...
...
Next Story

Lenin OTT: అయ్యగారి ర్యాంపేజ్ కంటిన్యూస్.. ఓటీటీలో నయా స్ట్రీమింగ్ రికార్డు.. టీవీ ప్రీమియర్ డేట్ ఇదే

Lenin OTT: ఓటీటీలో అఖిల్ అక్కినేని లెనిన్ మూవీ రికార్డుల పరంపర కొనసాగుతోంది. ఈ సినిమా జీ5 ఓటీటీలో 250 మిలియన్ స్ట్రీమింగ్ మినట్స్ రికార్డు అందుకుంది. అదే సమయంలో ఇక టీవీ ప్రీమియర్ కు కూడా సిద్ధమైంది.

Published on: Aug 20, 2026, 19:23:19 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Lenin OTT: అయ్యగారు అఖిల్ అక్కినేని ర్యాంపేజ్ మామూలుగా లేదు. థియేటర్లలో రూ.100 కోట్లకుపైగా వసూళ్లతో బ్లాక్‌బస్టర్ గా నిలిచిన లెనిన్ మూవీ ఓటీటీలో అంతకు మించిన రెస్పాన్స్ తో దూసుకెళ్తోంది. ఆగస్ట్ 7 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా.. 13 రోజుల్లోనే ఊహకందని రికార్డును సొంతం చేసుకుంది.

లెనిన్ @ 250 మిలియన్ స్ట్రీమింగ్ మినట్స్

Lenin OTT: అయ్యగారి ర్యాంపేజ్ కంటిన్యూస్.. ఓటీటీలో నయా స్ట్రీమింగ్ రికార్డు.. టీవీ ప్రీమియర్ డేట్ ఇదే
Lenin OTT: అయ్యగారి ర్యాంపేజ్ కంటిన్యూస్.. ఓటీటీలో నయా స్ట్రీమింగ్ రికార్డు.. టీవీ ప్రీమియర్ డేట్ ఇదే

లెనిన్ మూవీ జీ5 ఓటీటీలో సాధించిన రికార్డును ఆ ప్లాట్‌ఫామ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. “అయ్యగారి ర్యాంపేజ్ కంటిన్యూస్.. 250 మిలియన్ ప్లస్ స్ట్రీమింగ్ మినట్స్ అండ్ కౌంటింగ్.. బ్లాక్‌బస్టర్ లెనిన్ ఇప్పుడు కేవలం జీ5 తెలుగులో స్ట్రీమింగ్” అనే క్యాప్షన్ తో ట్వీట్ చేసింది. ఈ సినిమా ప్రస్తుతం తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. హిందీ వెర్షన్ పై ఇంకా ఎలాంటి అప్డేట్ లేదు.

లెనిన్ టీవీ ప్రీమియర్ డేట్

థియేటర్లు, ఓటీటీలో తన ర్యాంపేజ్ పూర్తయిన తర్వాత ఇక ఇప్పుడు టీవీలో అఖిల్ తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. లెనిన్ మూవీ టీవీ ప్రీమియర్ డేట్ కూడా కన్ఫమ్ అయింది. ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్ జీ తెలుగు (ZEE Telugu)లో ఆగస్టు 30, 2026 సాయంత్రం 5:30 గంటలకు ఈ సినిమా సాటిలైట్ ప్రీమియర్ కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

మురళి కిషోర్ మేకింగ్.. అఖిల్ పవర్‌ఫుల్ కంబ్యాక్

కొన్నేళ్లుగా సరైన మాస్ హిట్ కోసం ఎదురుచూస్తున్న అఖిల్ అక్కినేనికి ఈ లెనిన్ సినిమా ఒక డ్రీమ్ కంబ్యాక్‌గా నిలిచింది. డెబ్యూ డైరెక్టర్ మురళి కిషోర్ అబ్బూరు రాసిన రా అండ్ రస్టిక్ కథ, ప్రతి సన్నివేశాన్ని తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఎస్. తమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, పాటలు అతిపెద్ద ప్లస్ పాయింట్‌గా నిలిచాయి. ప్రతి యాక్షన్ సీక్వెన్స్‌లోనూ తమన్ తన రీ-రికార్డింగ్‌తో థియేటర్లలో విపరీతమైన హైప్ క్రియేట్ చేశారు.

హీరోయిన్ గా నటించిన భాగ్యశ్రీ బోర్సే తన అందం, అభినయంతో కుర్రకారును కట్టిపడేసింది. అఖిల్, భాగ్యశ్రీల మధ్య వచ్చే లవ్ ట్రాక్, ఎమోషనల్ సీన్లు సినిమాలో చాలా సహజంగా కుదిరాయి. ప్రమోద్ పంజు, శివాజీ, ఈశ్వరీ రావు, సునీల్, బ్రహ్మాజీ తమ నటనతో కథలోని డెప్త్‌ని మరింత పెంచారు.

నాగార్జున, నాగవంశీ నిర్మాణ విలువల ప్రశంసలు

అక్కినేని నాగార్జున (మనం ఎంటర్‌టైన్‌మెంట్స్), సూర్యదేవర నాగవంశీ (సితార ఎంటర్‌టైన్‌మెంట్స్) సంయుక్తంగా ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించారు. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించిన ఈ ప్రాజెక్ట్ విజువల్స్ పరంగా రిచ్ క్వాలిటీతో ప్రేక్షకులను అలరించింది.

బాక్సాఫీస్ వద్ద అఖిల్ కెరీర్‌లోనే హయ్యెస్ట్ గ్రాసర్ మూవీగా రికార్డు సృష్టించిన ఈ యాక్షన్ డ్రామా, ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యాక కూడా అదే స్థాయిలో ఆదరణ పొందింది. ఇప్పుడు పండుగ వాతావరణంలో వీకెండ్ రోజున బుల్లితెరపై వస్తుండటంతో ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా ఈ మాస్ ఎంటర్‌టైనర్‌ను వీక్షించేందుకు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఆగస్టు 30 సాయంత్రం 5:30 గంటలకు జీ తెలుగు ఛానెల్‌లో ఈ విజువల్ మాస్ ఎంటర్‌టైనర్‌ను మిస్ కాకుండా చూడండి.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks