రెండు ఓటీటీల్లోకి తెలుగులో వస్తున్న అర్జున్, ఐశ్వర్య రాజేష్ తమిళ క్రైమ్ థ్రిల్లర్.. మర్డర్ మిస్టరీ చుట్టూ తిరుగుతూ..

ఓటీటీలోకి హిట్ తమిళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ తెలుగులో స్ట్రీమింగ్ కు వస్తోంది. అది కూడా రెండు ఓటీటీల్లోకి కావడం విశేషం. సన్ నెక్ట్స్ ఓటీటీ ఈ సినిమా తెలుగు టీజర్ రిలీజ్ చేస్తూ మూవీ స్ట్రీమింగ్ తేదీని వెల్లడించింది. ఇదో మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ కావడం విశేషం.

Published on: Dec 17, 2025, 15:21:57 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

అర్జున్ సర్జ, ఐశ్వర్య రాజేష్ లీడ్ రోల్స్ లో నటించిన తమిళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ తీయావర్ కులైగల్ నడుంగ. గత నెలలో థియేటర్లలో రిలీజైన ఈ సినిమా ఇప్పుడు తెలుగులో ఓటీటీలోకి అడుగుపెడుతోంది. ఈ మూవీ తెలుగు టీజర్ ను సన్ నెక్ట్స్ ఓటీటీ బుధవారం (డిసెంబర్ 17) తన ఎక్స్ అకౌంట్ లో షేర్ చేసింది. అటు ఆహా వీడియోలోనూ ఈ సినిమా రానుంది.

రెండు ఓటీటీల్లోకి తెలుగులో వస్తున్న అర్జున్, ఐశ్వర్య రాజేష్ తమిళ క్రైమ్ థ్రిల్లర్.. మర్డర్ మిస్టరీ చుట్టూ తిరుగుతూ..
రెండు ఓటీటీల్లోకి తెలుగులో వస్తున్న అర్జున్, ఐశ్వర్య రాజేష్ తమిళ క్రైమ్ థ్రిల్లర్.. మర్డర్ మిస్టరీ చుట్టూ తిరుగుతూ..

మఫ్టీ పోలీస్ ఓటీటీ రిలీజ్ డేట్

తమిళంలో తీయావర్ కులైగల్ నడుంగ పేరుతో రిలీజైన ఈ సినిమాను తెలుగులో మఫ్టీ పోలీస్ పేరుతో తీసుకొస్తున్నారు. ఈ సినిమా శుక్రవారం అంటే డిసెంబర్ 19 నుంచి స్ట్రీమింగ్ కు రానుంది. “ఒంటిపై యూనిఫాం తీసేస్తే.. లోపల ఉన్న ఫైర్ బయటకు వస్తుంది. మఫ్టీ పోలీస్ డిసెంబర్ 19న సన్ నెక్ట్స్ లో చూడండి” అనే క్యాప్సన్ తో ట్వీట్ చేసింది. ఇప్పటికే తమిళ వెర్షన్ ఆ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

మఫ్టీ పోలీస్ మూవీ స్టోరీ ఇదే..

విలాసవంతమైన అపార్ట్‌మెంట్‌లో జరిగిన హత్య చుట్టూ తిరిగే ఇంటెన్స్ మర్డర్ మిస్టరీగా ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో ఎంతో అనుభవం గల ఇన్‌స్పెక్టర్ మగుడపాటి పాత్రలో అర్జున్ సర్జ ఆకట్టుకున్నాడు. క్రైమ్, మర్డర్, ఇన్వెస్టిగేషన్, మిస్టరీ, లవ్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు.

నవంబర్ 21న థియేటర్లలో విడుదలైన తీయావర్ కులైగల్ నడుంగ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఐఎమ్‌డీబీ నుంచి పదికి 8 రేటింగ్ సొంతం చేసుకుంది. అప్పుడే తెలుగులో మఫ్టీ పోలీస్ టైటిల్‌తో రిలీజ్ చేశారు. కానీ అంతగా రెస్పాన్స్ రాలేదు.

ఈ మఫ్టీ పోలీస్ సినిమాకు దినేష్ లక్ష్మణన్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీలో అర్జున్ సర్జ, ఐశ్వర్య రాజేష్‌తోపాటు ప్రవీణ్ రాజా, అభిరామి వెంకటాచలం, అనికా రాధాకృష్ణన్, రామ్ కుమార్ గణేషన్, వేల రామమూర్తి, ప్రాంక్‌స్టార్ రాహుల్, తంగుదురై తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు.

ఆకట్టుకునే ట్విస్టులు

ఈ మఫ్టీ పోలీస్ సినిమాను రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కించారు. ఒక అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో జరిగిన హత్యా నేరం చుట్టూ కథ నడుస్తుంది. ఒక అర్థరాత్రి రచయిత జెబా దారుణంగా హత్యకు గురవుతారు.

ఈ కేసు విచారణ బాధ్యతలను ఇన్‌స్పెక్టర్ మాగుడపాటి (అర్జున్ సర్జ) తీసుకుంటాడు. అయితే అపార్ట్‌మెంట్‌లోని ప్రతి ఒక్కరు అనుమానితులుగా ఉంటారు. మరి ఎస్సై వారిలో అసలైన నిందితుడుని పట్టుకున్నారా? ఎవరు హత్య చేశారు? అనుమానితుల నుంచి బయటపడిన రహస్యాలు ఏంటీ? అనేది తెలియాలంటే ఈ మఫ్టీ పోలీస్ సినిమా చూడాల్సిందే.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More