Web Series: ఓటీటీలోకి మరో క్రేజీ వెబ్ సిరీస్.. మన విద్యా వ్యవస్థపై సూపర్ సెటైర్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే
Web Series: ఓటీటీలోకి మన విద్యా వ్యవస్థపై సెటైర్ వేస్తూ సాగే మరో క్రేజీ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కు వస్తోంది. జులై 24 నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుండగా.. తాజాగా ఓ ఫన్నీ వీడియోను ప్రైమ్ వీడియో రిలీజ్ చేసింది.
Web Series: ఓటీటీ ఆడియన్స్ కు నాన్-స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) మరో క్రేజీ వెబ్ సిరీస్ తో వస్తోంది. ఫర్జీ, మీర్జాపూర్ లాంటి పవర్ ఫుల్ క్రైమ్ డ్రామాల తర్వాత ఇప్పుడు పక్కా కామెడీ రూట్ లోకి షిఫ్ట్ అయింది. కడుపుబ్బా నవ్వించడానికి 'ఆదర్శ్ బాల్ విద్యాలయ' (Adarsh Baal Vidyalaya) అనే ఒక సరికొత్త వెబ్ సిరీస్ ను జులై 24న స్ట్రీమింగ్ చేయడానికి ముహూర్తం ఫిక్స్ చేసింది.

ఆదర్శ్ బాల్ విద్యాలయ స్టోరీ ఏంటంటే?
ఈ వెబ్ సిరీస్ వెనుక ఉన్న క్రియేటర్స్ పేర్లు వింటేనే ఆడియన్స్ లో ఒక పాజిటివ్ వైబ్ స్టార్ట్ అవుతుంది. 'పంచాయత్', 'కోట ఫ్యాక్టరీ' లాంటి కల్ట్ క్లాసిక్ సిరీస్ లకు పనిచేసిన స్టార్ క్రియేటర్స్ సమీర్ సక్సేనా, బిశ్వపతి సర్కార్ ఈ ప్రాజెక్ట్ ను పోషమ్ పా పిక్చర్స్ బ్యానర్ పై నిర్మించారు. ఒక ప్రభుత్వ స్కూల్ లో జరిగే విచిత్రమైన సంఘటనల చుట్టూ డైరెక్టర్ హిమాంక్ గౌర్ ఈ కథను చాలా ఫన్నీగా డిజైన్ చేశారు.
ఈ సిరీస్ స్టోరీలైన్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎప్పుడూ రిలాక్స్ గా ఉండే ఒక హెడ్ మాస్టర్, ఎందుకూ పనికిరాని ఒక ప్రభుత్వ స్కూల్ ను ఒక్కసారిగా బాగు చేయాలని డిసైడ్ అవుతాడు. అయితే అక్కడున్న టీచర్స్ అందరూ ఎవరికి వారు యమునా తీరు అన్నట్టు ఉంటారు. అలాంటి టీచర్స్ తో కలిసి ఆ స్కూల్ రూపురేఖలు మార్చడానికి ఆ హెడ్ మాస్టర్ పడే కష్టాలు ఆడియన్స్ కు పొట్టచెక్కలయ్యేలా నవ్వులు తెప్పించనున్నాయి.
యాక్టర్స్ పవర్ హౌస్
యాక్టింగ్ పవర్ హౌస్ కేకే మీనన్ ఈ వెబ్ సిరీస్ కు మెయిన్ పిల్లర్ అని చెప్పొచ్చు. స్పెషల్ ఆప్స్, ఫర్జీ లాంటి సిరీస్ లలో ఇంటెన్స్ సీరియస్ రోల్స్ చేసిన కేకే మీనన్, ఇందులో ఒక డిఫరెంట్ ఫన్ యాంగిల్ లో కనిపించబోతున్నారు. అలాగే ‘పిచర్స్’, ఆస్పిరెంట్స్ వెబ్ సిరీస్ ఫేమ్ నవీన్ కస్తూరియా, సీనియర్ నటి అర్చన పూరన్ సింగ్ లాంటి టాలెంటెడ్ ఆర్టిస్టులు ఈ సిరీస్ లో కీ రోల్స్ ప్లే చేస్తున్నారు.
సినిమాల్లో విలన్ గా సెన్సేషన్ క్రియేట్ చేసిన అభిమన్యు సింగ్, అలాగే కామెడీ టైమింగ్ తో ఇరగదీసే దేవెన్ భోజాని లాంటి వాళ్లు ఈ టీచర్స్ గ్యాంగ్ లో ఉండటం విశేషం. ముఖ్యంగా నవీన్ కస్తూరియా లాంటి న్యాచురల్ యాక్టర్ తోడవ్వడంతో టీచర్స్ మధ్య వచ్చే క్లాస్ రూమ్ ఎపిసోడ్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయని టాక్. డైరెక్టర్ హిమాంక్ గౌర్ ప్రతి క్యారెక్టర్ ను చాలా జాగ్రత్తగా బిల్డ్ చేసినట్లు వీడియో చూస్తే తెలుస్తోంది.
ఆ మధ్య ఈ వెబ్ సిరీస్ అనౌన్స్ మెంట్ కు ఓటీటీ లవర్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఒక రా అండ్ రస్టిక్ కామెడీ డ్రామాగా రాబోతున్న ఈ వెబ్ సిరీస్.. మళ్లీ మనకు పాత స్కూల్ డేస్ ఫీలింగ్స్ తీసుకురావడం గ్యారెంటీ అని మేకర్స్ చెబుతున్నారు. జులై 24 నుంచి ప్రైమ్ వీడియో యాప్ లో ఈ స్కూల్ డ్రామా స్ట్రీమింగ్ కాబోతోంది. వీకెండ్ లో ఇంట్లో కూర్చుని ఫ్యామిలీతో కలిసి హాయిగా నవ్వుకోవడానికి ఇదొక బెస్ట్ ఆప్షన్.
ఆదర్శ్ బాల్ విద్యాలయ వెబ్ సిరీస్ విశేషాలు
వెబ్ సిరీస్ పేరు: ఆదర్శ్ బాల్ విద్యాలయ
ఓటీటీ: అమెజాన్ ప్రైమ్ వీడియో
రిలీజ్ డేట్ం జులై 24, 2026
జానర్: కామెడీ డ్రామా
నటీనటులు: కే కే మేనన్, నవీన్ కస్తూరియా, అర్చన పూరన్ సింగ్
డైరెక్టర్: హిమాంక్ గౌర్
క్రియేటర్స్: సమీర్ సక్సేనా, బిశ్వపతి సర్కార్
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


