్‌పాల్ సింగ్ రూపొందిస్తున్న ఈ వెబ్ సిరీస్ ముంబై నేపథ్యంలో సాగే ఒక ఉత్కంఠ రేపే థ్రిల్లర్ డ్రామా.
{{/usCountry}}