Adarsha Kutumbam: అఫీషియల్.. వెంకీ, త్రివిక్రమ్ ఆదర్శ కుటుంబం రిలీజ్ వాయిదా.. కొత్త డేట్ ఇదే.. ప్రొడ్యూసర్ ఏమన్నాడంటే?
Adarsha Kutumbam Release Date: ఆదర్శ కుటుంబం మూవీ రిలీజ్ వాయిదా పడింది. ముందు చెప్పిన డేట్ కంటే వారం ఆలస్యంగా సినిమా రానున్నట్లు ప్రొడ్యూసర్ నాగవంశీ వెల్లడించారు. దీంతో కొన్ని రోజులుగా వస్తున్న పుకార్లే నిజమని తేలింది.
Adarsha Kutumbam Release Date: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'ఆదర్శ కుటుంబం' సినిమా రిలీజ్ వాయిదా పడింది. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా విడుదల కావలసిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఇప్పుడు అక్టోబర్ 9, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ మేరకు హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ప్రొడ్యూసర్ నాగవంశీ సోషల్ మీడియా వేదికగా అధికారిక ప్రకటన చేస్తూ మూవీ లవర్స్‌కి క్షమాపణలు చెప్పారు.

నాగవంశీ ట్వీట్.. అసలు కారణం ఏంటంటే?
గత కొద్ది రోజులుగా ఆదర్శ కుటుంబం సినిమా పోస్ట్‌పోన్ అవుతుందంటూ ఇండస్ట్రీ వర్గాల్లో ఊహాగానాలు జోరుగా సాగాయి. అయితే సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ టీమ్ మాత్రం ఈ వార్తలను మళ్ళీ మళ్ళీ ఖండిస్తూ వచ్చింది. కానీ క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా, ఆడియన్స్‌కి బెస్ట్ థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ అందించాలనే ఉద్దేశంతోనే ఈ చిన్న ఆలస్యం తప్పలేదని క్లారిటీ ఇచ్చారు.
సినిమా ఆలస్యం కావడంపై ప్రొడ్యూసర్ నాగవంశీ ఎక్స్ వేదికగా స్పందించారు. "మేము మీకు ప్రామిస్ చేసిన ఎంటర్‌టైన్‌మెంట్, ఎక్స్‌పీరియన్స్ పూర్తి స్థాయిలో అందించడానికి మరికొంత టైమ్ పడుతోంది. అందుకే ఆదర్శ కుటుంబం సినిమాను అక్టోబర్ 9న రిలీజ్ చేస్తున్నాం. ఈ వెయిటింగ్ పీరియడ్ కొద్దిగా పెరిగినందుకు అందరికీ మనస్ఫూర్తిగా సారీ చెప్తున్నాం" అంటూ అధికారికంగా పోస్ట్ చేశారు.
ఈ అప్‌డేట్‌తో దసరా సెలవుల రేసులో ఒక వారం ఆలస్యంగా ఈ మూవీ ఆడియన్స్ ముందుకు రాబోతోంది. వెంకీ మార్క్ కామెడీ, త్రివిక్రమ్ పంచ్‌లు థియేటర్లలో పూనకాలు తెప్పించడం ఖాయమని యూనిట్ వర్గాలు చెప్తున్నాయి.
'నారాయణమ్మ' పాట కూడా వాయిదా
రిలీజ్ డేట్ మారడంతో పాటు ఫస్ట్ సింగిల్ అప్‌డేట్‌లోనూ మేకర్స్ మార్పులు చేశారు. శ్రీనిధి శెట్టి, నివేథా పేతురాజ్, డింపుల్ హయాతి కాంబినేషన్‌లో డిజైన్ చేసిన కలర్‌ఫుల్ సాంగ్ 'నారాయణమ్మ' మంగళవారమే రిలీజ్ కావాల్సి ఉంది.
అయితే సినిమా వాయిదా పడటంతో ఈ ఫస్ట్ సింగిల్‌ను ఈ వీకెండ్‌లో గ్రాండ్‌గా లాంచ్ చేయబోతున్నట్లు మేకర్స్ తెలిపారు. మ్యూజిక్ సెన్సేషన్ తమన్ ఈ సినిమా కోసం అదిరిపోయే చార్ట్‌బస్టర్ ట్యూన్స్ కంపోజ్ చేసినట్లు సమాచారం.
వెంకీ - త్రివిక్రమ్ కాంబోపై భారీ అంచనాలు
టాలీవుడ్‌లో వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్‌కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతంలో 'నువ్వు నాకు నచ్చావ్', 'మల్లీశ్వరి' లాంటి ఆల్ టైమ్ క్లాసిక్ సినిమాలకు త్రివిక్రమ్ కథ, డైలాగ్స్ అందించగా, వెంకీ తన నటనతో సెన్సేషన్ క్రియేట్ చేశారు.
అయితే ఈ ఇద్దరూ డైరెక్టర్, హీరోగా కలిసి సినిమా చేయడం మాత్రం ఇదే తొలిసారి. దీంతో ఈ ప్రాజెక్ట్ మీద ఆడియన్స్‌లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో నారా రోహిత్, పూజిత పొన్నాడ, రావు రమేష్, సత్య కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. దసరా సీజన్‌లో వస్తున్న ఈ ఫ్యామిలీ డ్రామా బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


