అది త్యాగం కాదు చేతగానితనం.. అతడు రెండు నెలల్లో పార్టీ మూసేస్తాడు.. సినిమా వాళ్లంతే: కమల్, విజయ్‌లపై షాకింగ్ కామెంట్స్
After Kamal Haasan's Makkal Needhi Maiam decided not to contest polls and support DMK-led alliance, criticism has been pouring in for the actor-politician.
తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. ఏప్రిల్ 23న జరగబోయే అసెంబ్లీ ఎన్నికల వేడి అక్కడ అప్పుడే మొదలైపోయింది. ఈ ఎలక్షన్స్ కు సరిగ్గా నెల రోజుల ముందు నటుడు, రాజ్యసభ ఎంపీ అయిన కమల్ హాసన్ ఒక కీలక ప్రకటన చేశారు. తన పార్టీ మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) ఈసారి ఎన్నికల్లో పోటీ చేయదని, అధికార డీఎంకే (ద్రవిడ మున్నేట్ర కజగం) కూటమికి కేవలం మద్దతు మాత్రమే ఇస్తుందని ఆయన స్పష్టం చేశారు.

మరోవైపు దళపతి విజయ్ తన 'తమిళగ వెట్రి కజగం' (టీవీకే) పార్టీతో తొలిసారిగా ఈ ఎన్నికల బరిలో దిగుతున్నాడు. ఈ నేపథ్యంలో, ప్రతిపక్ష అన్నాడీఎంకే (ఏఐఏడీఎంకే) అధికార ప్రతినిధి కోవై సత్యన్ ఈ ఇద్దరు స్టార్ హీరోల పైనా గట్టిగా సెటైర్లు వేశారు.
కమల్, విజయ్‌లపై అన్నాడీఎంకే ఫైర్..
అన్నాడీఎంకే అధికార ప్రతినిధి సత్యన్ రీసెంట్‌గా ఒక వీడియో రిలీజ్ చేసి కమల్ హాసన్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. "అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకూడదన్న కమల్ హాసన్ నిర్ణయం ఏమాత్రం త్యాగం కాదు, అది పూర్తిగా ఆయన చేతకానితనం. వెండితెర మీద కనిపించే నటులతో వచ్చే అసలు సమస్య ఇదే. కెమెరా ముందు తాము ఏ డైలాగులు చెబితే, పబ్లిక్ లైఫ్‌లో కూడా అదే వర్కౌట్ అవుతుందని వాళ్లు భ్రమపడుతుంటారు" అని సత్యన్ విమర్శించారు.
"రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు మంచి చేయాలంటే దానికి తగ్గ పొలిటికల్ నాలెడ్జ్, లీడర్‌షిప్ క్వాలిటీస్ ఉండాలి. కానీ దురదృష్టవశాత్తూ సినిమాల్లో నుంచి పబ్లిక్ లైఫ్‌లోకి రావాలనుకునే చాలామందికి ఆ నాయకత్వ లక్షణాలు అస్సలు ఉండవు" అని ఆయన తేల్చి చెప్పారు.
ఇక విజయ్ గురించి కూడా మాట్లాడుతూ.. "సినిమాల్లో హీరోలుగా వెలిగిపోయి, ఆ తర్వాత రాజకీయ పార్టీలు పెట్టి త్వరగానే దుకాణం సర్దేసిన వాళ్లని మనం చాలామందినే చూశాం. అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన ఒకట్రెండు నెలల్లోనే విజయ్ కూడా అదే దారిలో వెళ్తాడని మేం ఆశిస్తున్నాం" అంటూ సత్యన్ సెటైర్లు వేశారు.
కమల్ నిర్ణయం 'నిస్వార్థ త్యాగం' అన్న డీఎంకే..
అసలు అన్నాడీఎంకే నేత సత్యన్ ఈ కామెంట్స్ చేయడానికి మెయిన్ రీజన్ అధికార డీఎంకే పార్టీనే. కమల్ హాసన్ పోటీ నుంచి తప్పుకున్నప్పుడు, డీఎంకే దాన్ని 'నిస్వార్థ త్యాగం' అని పొగిడింది. డీఎంకే అధికార ప్రతినిధి శరవణన్ అన్నాదురై మాట్లాడుతూ.. "మా నాయకుడు ఎంకే స్టాలిన్ ఈ నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానించారు. కమల్ హాసన్ తమిళనాడు రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను, సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని తీసుకున్న ఈ నిర్ణయం ఒక చారిత్రాత్మకమైన, నిస్వార్థమైన త్యాగం అని సీఎం స్టాలిన్ అభివర్ణించారు" అని చెప్పారు.
మా స్టాండ్ అదే.. కమల్ హాసన్ క్లారిటీ
మంగళవారం (మార్చి 24) మీడియాతో మాట్లాడిన కమల్ హాసన్.. "మేం డీఎంకే కూటమికి బయట నుంచి చాలా స్ట్రాంగ్‌గా సపోర్ట్ చేస్తాం. మేం కచ్చితంగా గెలుస్తాం. మా పార్టీ కార్యకర్తలకు నా విజన్ ఏంటో తెలుసు, వాళ్లు దాన్నే ఫాలో అవుతారు. మేం సెంట్రిస్ట్. మేం ఏ ఒక్క వైపుకూ మొగ్గు చూపబోమని మాకు తెలుసు" అని క్లారిటీ ఇచ్చారు.
నిజానికి ఎన్నికల్లో పొత్తు గురించి డీఎంకేతో చర్చలు జరుగుతున్నాయా అని విలేకరులు అడిగిన కొన్ని రోజులకే కమల్ ఈ కామెంట్స్ చేయడం విశేషం. అలాగే టీవీకే పార్టీతో ఎన్నికల్లో పోటీ చేస్తున్న విజయ్ గురించి అడిగినప్పుడు కూడా కమల్ కొంచెం తేలిగ్గానే స్పందించారు. "నాకెందుకు ఆ ఇంట్రెస్ట్? నాకు బోలెడు పనులున్నాయి, నా పనుల మీద నేను ఫోకస్ చేయాలి" అంటూ విజయ్ రాజకీయ ప్రవేశం మీద ఆయన కామెంట్ చేశారు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


