ఈస్ట్ గోదావరి అబ్బాయి.. వెస్ట్ గోదావరి అమ్మాయి.. ఓటీటీలోకి మరో తెలుగు రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్.. అదిరిపోయిన ట్రైలర్
ఓటీటీలో మరో రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్ వస్తోంది. ఈస్ట్ గోదావరి అబ్బాయి, వెస్ట్ గోదావరి అమ్మాయి ప్రేమ, పెళ్లితో కలిస్తే ఎలా ఉంటుందన్న కాన్సెప్ట్ తో వస్తున్న సిరీస్ ఇది. ఆహా వీడియో ఓటీటీలోకి రాబోతున్న ఈ సిరీస్ ట్రైలర్ శుక్రవారం (అక్టోబర్ 10) రిలీజైంది.
ఆహా వీడియో ఓటీటీ మరో అదిరిపోయే తెలుగు రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్ ను అందించబోతోంది. ఈ సిరీస్ పేరు ఆనందలహరి (Anandalahari). ఆనంద్, లహరి అనే ఓ యువ జంట చుట్టూ తిరిగే కథతో రాబోతున్న ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ ను శుక్రవారం (అక్టోబర్ 10) మేకర్స్ రిలీజ్ చేశారు.

ఆనందలహరి వెబ్ సిరీస్ ట్రైలర్
ఓటీటీలోకి మరో కొత్త తెలుగు రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్ వస్తోంది. ఈ సిరీస్ పేరు ఆనందలహరి. ఆహా వీడియో ఓటీటీలో అక్టోబర్ 17 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తాజాగా మేకర్స్ ట్రైలర్ రిలీజ్ చేశారు. పాన్ గోదావరి అంటూ ఈస్ట్ అబ్బాయి, వెస్ట్ అమ్మాయి మధ్య జరిగే ప్రేమ, పెళ్లి కాన్సెప్ట్ తో ఈ సిరీస్ రూపొందించారు. 3 నిమిషాలకుపైగా ఉన్న ట్రైలర్ చాలా సరదాగా సాగిపోయింది. ట్రైలర్ మొదట్లోనే ఈ వెబ్ సిరీస్ లో లీడ్ రోల్స్ అయిన ఆనంద్, లహరి ఓ కౌన్సిలర్ ను కలవడం చూపించారు.
తమ మధ్య బంధంలో సమస్యతో వాళ్లు ఆమె దగ్గరికి వెళ్తారు. ఆ తర్వాత కథ వెనక్కి వెళ్తుంది. అసలు ఈస్ట్ గోదావరి అబ్బాయి అయిన ఆనంద్, వెస్ట్ గోదావరి అమ్మాయి అయిన లహరి మధ్య ఎలా కుదిరిందో చూపించారు. ఉద్యోగం సరిపడదనుకొని తన సొంతూరిలోనే ఉండాలనుకునే అబ్బాయి.. ఎలాగైనా ఉద్యోగం సంపాదించి సొంతూరి నుంచి వెళ్లిపోవాలనుకునే అమ్మాయి మధ్య పెళ్లి కుదిరితే ఎలా ఉంటుందన్నదే ఈ ఆనందలహరి వెబ్ సిరీస్ స్టోరీగా కనిపిస్తోంది.
ఆనందలహరి వెబ్ సిరీస్ గురించి..
ఆహా వీడియో ఓటీటీ చాలా రోజుల తర్వాత మరో తెలుగు రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్ ను ఈ ఆనందలహరి ద్వారా తీసుకొస్తోంది. ఈ సిరీస్ ను సాయి వానపల్లి డైరెక్ట్ చేశాడు. కథ, స్క్రీన్ ప్లే కూడా అతనిదే. ప్రవీణ్ ధర్మపురి నిర్మాతగా ఉన్నాడు. “ఈస్ట్ గోదావరి అబ్బాయి ప్లస్ వెస్ట్ గోదావరి అమ్మాయి = ఫుల్ డ్రామా, ఫన్, ఫ్యామిలీ ఫైట్స్.. రెండు ప్రపంచాల మధ్య పెళ్లి.. ఆనందలహరి స్టోరీ ఓ పాన్ గోదావరి రోలర్‌కోస్టర్.
అక్టోబర్ 17న ప్రేమ, యుద్ధం, ఫ్లెక్సీ రాజు స్టైల్లో ఈస్ట్.. వెస్ట్ ను కలవడం చూడండి” అనే క్యాప్షన్ తో ఆహా వీడియో ఓటీటీ ట్వీట్ చేసింది. ఈ వెబ్ సిరీస్ లో అభిషేక్, భ్రమరాంబిక లీడ్ రోల్స్ లో నటించారు. మరి అక్టోబర్ 17 నుంచి ఆహా వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న ఈ వెబ్ సిరీస్ కు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


