టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన మోస్ట్ అవేటెడ్ యాక్షన్ థ్రిల్లర్ 'డెకాయిట్' ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చేసింది. ఏప్రిల్ 10న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందనతో తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది.
ఇండియా, వరల్డ్ వైడ్ కలెక్షన్స్

భారీ అంచనాల మధ్య విడుదలైన 'డెకాయిట్' సినిమా మొదటి రోజు డీసెంట్ వసూళ్లనే సాధించింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, డెకాయిట్ చిత్రం భారత్ వ్యాప్తంగా దాదాపు రూ. 6.50 కోట్ల నెట్ కలెక్షన్స్ (Net) రాబట్టింది. అలాగే, ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఈ అంకె 13.50 కోట్ల రూపాయలకు పైగానే ఉండటం విశేషం.
అయితే, సౌత్ మార్కెట్‌లో అడివి శేష్‌కు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ వసూళ్లు ఆశాజనకంగానే ఉన్నా, హిందీ బెల్ట్‌లో మాత్రం ఆశించిన స్థాయిలో ఓపెనింగ్స్ రాలేదు. తెలుగు రాష్ట్రాల నుంచే డెకాయిట్ సినిమాకు సుమారు 5.60 కోట్ల రూపాయల వరకు వసూళ్లు వచ్చినట్లు తెలుస్తోంది.
'ధురందర్ 2' ధాటికి తట్టుకోగలదా?
ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద రణ్‌వీర్ సింగ్ నటించిన 'ధురందర్ 2: ది రివెంజ్' ప్రభంజనం కొనసాగుతోంది. నాలుగో వారంలో కూడా ఈ చిత్రం 6.70 కోట్ల రూపాయలు వసూలు చేస్తూ 'డెకాయిట్'కు గట్టి పోటీనిస్తోంది. ఈ మెగా మూవీ హవా కొనసాగుతుండటంతో అడివి శేష్ సినిమాకు స్క్రీన్ల సంఖ్య కొంత తగ్గినట్లు సమాచారం.
అడివి శేష్ గత చిత్రాలు 'హిట్ 2' (6.4 కోట్లు), 'మేజర్' వంటి సినిమాలతో పోలిస్తే డెకాయిట్ ఓపెనింగ్స్ మెరుగ్గానే ఉన్నప్పటికీ, లాంగ్ రన్లో నిలబడాలంటే వీకెండ్లో వసూళ్లు పుంజుకోవాల్సి ఉంటుంది.
అసలు కథేంటి? రివ్యూలు ఎలా ఉన్నాయి?
{{/usCountry}}అడివి శేష్ గత చిత్రాలు 'హిట్ 2' (6.4 కోట్లు), 'మేజర్' వంటి సినిమాలతో పోలిస్తే డెకాయిట్ ఓపెనింగ్స్ మెరుగ్గానే ఉన్నప్పటికీ, లాంగ్ రన్లో నిలబడాలంటే వీకెండ్లో వసూళ్లు పుంజుకోవాల్సి ఉంటుంది.
అసలు కథేంటి? రివ్యూలు ఎలా ఉన్నాయి?
{{/usCountry}}నూతన దర్శకుడు షానియల్ డియో తెరకెక్కించిన డెకాయిట్ చిత్రంలో అడివి శేష్ మృణాల్ ఠాకూర్ లవర్స్ హరిదాస్, సరస్వతిగా నటించారు. విడిపోయిన ఈ ఇద్దరు ప్రేమికులు కొన్ని అనూహ్య పరిస్థితుల వల్ల కలిసి దొంగతనాలు చేయాల్సి వస్తే ఏం జరిగిందనేదే ఈ సినిమా ప్రధానాంశం.
ఈ చిత్రంలో అనురాగ్ కశ్యప్, ప్రకాష్ రాజ్ వంటి హేమాహేమీలు నటించడం సినిమాకు ప్లస్ పాయింట్. అయితే, సెకండ్ హాఫ్‌లో వచ్చే కొన్ని సీన్లు సాగదీసినట్లు ఉన్నాయని, స్క్రీన్ ప్లే ఇంకాస్త బలంగా ఉంటే బాగుండేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
అడివి శేష్ కామెంట్స్
మరోవైపు, అడివి శేష్ తన నటనతో మరోసారి ఆకట్టుకున్నారు. మృణాల్‌తో ఆయన కెమిస్ట్రీ హైలైట్‌గా నిలిచింది. "ధురందర్ వంటి భారీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించడం సహజమే, వాటితో మాకు పోటీ లేదు" అని అడివి శేష్ ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే.