ఒకడు నా ఛాతీపై గుద్ది వెళ్లిపోయాడు.. మరొకడు లుంగీ పైకెత్తి అలా..: నటి షాకింగ్ కామెంట్స్

నటి పార్వతి తిరువోతు తాను చిన్నతనంలో ఎదుర్కొన్న వేధింపుల ఘటనలపై షాకింగ్ కామెంట్స్ చేసింది. అసలు ఆ సమయంలో ఏం జరుగుతుందో కూడా తనకు తెలిసేది కాదని చెప్పింది. ది మేల్ ఫెమినిస్ట్ అనే షో తాజా ఎపిసోడ్ లో ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Published on: Jan 11, 2026, 07:26:23 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మలయాళ నటి పార్వతి తిరువోతు తెలుసు కదా. ఆ ఇండస్ట్రీకే పరిమితం కాకుండా తన సహజమైన నటనతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటి ఆము. తెరపై ఎంత సీరియస్‌గా కనిపిస్తుందో బయట కూడా విషయాలను అంతే సూటిగా, కుండబద్దలు కొట్టినట్లు చెబుతుంది. తాజాగా ‘ది మేల్ ఫెమినిస్ట్’ (The Male Feminist) అనే కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. చిన్నతనంలో తాను ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి వివరిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది.

ఒకడు నా ఛాతీపై గుద్ది వెళ్లిపోయాడు.. మరొకడు లుంగీ పైకెత్తి అలా..: నటి షాకింగ్ కామెంట్స్
ఒకడు నా ఛాతీపై గుద్ది వెళ్లిపోయాడు.. మరొకడు లుంగీ పైకెత్తి అలా..: నటి షాకింగ్ కామెంట్స్

పుట్టడమే ఆలస్యం.. దాడులు మొదలవుతాయి!

ఆనాటి చేదు జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ పార్వతి తిరువోతు తీవ్ర భావోద్వేగానికి లోనయింది. "మనం పుట్టడమే ఆలస్యం.. మనపై దాడులు మొదలవుతాయి. ఆటో ఎక్కుతుంటే ఎవరో గిల్లేవారు. ఒకసారి రైల్వే స్టేషన్‌లో అమ్మను వదిలి, నాన్న వైపు నడుచుకుంటూ వెళ్తున్నాను. ఇంతలో ఎవరో ఒక వ్యక్తి వచ్చి నా ఛాతీపై బలంగా కొట్టి పారిపోయాడు. అది ఏదో పొరపాటున తాకడం కాదు.. ఉద్దేశపూర్వకంగా గట్టిగా కొట్టడం. అప్పుడు నేను చిన్న పిల్లను. ఆ నొప్పి నాకు ఇంకా గుర్తుంది" అని పార్వతి తన ఆవేదనను చెప్పింది.

అమ్మ ఏం నేర్పించిందంటే..

రోడ్డుపై ఎలా నడవాలనే విషయం గురించి తన తల్లి ఇచ్చిన సలహాలను ఆమె ప్రస్తావించింది. "రోడ్డుపై వెళ్లేటప్పుడు షాపుల వైపు చూడొద్దు.. ఎదురుగా వస్తున్న మగవాళ్ల చేతుల వైపు చూస్తూ జాగ్రత్తగా నడవమని మా అమ్మ నాకు నేర్పించేది. ఒక తల్లి తన కూతురికి ఇలాంటి విషయాలు నేర్పించాల్సి రావడం ఎంత దారుణమో ఊహించండి" అని ఆమె తెలిపింది.

అలాగే చాలాసార్లు మగవాళ్లు లుంగీ ఎత్తి తమ ప్రైవేట్ పార్ట్స్ చూపించడం (ఫ్లాషింగ్) వంటి అసభ్యకరమైన చర్యలను తాను చూశానని చెప్పింది. "ఆ వయసులో వాళ్లు ఏం చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో అర్థమయ్యేది కాదు. కానీ ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే.. ఆ అనుభవాల ప్రభావం మన శరీరంపై, మనసుపై ఎంత బలంగా పడిందో అర్థమవుతుంది" అని ఆమె వాపోయింది.

పార్వతి కెరీర్ ఇలా..

‘టేక్ ఆఫ్’, ‘చార్లీ’, ‘బెంగళూరు డేస్’ వంటి సినిమాలతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న పార్వతి.. త్వరలో హృతిక్ రోషన్ నిర్మాణంలో రాబోతున్న ‘ది స్టార్మ్’ (The Storm) అనే వెబ్ సిరీస్‌లో కనిపించనుంది. ప్రైమ్ వీడియో కోసం అజిత్‌పాల్ సింగ్ రూపొందిస్తున్న ఈ వెబ్ సిరీస్ ముంబై నేపథ్యంలో సాగే ఒక ఉత్కంఠ రేపే థ్రిల్లర్ డ్రామా.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More