Naga Vamsi: లిప్ లాక్స్, మేకౌట్ సీన్స్ ఉంటే తప్పేంటి.. ఆ చిన్న పిల్లాడు అలాగే ఉండడు కదా: ఎపిక్ ట్రైలర్ విమర్శలపై నాగవంశీ

Naga Vamsi on Epic: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య లీడ్ రోల్స్ లో నటించిన ఎపిక్ మూవీపై ప్రొడ్యూసర్ నాగవంశీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ముఖ్యంగా ట్రైలర్ పై వస్తున్న విమర్శలపై తనదైన స్టైల్లో స్పందించారు.

Published on: Sep 8, 2026, 21:35:09 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Naga Vamsi on Epic: సూపర్ హిట్ వెబ్ సిరీస్ '#90's'లోని ఆదిత్య క్యారెక్టర్ ఆధారంగా తెరకెక్కిన 'ఎపిక్' (Epic) మూవీ థియేట్రికల్ ట్రైలర్ ఇప్పుడు టాలీవుడ్‌లో పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాలో లిప్‌లాక్ సీన్లు, మేకౌట్ డ్రామా, అడల్ట్ థీమ్స్ ఉండటంపై వస్తున్న విమర్శలపై స్టార్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ తనదైన శైలిలో స్పందించడం విశేషం.

Naga Vamsi: లిప్ లాక్స్, మేకౌట్ సీన్స్ ఉంటే తప్పేంటి.. ఆ చిన్న పిల్లాడు అలాగే ఉండడు కదా: ఎపిక్ ట్రైలర్ విమర్శలపై నాగవంశీ
Naga Vamsi: లిప్ లాక్స్, మేకౌట్ సీన్స్ ఉంటే తప్పేంటి.. ఆ చిన్న పిల్లాడు అలాగే ఉండడు కదా: ఎపిక్ ట్రైలర్ విమర్శలపై నాగవంశీ

“#90's ఆదిత్య నుంచి ఇలాంటి సీన్లు ఊహించలేదా?”

ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో నాగవంశీ మాట్లాడారు. ఎపిక్ మూవీ ట్రైలర్ బయటకొచ్చాక వచ్చిన నెగెటివ్ కామెంట్స్ చూసి తనకు చాలా ఆశ్చర్యం కలిగిందని చెప్పారు. "#90's సిరీస్ తీసిన ఆదిత్య హాసన్ నుంచి కానీ లేదా 'ఎపిక్' సినిమా నుంచి కానీ జనాలు ఇలాంటి స్టైల్ ఊహించలేదా అనేది నాకు అర్థం కావడం లేదు. అసలు ఆ ట్రైలర్‌లో ఏముంది తప్పు అని నేను అడుగుతున్నా" అంటూ డైరెక్ట్‌గా క్లారిటీ ఇచ్చారు.

"స్కూల్ అబ్బాయి లండన్ వెళ్తే మారడా?"

ఒకప్పుడు స్కూల్ డేస్‌లో అల్లరి చేసిన పిల్లోడు, పెరిగి పెద్దయ్యాక లండన్ వెళ్లి హైయర్ ఎడ్యుకేషన్ చదువుకునేటప్పుడు కూడా అలాగే ఉంటాడా అని నాగవంశీ ప్రశ్నించారు. ఈ మోడర్న్ జనరేషన్‌లో ఆ రోజుల్లో ఉన్న అల్లరి కుర్రాడే ఇప్పటికీ అలాగే ఉండాలని జనాలు ఎందుకు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. కాలంతో పాటు ప్రతీ ఒక్కరి ఆలోచనలు, లైఫ్‌స్టైల్ మారతాయని తెలిపారు.

తెలుగు సినిమాలో మునుపెన్నడూ లేని బోల్డ్ కాన్సెప్ట్

'ఎపిక్' అనేది కమర్షియల్ స్పేస్‌లో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ చేసిన ఒక క్రేజీ ప్రయోగమని నాగవంశీ వివరించారు. సాధారణంగా ప్రతీ లవ్ స్టోరీలో ఉండే రొటీన్ కథా విధానం, ఇంటర్వెల్ బ్యాంగ్స్‌ను ఈ సినిమాతో పూర్తిగా బ్రేక్ చేశామని చెప్పారు.

హైదరాబాద్‌కి చెందిన ఒక కాన్ఫిడెంట్, బోల్డ్ మోడర్న్ అమ్మాయి కడలి (వైష్ణవి చైతన్య), వనపర్తి నుంచి వెళ్లిన ఒక అమాయకపు సిగ్గరి అబ్బాయి ఆదిత్య (ఆనంద్ దేవరకొండ) మధ్య లండన్ బ్యాక్‌డ్రాప్‌లో లివ్-ఇన్ రిలేషన్‌షిప్ ఎలా సాగిందో చాలా రియలిస్టిక్‌గా డిజైన్ చేశామని అన్నారు.

పీరియడ్స్, ఫిజికల్ ఇంటిమసీపై రియలిస్టిక్ డిస్కషన్

తెలుగు కమర్షియల్ సినిమాల్లో ఇప్పటివరకు ఎవరూ ఓపెన్‌గా చర్చించని పాయింట్లను 'ఎపిక్'లో టచ్ చేసినట్లు నిర్మాత చెప్పారు. ఒక అబ్బాయి, అమ్మాయి మధ్య శారీరక కలయిక (ఫిజికల్ ఇంటిమసీ) జరిగిన మరుసటి రోజు వారి మధ్య ఎలాంటి సంభాషణలు నడుస్తాయి అనేది చాలా నేచురల్‌గా చూపించామన్నారు. అంతేకాకుండా సాధారణంగా సినిమాల్లో చర్చించడానికి వెనకాడుతుండే 'పీరియడ్స్' కాన్సెప్ట్ గురించి కూడా సినిమాలో చాలా బోల్డ్‌గా డిస్కస్ చేశామని తెలిపారు.

'బేబీ' బ్లాక్‌బస్టర్ కాంబో రీ-యూనియన్

'బేబీ' లాంటి రూ. 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసిన ఇండస్ట్రీ హిట్ తర్వాత ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య కలిసి నటించిన రెండో సినిమా కావడంతో 'ఎపిక్'పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

#90's సిరీస్‌తో నోస్టాల్జిక్ మ్యాజిక్ క్రియేట్ చేసిన డైరెక్టర్ ఆదిత్య హాసన్.. ఇప్పుడు ఈ యూత్‌ఫుల్ రొమాంటిక్ డ్రామాతో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తారో చూడాలి. ఈ సినిమా సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More