బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే మాస్, పవర్‌ఫుల్ యాక్షన్, డైలాగులు కామనే. అయితే అఖండ 2 ట్రైలర్ మాత్రం మరో అడుగు ముందుకేసింది. ఈసారి ఆ మాస్ స్టోరీకి దేశభక్తి, సనాతన ధర్మం టచ్ ఇచ్చి మరో లెవెల్ కు తీసుకెళ్లారు. అఖండ 2 ట్రైలర్ చూస్తుంటే ఈసారి బాక్సాఫీస్ పై సర్జికల్ స్ట్రైక్స్ ఖాయంగా కనిపిస్తున్నాయి.
అఖండ 2 ట్రైలర్ రిలీజ్

బాలకృష్ణ, సంయుక్త లీడ్ రోల్స్ లో నటిస్తున్న అఖండ 2 మూవీ డిసెంబర్ 5న రిలీజ్ కానుండగా.. రెండు వారాల ముందే ట్రైలర్ రిలీజ్ చేశారు. శుక్రవారం (నవంబర్ 21) ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ కాగా.. దీనికి ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. తొలిసారి అఘోరా రూపంలో బాలయ్య నట విశ్వరూపం చూపించబోతున్నట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. కష్టం వచ్చినా దేవుడు రాడు అని జనం నమ్మిన రోజు భారతదేశం తునాతునకలు అవుతుందన్న డైలాగుతో అఖండ 2 ట్రైలర్ మొదలవుతుంది.
ఆ తర్వాత సీన్ మహా కుంభమేళాకు మళ్లుతుంది. బాలయ్య ఎంట్రీ తర్వాత విలన్ రూపంలో ఆది పినిశెట్టి పవర్‌ఫుల్ లుక్ రివీల్ చేశారు. బాలకృష్ణకు అదే స్థాయిలో విలనీని ఆది పండించినట్లుగా కనిపిస్తోంది. ఇక బాలకృష్ణ రెండు వేర్వేరు రోల్స్ లోనూ చాలా శక్తివంతంగా కనిపించాడు. ముఖ్యంగా అఘోరా రూపంలో అతడు చెప్పిన డైలాగ్స్ అదిరిపోయాయి.
సర్జికల్ స్ట్రైక్స్ అంటూ..
ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లినా అక్కడో మతం కనిపిస్తుంది.. మా దేశంలో మాత్రం ధర్మం కనిపిస్తుంది.. సనాతన హైందవ ధర్మం అనే డైలాగుతోపాటు.. దేశం జోలికి వస్తే మీరు దండిస్తారు.. ధర్మం జోలికి వస్తే మేం ఖండిస్తాం.. మీ భాషలో చెప్పాలంటే సర్జికల్ స్ట్రైక్స్ అంటూ బాలయ్య అనడం గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. ఇక ట్రైలర్ చివర్లో మరో పవర్ ఫుల్ డైలాగ్ ఉంది. ఇంతకాలం ప్రపంచపటంలో ఈ దేశం రూపాన్ని మాత్రమే చూసుంటావ్.. మా దేశ విశ్వరూపాన్ని చూసుండవ్.. మేమంతా ఒక్కసారి లేచి శబ్దం చేస్తే ఈ ప్రపంచమే నిశ్శబ్దం అనే డైలాగుతో ట్రైలర్ ముగుస్తుంది.
ఈసారి బోయపాటి శ్రీను తన సినిమాకు దేశభక్తి, సనాతన ధర్మం అనే హాట్ టాపిక్స్ జోడించి అఖండ 2ను మరింత ఆసక్తికరంగా మార్చాడు. ఈ సినిమా డిసెంబర్ 5న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇప్పటికే సింహా, లెజెండ్, అఖండతో హ్యాట్రిక్ సాధించిన ఈ జోడీ.. అఖండ 2తో ఆ జైత్రయాత్రను కొనసాగించడం ఖాయంగా కనిపిస్తోంది. తమన్ మరోసారి బీజీఎంతో ఆకట్టుకున్నాడు.
{{/usCountry}}ఈసారి బోయపాటి శ్రీను తన సినిమాకు దేశభక్తి, సనాతన ధర్మం అనే హాట్ టాపిక్స్ జోడించి అఖండ 2ను మరింత ఆసక్తికరంగా మార్చాడు. ఈ సినిమా డిసెంబర్ 5న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇప్పటికే సింహా, లెజెండ్, అఖండతో హ్యాట్రిక్ సాధించిన ఈ జోడీ.. అఖండ 2తో ఆ జైత్రయాత్రను కొనసాగించడం ఖాయంగా కనిపిస్తోంది. తమన్ మరోసారి బీజీఎంతో ఆకట్టుకున్నాడు.
{{/usCountry}}