...
...
Next Story

Agadha Trailer: అగధ వదలదు- వెన్నులో వణుకు పుట్టించేలా విజువల్స్- భయపెడుతున్న హారర్ థ్రిల్లర్ ట్రైలర్- ఎంఎస్ రాజు రిస్క్

Agadha Trailer: సంచలన విజయాలను అందించిన సీనియర్ నిర్మాత, దర్శకుడు ఎం.ఎస్.రాజు నుంచి వస్తున్న సరికొత్త చిత్రం ‘అగధ’. ఈ మిస్టరీ హారర్ థ్రిల్లర్ ట్రైలర్ ఇవాళ రిలీజైంది. ట్రైలర్ లోని విజువల్స్ చూస్తుంటే వెన్నులో వణుకు పుట్టాల్సిందే. అయితే మూవీ రిలీజ్ విషయంలో మాత్రం రాజు రిస్క్ చేస్తున్నారని అంటున్నారు.

Published on: Aug 3, 2026, 13:41:09 IST
Advertisement

Agadha Trailer: టాలీవుడ్‌లో 'ఒక్కడు', 'వర్షం', 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' వంటి ట్రెండ్ సెట్టర్ బ్లాక్‌బస్టర్ చిత్రాలను అందించిన వెటరన్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ ఎం.ఎస్. రాజు (MS Raju) మరోసారి మెగాఫోన్ పట్టారు. ఈసారి ఆయన తన పాత శైలి ఫ్యామిలీ, లవ్ డ్రామాలను పక్కనపెట్టి పూర్తిస్థాయి 'డివైన్ మిస్టికల్ హర్రర్ మిస్టరీ' కథాంశంతో వస్తున్నారు. ఆయన దర్శకత్వం వహించిన 'అగధ' (Agadha) ట్రైలర్‌ ఇవాళ (ఆగస్టు 3) రిలీజైంది.

అగధ ట్రైలర్

అగధ వదలదు- వెన్నులో వణుకు పుట్టించేలా విజువల్స్- భయపెడుతున్న హారర్ థ్రిల్లర్ ట్రైలర్- ఎంఎస్ రాజు రిస్క్
అగధ వదలదు- వెన్నులో వణుకు పుట్టించేలా విజువల్స్- భయపెడుతున్న హారర్ థ్రిల్లర్ ట్రైలర్- ఎంఎస్ రాజు రిస్క్

ఆగస్టు 14, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతున్న అగధ చిత్రం ట్రైలర్ ప్రారంభం నుంచే వీక్షకులలో వెన్నులో వణుకు పుట్టించే విజువల్స్, స్కేరీ అట్మాస్ఫియర్ తో ఆకట్టుకుంటోంది. ఆ సన్నివేశాలు, బీజీఎం మ్యూజిక్ భయపెట్టేలా ఉన్నాయి. అగధ వస్తుందంటూ ట్రైలర్ తో ఆడియన్స్ లో క్యూరియాసిటీ పెంచేశారు ఎంఎస్ రాజు.

గర్భవతి ఆత్మహత్య వెనుక ఆ దుష్టశక్తి ఏంటి?

అగధ ట్రైలర్ కథనంలోకి వెళ్తే.. మహిమ (ఉల్కా గుప్తా) అనే గర్భవతి ఊహించని రీతిలో రాత్రికి రాత్రే ఆత్మహత్య చేసుకోవడంతో కథ మొదలవుతుంది. ఈ విచిత్ర మరణం వెనుక ఉన్న రహస్యాన్ని ఛేదించేందుకు 'మహాదేవి' (కామాక్షి భాస్కర్ల) రంగంలోకి దిగుతుంది.

కేవలం ఒక సాధారణ ఆత్మహత్యగా భావించిన కేసు వెనుక చీకటి ప్రపంచానికి చెందిన 'అగధ' అనే అత్యంత శక్తివంతమైన దుష్టశక్తి ప్రమేయం ఉందని మహాదేవి గుర్తిస్తుంది.

కాన్సెప్ట్ కేక

దైవిక శక్తికి, పాతాళ లోకపు దుష్టశక్తులకు నడుమ సాగే ఆధిపత్య పోరాటమే అగధ చిత్రమని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. అయితే ట్రైలర్ చూపించిన వెనక్కి నడిచే మనుషులు, శరీరం నుంచి వేరు చేసిన తర్వాత మాట్లాడే తలలు, అగ్నిలో నుంచి పుట్టుకొచ్చే దుష్ట శక్తి.. ఇలాంటివి కొన్ని విజువల్స్ తో మూవీ కాన్సెప్ట్ కేక అనిపించేలా ఉంది.

కామాక్షి పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్

హారర్ థ్రిల్లర్ సినిమాలకు సౌండ్ డిజైన్, విజువల్స్ ఎంతో ముఖ్యమైనవి. 'అగధ' చిత్రంలో కనిపించే భయానక వాతావరణం, వయొలెన్స్ దృశ్యాలు కేవలం భయపెట్టడానికే కాకుండా కథాంశానికి అనుగుణంగానే తీర్చిదిద్దినట్లు స్పష్టమవుతోంది. ఆగస్టు 14న ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, మరియు హిందీ భాషల్లో ఒకేసారి ప్రేక్షకుల ముందుకు రానుంది.

వర్కౌట్ అవుతుందా?

ఇటీవలి కాలంలో తెలుగు ప్రేక్షకులు సాధారణ దెయ్యాల సినిమాల కంటే 'విరూపాక్ష', 'మసూద' వంటి మూఢనమ్మకాలు, చేతబడులు, ‘దైవిక శక్తి వర్సెస్ దుష్టశక్తి’ కాన్సెప్టులతో వచ్చే రా అండ్ రస్టిక్ చిత్రాలనే ఎక్కువగా ఆదరిస్తున్నారు. ఎం.ఎస్.రాజు వంటి సీనియర్ మేకర్ తన పాత క్లాసిక్ ముద్రను పక్కనపెట్టి, కామాక్షి భాస్కర్ల వంటి పెర్ఫార్మెన్స్-ఓరియెంటెడ్ నటితో ఈ స్థాయిలో ప్రయోగాత్మక సినిమాను ప్రయత్నించడం విశేషం.

రిస్క్ చేస్తున్నారా?

ఆగస్టు 14 ఇండిపెండెన్స్ డే వీకెండ్‌లో సరైన హారర్ కంటెంట్ పడితే పాన్-ఇండియా స్థాయిలో బాక్సాఫీస్ వద్ద సర్ప్రైజ్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే రిలీజ్ డేట్ విషయంలో మాత్రం ఎంఎస్ రాజు రిస్క్ చేస్తున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఆగస్టు 14నే సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ రిలీజ్ కానుంది.

ఇంకో రెండు మూడు చిన్న సినిమాలు కూడా అదే రోజు వస్తున్నాయి. అంతకంటే వారం ముందు కొరియన్ కనకరాజు (ఆగస్టు 7) రిలీజ్ అవుతుంది. ఇది కూడా హారర్ సినిమానే. ఈ నేపథ్యంలో అగధ మూవీకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe