OTT Series: రెండు రోజుల్లోనే 100 మిలియన్లు.. ఓటీటీని షేక్ చేస్తున్న తెలుగు వెబ్ సిరీస్.. స్కూల్ డేస్, ప్యూర్ లవ్ స్టోరీ!

OTT Series: ఓటీటీలో ప్యూర్ నోస్టాల్జియా కంటెంట్‌తో వచ్చిన తెలుగు వెబ్ సిరీస్ సరికొత్త రికార్డు సృష్టించింది. కేవలం రెండు రోజుల్లోనే ఈ సిరీస్ 100 మిలియన్ల వ్యూయింగ్ మినిట్స్ రికార్డును దాటేసింది. అసలు ఈ సిరీస్ ఏంటీ? ఈ రేంజ్ లో సక్సెస్ కు కారణం ఏంటో? ఇక్కడ చూసేయండి.

Published on: Jul 5, 2026, 19:30:00 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

OTT Series: ప్రస్తుతం తెలుగు ఓటీటీ రంగంలో వింటేజ్, నోస్టాల్జియా, మిడిల్ క్లాస్ ఎమోషన్స్ ఉన్న కంటెంట్‌కు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ తరుణంలోనే ‘90s కిడ్స్ ఎంటర్‌టైన్‌మెంట్’ నిర్మాణ భాగస్వామ్యంతో ఈటీవీ విన్ తీసుకొచ్చిన తాజా ఒరిజినల్ వెబ్ సిరీస్ ‘గుర్తుకొస్తున్నాయి’ అదరగొడుతోంది.

రెండు రోజుల్లోనే 100 మిలియన్లు.. ఓటీటీని షేక్ చేస్తున్న తెలుగు వెబ్ సిరీస్
రెండు రోజుల్లోనే 100 మిలియన్లు.. ఓటీటీని షేక్ చేస్తున్న తెలుగు వెబ్ సిరీస్

గుర్తుకొస్తున్నాయి 100 మిలియన్

ఈటీవీ విన్ లో రిలీజైన గుర్తుకొస్తున్నాయి వెబ్ సిరీస్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సిరీస్ రిలీజైన రెండు రోజుల్లోనే 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ ను క్రాస్ చేసింది. ఈ విషయాన్ని ఆదివారం (జూలై 5) ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్ ఫామ్ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది.

పాత జ్ఞాపకాలను, చిన్ననాటి ముచ్చట్లను గుర్తు చేస్తూ ఫీల్ గుడ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సిరీస్ తాజాగా ఏకంగా 100 మిలియన్ల వ్యూయింగ్ మినిట్స్ సాధించి సంచలనం సృష్టిస్తోంది. ఈ సిరీస్ జూలై 3న ఈటీవీ విన్ ఓటీటీలో రిలీజైంది.

అసలు కథేంటంటే..?

గుర్తుకొస్తున్నాయి సిరీస్ లో ‘బేబీ’ ఫేమ్ విరాజ్ హీరోగా నటించాడు. యశశ్రీ రావు హీరోయిన్. సంతోష్ (విరాజ్), వైశాలి (యశశ్రీ) స్కూల్ లో క్లాస్ మేట్స్. వీళ్లు లవ్ చేసుకుంటారు. వైశాలి తండ్రి ఏమో అదే స్కూల్ హెడ్ మాస్టర్ రఘునాథ్ (ప్రియదర్శిని రామ్). రఘునాథ్ ను ఒప్పించి మరీ సంతోష్ పెళ్లికి రెడీ అవుతాడు.

అయితే గోవాలో బ్యాచిలర్స్ పార్టీ కోసం తన ఫ్రెండ్స్ గణేష్, శ్రీకాంత్, ఆనంద్ తో కలిసి సంతోష్ వెళ్తాడు. ఆ క్రమంలో యాక్సిడెంట్ కావడంతో సంతోష్ గతాన్ని మర్చిపోతాడు. మరి సంతోష్ కు గతం గుర్తొచ్చిందా? వైశాలితో పెళ్లి జరిగిందా? అన్నదే గుర్తుకొస్తున్నాయి సిరీస్ స్టోరీ.

సక్సెస్ కారణం

గుర్తుకొస్తున్నాయి సిరీస్ రిలీజ్ కంటే ముందే దీనిపై మంచి హైప్ నెలకొంది. ఇక స్పెషల్ గా ప్రీమియర్ షోలు కూడా వేశారు. థియేటర్లో ఈ ప్రీమియర్ షోలు చూసిన ఆడియన్స్ పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ఇచ్చారు. సిరీస్ అదిరిపోయిందని, ప్యూర్ నోస్టాల్జియా ఫీల్ వచ్చిందని అన్నారు. ఈ సిరీస్ సక్సెస్ కు ముఖ్య కారణం ఆ నోస్టాల్జియా ఫీలింగ్ అని చెప్పొచ్చు.

యాక్సిడెంట్ కారణంగా గతం మర్చిపోయిన హీరోకు అతని ఫ్రెండ్స్ కలిసి పాత జ్ణాపకాలు గుర్తు చేసేందుకు ట్రై చేస్తారు. ఈ క్రమంలోనే వచ్చే స్కూల్ డేస్, చిన్నప్పటి నుంచి కొనసాగే లవ్ సీన్లు ఆకట్టుకుంటున్నాయి. 90స్ కిడ్స్ కు కనెక్ట్ అయ్యేలా ఈ ఎపిసోడ్లు సాగుతాయి. ఇవి ప్రస్తుతం యూత్ ను బాగా ఎంగేజ్ చేస్తున్నాయి.

​మొదటి ఎపిసోడ్ ఉచితం

‘గుర్తుకొస్తున్నాయి’ వెబ్ సిరీస్ ఇంతటి భారీ వ్యూస్‌ను రాబట్టడం వెనుక మేకర్స్ ఒక క్రేజీ స్ట్రాటజీని ఉపయోగించారని కూడా చెప్పొచ్చు. ఈ సిరీస్‌లోని మొదటి ఎపిసోడ్‌ను ఎటువంటి సబ్‌స్క్రిప్షన్ అవసరం లేకుండా ఉచితంగా చూసే అవకాశం కల్పించారు.

​కనెక్ట్ అయిన ఆడియన్స్

స్కూల్ డేస్ నోస్టాల్జియాతో సాగే మొదటి ఎపిసోడ్ చూసిన ప్రతి ఒక్కరూ కథకు, అందమైన విజువల్స్‌కు కనెక్ట్ అయిపోతున్నారు. మిగతా ఎపిసోడ్స్ చూడటానికి సబ్‌స్క్రిప్షన్ తీసుకుని మరీ బింజ్ వాచ్ చేస్తుండటంతో వ్యూయింగ్ మినిట్స్ రికార్డు స్థాయిలో పెరిగిపోతున్నాయి.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More