Tabu King 100: అక్కినేని నాగార్జున, టబు కాంబినేషన్‌కు టాలీవుడ్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 'నిన్నే పెళ్లాడతా', 'ఆవిడా మా ఆవిడే' వంటి ఆల్‌టైమ్ క్లాసిక్స్ తర్వాత వీరిద్దరూ మళ్లీ వెండితెరపై కలిసి కనిపించలేదు. దాదాపు 28 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న 100వ చిత్రం 'కింగ్ 100' (King 100)లో టబు కీలక పాత్ర పోషిస్తున్నారు.
ఈసారి యుద్ధమే: టబు

అయితే ఈసారి ప్రేమికులుగా కాకుండా, ఇద్దరి మధ్య ఒక రకమైన 'యుద్ధం' (WAR) జరగబోతోందని టబు స్వయంగా ప్రకటించి షాక్ ఇచ్చారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆమె.. “చాలా కాలం తర్వాత మళ్లీ కింగ్‌తో కలిసి వస్తున్నాను.. అయితే ఈసారి ఇది ప్రేమ కాదు, కేవలం యుద్ధం మాత్రమే” అంటూ క్యాప్షన్ ఇచ్చి ఆసక్తిని పెంచేశారు.
కింగ్ 100 నుంచి రేపే స్పెషల్ గ్లింప్స్ రిలీజ్
కోలీవుడ్ డైరెక్టర్ రా కార్తీక్ (Ra. Karthik) తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామా నుంచి టబు పుట్టినరోజు కానుకగా (నవంబర్ 4న) ఉదయం 9 గంటలకు ప్రత్యేక గ్లింప్స్ విడుదల చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే విడుదల చేసిన ప్రీ-లుక్ వీడియో పోస్టర్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
పాతకాలం నాటి రేడియో విజువల్స్, చీరకట్టులో గంభీరంగా నడుచుకుంటూ వెళ్తున్న టబు లుక్ చూస్తుంటే, సినిమాలో ఆమె పాత్ర ఎంత పవర్‌ఫుల్‌గా ఉండబోతోందో అర్థమవుతోంది. కథను తిప్పే విలనిక్ లేదా ప్రతినాయక ఛాయలున్న పాత్రలో టబు కనిపించబోతున్నారనే వార్తలు అభిమానుల్లో అంచనాలను రెట్టింపు చేశాయి.
కింగ్ 100 గ్రాండ్ కాస్టింగ్.. క్రిస్మస్ కానుకగా రిలీజ్
అన్నపూర్ణ స్టూడియోస్, మనం ఎంటర్ప్రైజెస్ నిర్మిస్తున్న ఈ మైలురాయి చిత్రంలో నాగార్జున, టబులతో పాటు ఐశ్వర్య రాజేష్, సుస్మిత భట్, విజయేంద్ర, అశోక్ సెల్వన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. రాగ్స్ టు రిచెస్ బ్యాక్‌డ్రాప్‌లో తండ్రీ-కూతుళ్ల ఎమోషన్స్ ప్రధానాంశంగా ఈ కథ సాగనుందని సమాచారం. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు.
{{/usCountry}}అన్నపూర్ణ స్టూడియోస్, మనం ఎంటర్ప్రైజెస్ నిర్మిస్తున్న ఈ మైలురాయి చిత్రంలో నాగార్జున, టబులతో పాటు ఐశ్వర్య రాజేష్, సుస్మిత భట్, విజయేంద్ర, అశోక్ సెల్వన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. రాగ్స్ టు రిచెస్ బ్యాక్‌డ్రాప్‌లో తండ్రీ-కూతుళ్ల ఎమోషన్స్ ప్రధానాంశంగా ఈ కథ సాగనుందని సమాచారం. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు.
{{/usCountry}}ఈ భారీ మల్టీస్టారర్ విజువల్ వండర్ ఈ ఏడాది డిసెంబర్ 24న క్రిస్మస్ కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. 28 ఏళ్ల తర్వాత నాగ్-టబు జోడీ తెరపై తలపడటం అనే అంశం సినిమాకు బిగ్గెస్ట్ హైలైట్‌గా మారనుంది.