Lenin Box Office: బాక్సాఫీస్ దగ్గర అఖిల్ విశ్వరూపం.. మూడు రోజుల్లో లెనిన్ ఎన్ని కోట్లు వసూలు చేసిందంటే?

Lenin Box Office: అఖిల్ అక్కినేని లెనిన్ మూవీతో కెరీర్ బెస్ట్ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లు అందుకున్నాడు. ఈ సినిమాకు తొలి రోజు నుంచే వస్తున్న పాజిటివ్ టాక్ కారణంగా తొలి మూడు రోజుల్లోనే ఈ సినిమా రూ.60 కోట్లకుపైగా వసూలు చేయడం విశేషం.

Published on: Jul 13, 2026, 11:48:02 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Lenin Box Office Collection: కెరీర్ స్టార్టింగ్ నుంచి ఒక సాలిడ్ బ్లాక్ బస్టర్ కోసం వెయిట్ చేస్తున్న అఖిల్ అక్కినేని ఎట్టకేలకు 'లెనిన్' మూవీతో బాక్సాఫీస్ దగ్గర విశ్వరూపం చూపిస్తున్నాడు. మురళీ కిషోర్ అబ్బూరు డైరెక్షన్‌లో వచ్చిన ఈ పీరియడ్ రూరల్ రివెంజ్ డ్రామా థియేటర్లలో కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ రావడంతో ఆడియన్స్ థియేటర్లకు క్యూ కడుతున్నారు.

Lenin Box Office: బాక్సాఫీస్ దగ్గర అఖిల్ విశ్వరూపం.. మూడు రోజుల్లో లెనిన్ ఎన్ని కోట్లు వసూలు చేసిందంటే?
Lenin Box Office: బాక్సాఫీస్ దగ్గర అఖిల్ విశ్వరూపం.. మూడు రోజుల్లో లెనిన్ ఎన్ని కోట్లు వసూలు చేసిందంటే?

మూడు రోజుల గ్రాస్ ఇలా..

రిలీజ్ రోజే సెన్సేషనల్ టాక్ తెచ్చుకున్న లెనిన్ సినిమా.. ఫస్ట్ వీకెండ్ పూర్తయ్యేసరికి తన దూకుడును కంటిన్యూ చేస్తోంది. ట్రేడ్ పండితుల అంచనాలను తలకిందులు చేస్తూ 'లెనిన్' కేవలం మూడు రోజుల్లోనే వరల్డ్ వైడ్‌గా రూ.61.1 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి టాలీవుడ్ రికార్డులను షేక్ చేస్తోంది.

ఇక్కడ ఇంకో మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. రెగ్యులర్ టికెట్ రేట్స్ ఉన్నప్పటికీ, ఫస్ట్ రెండు రోజుల కంటే మూడో రోజు కలెక్షన్స్ భారీగా పెరిగాయి. దీనిని బట్టి ఈ సినిమాకు పబ్లిక్ లో ఎలాంటి అద్భుతమైన మౌత్ టాక్ వచ్చిందో ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు యూత్ అంతా రిపీటెడ్ గా సినిమా చూస్తున్నారు.

మనోడు బ్లాక్‌బస్టర్ కొట్టేశాడు

లెనిన్ మూవీ మూడు రోజుల బాక్సాఫీస్ వసూళ్ల గురించి ప్రొడ్యూసర్ నాగవంశీ అధికారికంగా అనౌన్స్ చేశాడు. మనోడు బ్లాక్‌బస్టర్ కొట్టేశాడు అని రాసి ఉన్న పోస్టర్ తో ఓ పోస్ట్ చేశాడు. అంతేకాదు ఓ సుదీర్ఘ ఎమోషనల్ నోట్ కూడా రాశాడు. ఏడాదిన్నర కిందట మొదలైన ఈ సినిమా ప్రయాణం గురించి గుర్తు చేసుకున్నాడు.

ఇవాళ ఫస్ట్ వీకెండ్ లోనే డిస్ట్రిబ్యూటర్లు తమ పెట్టుబడులు తిరిగి రాబట్టుకోవడం, ఎగ్జిబిటర్లు హౌజ్‌ఫుల్ బోర్డులతో సంతోషంగా ఉండటం చూస్తే అంతకన్నా ఆనందం తనకు మరొకటి ఉండదని నాగవంశీ అన్నాడు. తమకు అసలైన సక్సెస్ అంటే ఇదే అని చెప్పాడు.

అఖిల్ కెరీర్ బెస్ట్ కంబ్యాక్

ఈ భారీ సక్సెస్ అఖిల్ అక్కినేనికి కెరీర్ పరంగా పెద్ద బ్రేక్ అని చెప్పాలి. ఎప్పట్నుంచో తను ఎదురుచూస్తున్న ఆ మాస్ కంబ్యాక్ ఈ సినిమాతో పర్ఫెక్ట్‌గా సెట్ అయింది. యాక్షన్ సీక్వెన్స్‌లో అఖిల్ చూపించిన ఇంటెన్సిటీ, స్క్రీన్ ప్రెజెన్స్ ఆడియన్స్‌కు గూస్‌బంప్స్ తెప్పిస్తున్నాయి. క్యారెక్టర్ లో పరకాయ ప్రవేశం చేసి తన యాక్టింగ్ స్కిల్స్‌తో విమర్శకుల నోరు మూయించాడు.

ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన భాగ్యశ్రీ బోర్సే తన గ్లామర్ తో పాటు క్యూట్ యాక్టింగ్ తోనూ కుర్రకారును ఆకట్టుకుంది. అఖిల్, భాగ్యశ్రీ మధ్య ఉన్న ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్ అయింది. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ కథలో ఎమోషన్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి.

అదరగొట్టిన తమన్ బీజీఎం

మరోవైపు ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను కింగ్ నాగార్జున అక్కినేని, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత నాగవంశీ కలిసి జాయింట్‌గా ప్రొడ్యూస్ చేశారు. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ ప్రొడక్షన్ వాల్యూస్‌తో ఈ ఇంటెన్స్ యాక్షన్ డ్రామాను ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చారు. ఇక సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఇచ్చిన బీజీఎం థియేటర్లలో మాస్ ఆడియన్స్‌కు పూనకాలు తెప్పిస్తోంది.

ఫస్ట్ వీకెండ్ లోనే అదిరిపోయే నంబర్స్ నమోదు చేసిన ‘లెనిన్’ మూవీకి సోమవారం నుంచి అసలు పరీక్ష ఎదురు కానుంది. మెల్లగా ఇలాగే దూకుడు కొనసాగిస్తూ రూ.100 కోట్ల క్లబ్ లో చేరుతుందా లేదా అన్నది చూడాలి. అదే జరిగితే ఏజెంట్ డిజాస్టర్ తాలూకు బాధ నుంచి అఖిల్, అక్కినేని అభిమానులు బయటపడే అవకాశం ఉంటుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More