...
...
Next Story

Aha OTT: కమల్ హాసన్ క్లాసిక్ మూవీ టైటిల్ తో ఆహా ఓటీటీ సిరీస్.. జాబ్ కోసం ఇల్లు వదిలే ప్రతి స్టూడెంట్ కోసం.. కమింగ్ సూన్

Aha OTT: తెలుగులో టాప్ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో ఒకటైన ఆహా వీడియో సరికొత్త వెబ్ సిరీస్ తో రాబోతుంది. జాబ్ కోసం ఇల్లు వదిలిన ప్రతి స్టూడెంట్ కోసం ఈ సిరీస్ అని అనౌన్స్ మెంట్ వీడియోతోనే హైప్ క్రియేట్ చేసింది. ఈ సిరీస్ కు కమల్ హాసన్ కల్ట్ క్లాసిక్ సినిమా పేరు పెట్టడం విశేషం.

Published on: Jul 6, 2026, 14:11:55 IST
Advertisement

Aha OTT: ఉద్యోగ వేటలో ఇళ్లను వదిలి, సరికొత్త నగరాల బాట పట్టి, ఆకలిని దిగమింగుకుంటూ ఆత్మగౌరవం కోసం పోరాడే ప్రతి నిరుద్యోగ యువకుడి కథ మళ్లీ డిజిటల్ తెరపైకి రాబోతోంది. ఈ స్టోరీ లైన్ తో సరికొత్తగా ఆహా వీడియో ఓటీటీ ఓ వెబ్ సిరీస్ తీసుకొస్తోంది. దీని అనౌన్స్ మెంట్ వీడియో వైరల్ గా మారింది.

ఆకలి రాజ్యం ఓటీటీ

కమల్ హాసన్ క్లాసిక్ మూవీ టైటిల్ తో ఆహా ఓటీటీ సిరీస్.. జాబ్ కోసం ఇల్లు వదిలే ప్రతి స్టూడెంట్ కోసం.. కమింగ్ సూన్
కమల్ హాసన్ క్లాసిక్ మూవీ టైటిల్ తో ఆహా ఓటీటీ సిరీస్.. జాబ్ కోసం ఇల్లు వదిలే ప్రతి స్టూడెంట్ కోసం.. కమింగ్ సూన్

ఆహా వీడియో కొత్త వెబ్ సిరీస్ ను తీసుకొస్తుంది. కమల్ హాసన్ కల్ట్ క్లాసిక్ మూవీ అయిన ‘ఆకలి రాజ్యం’ పేరుతో త్వరలోనే కొత్త సిరీస్ ను స్ట్రీమింగ్ చేయనుంది. ఈ విషయాన్ని ఇవాళ (జూలై 6) వీడియోతో అనౌన్స్ చేశారు. అనంతపురం, చిత్తూరు, ఆదిలాబాద్ ఇలా అన్ని ప్రాంతాల నుంచి స్టూడెంట్స్ చేరేది యూఎస్ఏ.. అదే యునైటెడ్ స్ట్రీట్స్ ఆఫ్ అమీర్ పేట్ అని వీడియోలో చెప్పుకొచ్చారు.

ఇల్లు వదిలి జాబ్ కోసం నగరానికి వచ్చిన ప్రతి ఒక్కరి కథ అని ఈ వెబ్ సిరీస్ గురించి ఓటీటీ ప్లాట్ ఫామ్ హింట్ ఇచ్చింది. ఈ ఆకలి రాజ్యం వెబ్ సిరీస్ త్వరలోనే స్ట్రీమింగ్ కాబోతుందని ప్రకటించారు. దీనికి నీలగిరి మామిళ్ల డైరెక్టర్.

అప్పట్లో బ్లాక్ బస్టర్

ఇప్పుడు ఇదే తరహా కథను సరికొత్త హంగులతో, నేటి ఆధునిక సమాజ పరిస్థితులకు అద్దం పట్టేలా ఒక వెబ్ సిరీస్‌గా మలుస్తున్నట్లు తెలుస్తోంది. తెలుగు ఓటీటీ రంగంలో దూసుకుపోతున్న ‘ఆహా’ (Aha OTT) సంస్థ ఈ భారీ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఉద్యోగం కోసం

"ఉద్యోగం కోసం ఇళ్లను వదిలి వచ్చిన ప్రతి విద్యార్థి కోసం ఈ కథను తీసుకొస్తున్నాం" అని ఆహా సంస్థ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. కలలు, ఆత్మగౌరవం, విప్లవం కలబోసిన ఒక అద్భుతమైన ప్రయాణంగా ఈ వెబ్ సిరీస్ ఉండబోతోందని మేకర్స్ స్పష్టం చేశారు. 'హాష్‌ట్యాగ్ ఆకలిరాజ్యం' (#AakaliRajyam) పేరుతో విడుదల చేసిన ఈ అప్‌డేట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. 2026లో ఈ మోస్ట్ అవేటెడ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సిరీస్ లో నేటి కార్పొరేట్ ప్రపంచంలోని ఒత్తిళ్లు, రూమ్‌లలో ఉంటూ ఉద్యోగాల కోసం తిరిగే బ్యాచిలర్స్ కష్టాలు, వారి ఆశలు, ప్రేమ, ఆఖరికి వ్యవస్థపై వారు చేసే డిజిటల్ విప్లవాన్ని కూడా ఇందులో చూపించబోతున్నాట్లు టాక్. ఒక అద్భుతమైన సందేశంతో పాటు బలమైన భావోద్వేగాలతో ఈ సిరీస్ రాబోతోంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe