Akhil: ముఖం చూపించలేకపోతున్నా.. ఆమెను చూసి ఒళ్లు దగ్గరపెట్టుకున్నా.. నాన్నతో చెప్పే మాట అదే: అఖిల్ సంచలన వ్యాఖ్యలు
Akhil: ఒక్క సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తున్న అక్కినేని అఖిల్ ఆశలన్నీ ఇప్పుడు లెనిన్ మూవీపైనే ఉన్నాయి. జూలై 10న ఈ సినిమా రిలీజ్ నేపథ్యంలో ఇవాళ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్లో అఖిల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ముఖం చూపించలేకపోతున్నానని అన్నాడు. అతను ఎందుకు అలా చెప్పాడో ఇక్కడ తెలుసుకోండి.
Akhil: అక్కినేని నట వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అఖిల్ కు ఇప్పటివరకూ ఓ బంపర్ హిట్ దక్కలేదు. హీరోగా తనను తాను ఎస్టాబ్లిస్ చేసుకునేందుకు అవసరమైన సక్సెస్ రాలేదు. ఈ నేపథ్యంలో తనకు హిట్ అందిస్తుందని ‘లెనిన్’ మూవీని నమ్ముకున్నాడు అఖిల్. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అతను మాట్లాడుతూ.. ముఖం చూపించలేకపోతున్నానని చెప్పడం హాట్ టాపిక్ గా మారింది.

అక్కినేని అఖిల్ కామెంట్లు
ఆదివారం (జూలై 5) లెనిన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ తిరుపతిలో జరిగింది. ఈ ఈవెంట్ కు నాగార్జున చీఫ్ గెస్ట్ గా వచ్చాడు. ఈ ఈవెంట్లో అఖిల్ మాట్లాడుతూ.. ‘‘గ్యాప్ వచ్చేసింది. మొన్న వైజాగ్ లో సారీ చెప్పా. ఇప్పుడూ సారీ చెప్తున్నా. నా మైండ్ లో ఎంతో బాధగా ఉంది’’ అని అన్నాడు.
ముఖం చూపించలేకపోతున్నా
‘‘రెండున్నరేళ్ల పాటు మీతో కమ్యునికేట్ చేయలేకపోతున్నా. నా ముఖం చూపించలేకపోతున్నా. ఈ రోజు పాజిటివ్ మైండ్ సెట్ తో వచ్చా. ఆ మైండ్ సెట్టే లెనిన్.
లెనిన్ తో మీ ఇంటివాడిని అయిపోవాలి. అదే ప్రధాన ఉద్దేశం. నన్ను ఇంటికి తీసుకెళ్లండి. నాకు రెండేళ్ల క్రితం నందు (డైరెక్టర్ మురళీ కిశోర్) ఓ అద్భుతమైన కథ చెప్పాడు. వేరే వాళ్లకు చెప్పొద్దు, ప్లీజ్ మనమే చేద్దామని అప్పుడు అడిగా’’ అని అఖిల్ చెప్పుకొచ్చాడు.
తమన్ ఇరగ్గొట్టాడు
‘‘నాగవంశీకి నాకు ఓ పాజిటివ్ వైబ్ కుదిరింది. హిట్ అనేది కాదు, మంచి సినిమా ఇద్దామని బయల్దేరాం. ఈ రోజు వర్క్ సాటిస్ఫాక్షన్ తో నిల్చున్నా. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోరు ఇరగ్గొట్టాడు. కొన్ని చోట్ల పూనకాలు వచ్చేలా మ్యూజిక్ ఇచ్చాడు’’ అని అఖిల్ తెలిపాడు.
ఆమెతో సీన్ చేస్తుంటే
‘‘థాంక్యూ భారతి (భాగ్యశ్రీ బోర్సే). తను ఎంతలా కష్టపడిందో నా కళ్లారా చూశా. షూటింగ్ లో ఇరగదీసింది. నాకూ ఓ బాధ్యత వచ్చింది. ఆమెతో సీన్ చేస్తుంటే ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని అనుకున్నా. బ్రహ్మాజీ, శివాజీ, సునీల్ చాలా కూడా చాలా కష్టపడ్డారు’’ అని అఖిల్ చెప్పాడు.
నాన్నతో ఓ మాట
‘‘నాన్నతో ఒక్క మాట అందామనుకుంటున్నా. ఈ రోజు దీని కంటే ఎక్కువ మాట్లాడను. జూలై 10న సినిమా మాట్లాడుతుంది. మనం రెండు సంవత్సరాల నుంచి కష్టపడిన దానికి రియాక్షన్ వచ్చినప్పుడే మాట్లాడతా’’ అని అఖిల్ తన స్పీచ్ ముగించాడు.
మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కిన లెనిన్ మూవీ జూలై 10న రిలీజ్ కానుంది. ఇందులో అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించింది. అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ కలిసి నిర్మించారు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


