అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చిన ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్ వెబ్ సిరీస్ లో నటించిన సయానీ గుప్తా తెలుసు కదా. అందులో ఆమె చాలా బోల్డ్ సీన్స్ లో నటించింది. నిజానికి చిన్నప్పటి నుంచే నటి కావాలనే కోరిక సయానీ గుప్తాకు చాలా బలంగా ఉండేదట. ఆ కల నెరవేర్చుకోవడానికి ఆమె చిన్న వయసులోనే తనకు మంచి జీతం ఇస్తున్న కార్పొరేట్ జాబ్ వదులుకోవాల్సి వచ్చింది.

కానీ ఈ నిర్ణయం ఆమె తల్లికి ఏమాత్రం నచ్చలేదట. ఇటీవల 'సైరస్ సేస్' అనే కార్యక్రమంలో పాల్గొన్న సయానీ.. నటనలో శిక్షణ కోసం పూణేలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్ స్టిట్యూట్ (FTII)లో చేరినప్పుడు.. తన తల్లి ఏకంగా నెల రోజుల పాటు తనతో మాట్లాడలేదని గుర్తు చేసుకుంది.
ఆ రోజు ఏం జరిగిందంటే?
ఆ ఇంటర్వ్యూలో సయానీ గుప్తా నటిగా తన తొలినాళ్ల గురించి మాట్లాడింది. "నేను ఎఫ్‌టీఐఐలో చేరాలని నిర్ణయించుకున్నప్పుడు మా అమ్మ చాలా సీరియస్ అయ్యారు. 'నువ్వు అక్కడికి వెళ్తే నేను నా మణికట్టు కోసుకుంటాను' అని బెదిరించారు. ఆమె నా నిర్ణయాన్ని అసలు నమ్మలేకపోయారు. ఆ సమయంలో నేను చేస్తున్న ఉద్యోగంలో నాకు విపరీతమైన విసుగు వచ్చేది. నేను పని పట్ల అంకితభావంతో ఉండేదాన్ని కాబట్టి అక్కడ చాలా డబ్బులు సంపాదించాను. కానీ నా జీవితం ఇలా ఉండాలని నేను కోరుకోలేదు" అని వివరించింది.
హీరోయిన్లు అంటే చులకన..
తన చిన్నతనం గురించి సయానీ వివరిస్తూ.. "నేను పెరిగేటప్పుడు కూడా మా అమ్మ నన్ను స్టేజ్ షోలలో నటించడానికి రిహార్సల్స్‌కు వెళ్లనిచ్చే వారు కాదు. నన్ను గదిలో పెట్టి తాళం వేసేవారు. హీరోయిన్లు అంటే వేశ్యలు అనే అభిప్రాయం ఆమెకు ఉండేది. నటన వృత్తిపై ఆమెకు అంత చులకన భావం ఉండేది" అని చెప్పింది. ఎఫ్‌టీఐఐలో సీటు వచ్చిన విషయాన్ని తల్లికి చెప్పకుండా దాచడానికి చాలా ప్రయత్నించానని, కానీ తాను క్యాంపస్‌కు చేరుకున్న రెండు నిమిషాల్లోనే ఆమెకు ఆ విషయం తెలిసిపోయిందని సయానీ తెలిపింది.
చివరకు అమ్మే నటిగా మారి..
అయితే అక్కడ ఒక ఆసక్తికరమైన మలుపు తిరిగింది. సయానీ క్యాంపస్‌లో ఉన్నప్పుడు, అక్కడ విద్యార్థులు తీస్తున్న డిప్లొమా సినిమాల్లో నటించే అవకాశం ఆమె తల్లికి వచ్చింది. వచ్చిన ఐదు అవకాశాల్లో ఆమె మూడింటిని అంగీకరించింది. ఆ తర్వాత సయానీతో మాట్లాడుతూ.. "నువ్వు రాబోయే రెండేళ్లు ఇదే పని చేయాల్సి వస్తే చేసెయ్.. ఇది అంత చెడ్డదేమీ కాకపోవచ్చు" అని అన్నారట.
సయానీ కెరీర్ ఇలా..
{{/usCountry}}అయితే అక్కడ ఒక ఆసక్తికరమైన మలుపు తిరిగింది. సయానీ క్యాంపస్‌లో ఉన్నప్పుడు, అక్కడ విద్యార్థులు తీస్తున్న డిప్లొమా సినిమాల్లో నటించే అవకాశం ఆమె తల్లికి వచ్చింది. వచ్చిన ఐదు అవకాశాల్లో ఆమె మూడింటిని అంగీకరించింది. ఆ తర్వాత సయానీతో మాట్లాడుతూ.. "నువ్వు రాబోయే రెండేళ్లు ఇదే పని చేయాల్సి వస్తే చేసెయ్.. ఇది అంత చెడ్డదేమీ కాకపోవచ్చు" అని అన్నారట.
సయానీ కెరీర్ ఇలా..
{{/usCountry}}సయానీ గుప్తా 2012లో 'సెకండ్ మ్యారేజ్ డాట్ కామ్' అనే సినిమాతో హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టింది. 2015లో వచ్చిన 'మార్జరిటా విత్ ఎ స్ట్రా' సినిమాలో ఆమె పోషించిన సహాయ పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత 'ఫ్యాన్', 'జాలీ ఎల్‌ఎల్‌బి 2', 'ఆర్టికల్ 15' వంటి చిత్రాల్లో నటించింది. చివరగా ఆమె 'ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్' నాలుగో సీజన్‌లో కనిపించింది. ఈ సిరీస్ డిసెంబర్ 19, 2025న ప్రైమ్ వీడియోలో విడుదలైంది.