Lenin Collection: అక్కినేని అఖిల్ సినిమాకు పాజిటివ్ టాక్- లెనిన్ ఫస్ట్ డే కలెక్షన్స్- ఎన్ని కోట్లు వచ్చాయంటే?

Lenin Box Office Collection Day 1: అక్కినేని అఖిల్ లెనిన్ బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే ఓపెనింగ్స్ రాబట్టింది. జూలై 10న థియేటర్లలో విడుదలైన లెనిన్ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్స్‌తో బాక్సాఫీస్ వద్ద జాతరలా సాగుతోంది. మరి లెనిన్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎన్ని కోట్లు వచ్చాయో ఇక్కడ తెలుసుకుందాం.

Published on: Jul 11, 2026, 08:42:46 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Lenin Worldwide Box Office Collection Day 1: అక్కినేని వారసుడు అఖిల్ నటించిన మోస్ట్ అవేటెడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'లెనిన్' థియేటర్లలోకి వచ్చి రాగానే బాక్సాఫీస్ వద్ద పరుగులుపెడుతోంది. శుక్రవారం (జూలై 10) ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైన ఈ చిత్రం అటు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇటు ఓవర్సీస్‌ మార్కెట్‌లోనూ సంచలన ఓపెనింగ్స్ సాధించింది.

అక్కినేని అఖిల్ సినిమాకు పాజిటివ్ టాక్- లెనిన్ ఫస్ట్ డే కలెక్షన్స్- ఎన్ని కోట్లు వచ్చాయంటే?
అక్కినేని అఖిల్ సినిమాకు పాజిటివ్ టాక్- లెనిన్ ఫస్ట్ డే కలెక్షన్స్- ఎన్ని కోట్లు వచ్చాయంటే?

హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సే

మాస్ యాక్షన్ ప్యాక్డ్ రోల్‌లో అఖిల్ సరికొత్త రస్టిక్ అవతారంలో కనిపించడంతో ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ చిత్రంలో అక్కినేని అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించింది. మురళి కిషోర్ అబ్బురు దర్శకత్వం వహించారు.

తొలిరోజే రూ.9.73 కోట్ల గ్లోబల్ వసూళ్లు

ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, 'లెనిన్' చిత్రం మొదటిరోజే బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది. భారతదేశ వ్యాప్తంగా ఈ చిత్రం తొలిరోజు రూ.5.90 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించింది. దేశవ్యాప్తంగా మొత్తం 2,028 షోలలో ప్రదర్శితమైన ఈ సినిమాకు థియేటర్లలో మంచి అక్యుపెన్సీ లభించింది.

దీంతో దేశీయంగా గ్రాస్ వసూళ్లు రూ.6.73 కోట్లకు చేరాయి. ఇక ఓవర్సీస్ మార్కెట్‌లోనూ అఖిల్ క్రేజ్ గట్టిగానే వర్కవుట్ అయింది. విదేశాల్లో ఈ చిత్రం మొదటిరోజే రూ.3 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. దీంతో మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా మొదటిరోజే లెనిన్ సినిమా రూ.9.73 కోట్లు అంటే సుమారు రూ. 10 కోట్ల భారీ కలెక్షన్స్ సాధించి డబుల్ డిజిట్ మార్కుకు చేరువలో నిలిచింది.

తెలుగు రాష్ట్రాల్లో 'లెనిన్' హవా

లెనిన్ సినిమా వసూళ్లలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలే సింహభాగాన్ని పంచుకున్నాయి. మాస్ కంటెంట్‌కు కేరాఫ్ అడ్రస్ అయిన తెలుగు రాష్ట్రాల నుంచే మొదటిరోజు ఏకంగా రూ. 6 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. రాయలసీమ నేపథ్యంలో సాగే పక్కా రా అండ్ రస్టిక్ యాక్షన్ కథ కావడం వల్ల ఇక్కడి బి, సి సెంటర్లలో ఆడియన్స్ థియేటర్లకు క్యూ కడుతున్నారు.

అక్కినేని అఖిల్ నటనకు, ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్లకు థియేటర్లలో ఈలలు, గోలలతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల తర్వాత కర్ణాటకలో ఈ చిత్రం రూ.65 లక్షల గ్రాస్ వసూలు చేయగా, తమిళనాడులో రూ.3 లక్షలు, దేశంలోని మిగిలిన ప్రాంతాల నుంచి మరో రూ.5 లక్షల వసూళ్లు నమోదయ్యాయి.

సమంత స్పెషల్ పోస్ట్..

ఇదిలా ఉంటే, 'లెనిన్' చిత్రానికి అటు ప్రేక్షకుల నుంచే కాకుండా ఇండస్ట్రీ నుంచి కూడా గట్టి మద్దతు లభిస్తోంది. స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ఈ సినిమాపై సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. అఖిల్ అక్కినేనికి, లెనిన్ చిత్ర బృందానికి ఆమె ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు.

"లెనిన్ సినిమాకు, అఖిల్ అక్కినేనికి, అలాగే మొత్తం టీమ్‌కు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ సినిమా చూస్తుంటే ఇప్పుడే ఒక పెద్ద బ్లాక్‌బస్టర్ వైబ్స్ కనిపిస్తున్నాయి" అని సమంత తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చారు.

అఖిల్ రిప్లై

సమంత చేసిన ఈ పోస్ట్‌పై అఖిల్ అక్కినేని వెంటనే స్పందించారు. ఆమెకు కృతజ్ఞతలు తెలుపుతూ రిప్లై ఇచ్చారు. "చాలా చాలా థాంక్స్ సామ్.. నీ శుభాకాంక్షలు మా చిత్ర బృందానికి, నాకు ఎంతో ఎనర్జీని ఇచ్చాయి" అని అఖిల్ అక్కినేని పేర్కొన్నారు.

లెనిన్ సినిమాకు స్టార్ కంపోజర్ ఎస్ తమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. రాయలసీమ ఫ్యాక్షన్, రస్టిక్ డ్రామా నేపథ్యంలో సాగే కథను దర్శకుడు మురళి కిషోర్ అబ్బురు డీల్ చేసిన విధానం మాస్ ఆడియన్స్‌కు విపరీతంగా నచ్చుతోంది. వీకెండ్ కావడంతో శని, ఆదివారాల్లో ఈ వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More