Akhil Nagarjuna: నాగార్జున కాళ్లపై పడి వెక్కి వెక్కి ఏడ్చిన అఖిల్.. తండ్రిని గట్టిగా హగ్ చేసుకొని ఎమోషనల్.. వీడియో

Akhil Nagarjuna: అఖిల్ అక్కినేని కంటతడి పెట్టాడు. చాలా రోజుల తర్వాత లెనిన్ రూపంలో ఓ సక్సెస్ దక్కడంతో బాగా ఎమోషనల్ అయిపోయి తండ్రి నాగార్జున కాళ్లపై పడి, అతన్ని హగ్ చేసుకున్నాడు. నాగార్జున కూడా ఎమోషనల్ గా కనిపించాడు.

Published on: Jul 10, 2026, 19:27:41 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Akhil Nagarjuna: అఖిల్ అక్కినేని, నాగార్జున మధ్య జరిగిన ఎమోషనల్ సీన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లెనిస్ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ లో అఖిల్ బాగా ఎమోషనల్ అవడం చూస్తుంటే.. ఈ సక్సెస్ కోసం అతడు ఎంతలా ఆరాటపడ్డాడో అర్థమవుతుంది.

Akhil Nagarjuna: నాగార్జున కాళ్లపై పడి వెక్కి వెక్కి ఏడ్చిన అఖిల్.. తండ్రిని గట్టిగా హగ్ చేసుకొని ఎమోషనల్.. వీడియో
Akhil Nagarjuna: నాగార్జున కాళ్లపై పడి వెక్కి వెక్కి ఏడ్చిన అఖిల్.. తండ్రిని గట్టిగా హగ్ చేసుకొని ఎమోషనల్.. వీడియో

అఖిల్ వెక్కి వెక్కి ఏడ్చి..

లెనిన్ రూపంలో ఎట్టకేలకు అక్కినేని అఖిల్ కు సాలిడ్ హిట్ పడినట్లే కనిపిస్తోంది. ఎన్నో ఏళ్లుగా బాక్సాఫీస్ దగ్గర సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న ఈ యంగ్ హీరో.. ‘లెనిన్’తో సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్నాడు. సినిమాకు ఫస్ట్ షో నుంచే డీసెంట్ రివ్యూలు, పాజిటివ్ మౌత్ టాక్ రావడంతో అక్కినేని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ రాబట్టడంతో చిత్ర యూనిట్ గ్రాండ్ గా సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించింది. ఈ ఈవెంట్ కు కింగ్ నాగార్జున స్పెషల్ గెస్ట్ గా వచ్చి కేక్ కట్ చేసి టీమ్ కు కంగ్రాట్స్ చెప్పారు. అయితే ఈ క్రమంలో ఒక ఎమోషనల్ సీన్ అందరి హృదయాలను టచ్ చేసింది. నాగార్జున కేక్ కట్ చేయగానే.. అఖిల్ తన ఎమోషన్స్ ను ఏమాత్రం ఆపుకోలేకపోయాడు.

వెంటనే వెళ్లి తండ్రి నాగార్జున కాళ్లపై పడి ఆశీర్వాదం తీసుకున్నాడు. ఆ తర్వాత నాగార్జునను గట్టిగా హత్తుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు. అఖిల్ కళ్లలో నీళ్లు చూసి అక్కడున్న వాళ్లంతా బాగా ఎమోషనల్ అయ్యారు. ఒక స్టార్ కిడ్ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినా.. కెరీర్ స్టార్టింగ్ నుంచి అఖిల్ కు అదృష్టం పెద్దగా కలిసి రాలేదు.

ఇన్నేళ్ల నిరీక్షణకు దక్కిన ప్రతిఫలం

చివరికి అతడు నటించిన 'ఏజెంట్' మూవీ రిజల్ట్ అతన్ని ఎంతలా నిరాశ పరిచిందో మనందరికీ తెలిసిందే. అందుకే ఇన్నేళ్ల నిరీక్షణ తర్వాత వచ్చిన ఈ డీసెంట్ సక్సెస్ తో అఖిల్ ఒక్కసారిగా తనలోని బాధనంతా కన్నీళ్ల రూపంలో బయటపెట్టాడు. నాగార్జున, అఖిల్ హత్తుకున్న ఈ ఆఫ్-స్క్రీన్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషనల్ గా మారింది.

అక్కినేని ఫ్యాన్స్ మాత్రమే కాదు.. సాధారణ ఆడియన్స్ కూడా అఖిల్ హిట్ కొట్టడం పట్ల చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సినిమా రిలీజ్ కు ముందే అఖిల్ కు ఇండస్ట్రీ నుంచి మంచి సపోర్ట్ లభించింది. సోషల్ మీడియాలో సమంత లాంటి స్టార్స్ 'బిగ్ బ్లాక్ బస్టర్ వైబ్స్' అంటూ అఖిల్ కు, లెనిన్ టీమ్ కు బెస్ట్ విషెస్ చెప్పారు. ఇప్పుడు ఆ నమ్మకమే నిజమై సినిమా మంచి థియేట్రికల్ రన్ ను సొంతం చేసుకుంటోంది.

లెనిన్‌కు పాజిటివ్ టాక్

లెనిన్ మూవీ శుక్రవారం (జులై 10) ప్రేక్షకుల ముందుకు రాగా.. తొలి షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాలో అఖిల్ సరసన యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించింది. తన అందం, క్యూట్ పర్ఫార్మెన్స్ తో ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంది. అఖిల్, భాగ్యశ్రీ మధ్య వచ్చే ఎపిసోడ్స్ యూత్ కు బాగా కనెక్ట్ అయ్యాయి.

డైరెక్టర్ మురళీ కిషోర్ అబ్బూరు ఈ సినిమాను చాలా గ్రిప్పింగ్ గా తెరకెక్కించాడు. ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు మెయిన్ పిల్లర్ గా నిలిచింది. వీకెండ్ బుకింగ్స్ సైతం అడ్వాన్స్ గానే ఫుల్ అవ్వడంతో 'లెనిన్' బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు రాబట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More