Lenin Collection: రెండో రోజు ఏకంగా 14 శాతం పెరిగిన లెనిన్ కలెక్షన్స్.. అక్కినేని అఖిల్ మూవీ వరల్డ్ వైడ్ వసూళ్లు ఎంతంటే?
Lenin Box Office Collection Day 2: అక్కినేని అఖిల్ మాస్ యాక్షన్ డ్రామా 'లెనిన్' బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. మొదటి రోజు కంటే రెండో రోజు శనివారం కలెక్షన్లలో ఏకంగా 14 శాతం వృద్ధి నమోదు చేసింది. మరి రెండు రోజుల్లో వరల్డ్ వైడ్‌గా లెనిన్ మూవీకి వచ్చిన కలెక్షన్స్ ఎంతో ఇక్కడ తెలుసుకుందాం.
Lenin Worldwide Box Office Collection Day 2: అక్కినేని వారసుడు అఖిల్ నటించిన లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'లెనిన్' థియేటర్లలో సందడి చేస్తోంది. పాజిటివ్ టాక్‌తో మొదటి రోజును ముగించిన ఈ చిత్రం, శనివారం (జూలై 12) రెండో రోజు బాక్సాఫీస్ వద్ద మరింత పట్టు సాధించింది. వీకెండ్ కావడంతో ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టారు. దీంతో కలెక్షన్లలో భారీ వృద్ధి కనిపించింది.

14 శాతం వృద్ధి
ప్రముఖ ట్రేడ్ నివేదికల ప్రకారం.. లెనిన్ చిత్రం రెండో రోజు ఇండియాలో సుమారు రూ. 8.15 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. మొదటి రోజు వచ్చిన రూ. 7.15 కోట్ల నెట్ కలెక్షన్లతో పోలిస్తే ఇది ఏకంగా 14 శాతం ఎక్కువ కావడం విశేషం.
'ఏజెంట్' వంటి భారీ పరాజయం తర్వాత దాదాపు మూడేళ్ల విరామం తీసుకుని అక్కినేని అఖిల్ చేసిన సరికొత్త ప్రయోగం ఇది. అఖిల్ కెరీర్‌లోనే మొదటిసారి పక్కా రూరల్ బ్యాక్‌డ్రాప్ (గ్రామీణ నేపథ్యం) కథను ఎంచుకోవడంతో ట్రేడ్ వర్గాల్లో ముందే అంచనాలు భారీగా ఉన్నాయి.
ఆ అంచనాలకు తగ్గట్టే దేశవ్యాప్తంగా 2,099 షోలలో ఈ చిత్రం సత్తా చాటింది. రెండు రోజులు ముగిసేసరికి భారత బాక్సాఫీస్ వద్ద లెనిన్ సినిమా మొత్తం రూ. 15.30 కోట్ల నెట్ వసూళ్లను తన ఖాతాలో వేసుకుంది.
ప్రపంచవ్యాప్తంగా రూ. 23 కోట్లు దాటిన వసూళ్లు
ఓవర్సీస్ (విదేశాల్లో) కూడా 'లెనిన్' హవా నడుస్తోంది. రెండో రోజు విదేశీ మార్కెట్లలో ఈ చిత్రం రూ. 2.50 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. దీంతో మొత్తం ఓవర్సీస్ గ్రాస్ వసూళ్లు రూ. 5.80 కోట్లకు చేరుకున్నాయి. ఇక దేశీయంగా చూసుకుంటే, రెండు రోజుల్లో ఇండియా గ్రాస్ కలెక్షన్లు రూ. 17.60 కోట్లుగా నమోదయ్యాయి.
మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా లెనిన్ చిత్రం రెండు రోజుల్లోనే సుమారు రూ. 23.40 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి అఖిల్ కెరీర్‌లోనే బెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.
నైట్ షోలలో హౌస్‌ఫుల్ బోర్డులు.. థియేటర్ల ఆక్యుపెన్సీ
శనివారం పూట థియేటర్లలో ప్రేక్షకుల సందడి బాగా కనిపించింది. అందులోనూ ఈవినింగ్, నైట్ షోలకు ఆడియన్స్ భారీగా తరలివచ్చారు. తెలుగు 2D వెర్షన్ రెండో రోజు దేశవ్యాప్తంగా 60.27 శాతం సగటు ఆక్యుపెన్సీని నమోదు చేసింది.
ఉదయం ఆటలకు 39.00 శాతంతో నెమ్మదిగా ప్రారంభమైనప్పటికీ, మధ్యాహ్నానికి అది 64.31 శాతానికి పెరిగింది. ఫస్ట్ షోలకు (ఈవినింగ్) 55.92 శాతం, సెకండ్ షోలకు (నైట్) అత్యధికంగా 73.75 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. తెలుగు EPIQ వెర్షన్‌లో మాత్రం 7.40 శాతం ఆక్యుపెన్సీ వచ్చింది.
లెనిన్ ఇండియా కలెక్షన్స్
రాష్ట్రాల వారీగా చూసుకుంటే, రెండు తెలుగు రాష్ట్రాల (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ) నుంచే ఈ చిత్రానికి రెండో రోజు రూ. 8 కోట్ల భారీ గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. పక్క రాష్ట్రమైన కర్ణాటకలో రూ. 1.10 కోట్లు, తమిళనాడులో రూ. 13 లక్షలు, మిగిలిన భారత రాష్ట్రాల్లో రూ. 15 లక్షల గ్రాస్ వసూలైంది. అన్ని ప్రాంతాలను కలుపుకుని రెండో రోజున లెనిన్ టోటల్ గ్రాస్ కలెక్షన్స్ రూ. 9.38 కోట్లుగా ఉంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


